Air India: అహ్మదాబాద్ విమానం దుర్ఘటన.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:41 PM
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ఎయిరిండియాకు పలు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి తాజాగా 125 మిలియన్ డాలర్ల పరిహారం అందింది.
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత ఏడాది జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలిన (Air India Plance Crash) ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 260 మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో ఎయిరిండియాకు పలు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి తాజాగా పరిహారం అందింది. ఎయిరిండియాకు 125 మిలియన్ డాలర్లు (రూ.1,100 కోట్లకు పైగా) పరిహారం చెల్లించినట్టు బీమా వర్గాలు తెలిపాయి.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 25 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్లు) పరిహారంగా చెల్లించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. పరిహారం పంపిణీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఆ మొత్తం పెరిగే అవకాశం ఉంది తెలిపాయి.
గత ఏడాది అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో విమానంలోని 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రౌండ్‌లోని మరికొందరితో కలిపి మృతుల సంఖ్య 260 మందికి చేరింది. మృతుల్లో 169 మంది ఇండియన్లు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఒక కెనడియన్ ఉన్నారు. విమానంలోని ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..
61 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ప్రధాని మోదీ
పంజాబ్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం.. భారీఎత్తున ఆయుధాలు స్వాధీనం.
Read Latest National News