ఏఐతో న్యాయవ్యవస్థ బలోపేతం కావాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:53 AM
కృత్రిమ మేధ(ఏఐ)ను అనుసంధానం చేయడం ద్వారా న్యాయవ్యవస్థ బలోపేతం కావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి...ఈ వార్తలు కూడా చదవండి.. అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్ ‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు Read Latest AP News And Telangana News And International News And Telugu News
కానీ, మనుషులే నిర్ణయాత్మకపాత్ర పోషించాలి: జస్టిస్ సూర్యకాంత్
బెంగళూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ(ఏఐ)ను అనుసంధానం చేయడం ద్వారా న్యాయవ్యవస్థ బలోపేతం కావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కానీ న్యాయవ్యవస్థపై ఏఐ స్వారీ చేయకూడదని అన్నారు. ‘కృత్రిమ మేధస్సు.. వివాదాల నియంత్రణ - పరిష్కారం’ అనే అంశంపై బెంగళూరులో నిర్వహించిన సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణ ప్రక్రియ, తీర్పు ప్రకటించే దశలో ఏఐ పాత్ర కొంత మేర మాత్రమే ఉండాలన్నారు. లేదంటే పారదర్శకత, బాధ్యతలేని వ్యవస్థ నిర్మాణానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని హెచ్చరించారు. న్యాయ ప్రక్రియ అంతిమ ఘట్టంలో తీర్పు వెలువరించే మనుషులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషించాలని స్పష్టంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News