రహదారి భద్రత, నిర్వహణకు ఏఐ ఆధారిత డ్యాష్‌కామ్ వ్యవస్థ
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:58 AM
జాతీయ రహదారులపై భద్రతతోపాటు నిర్వహణను మెరుగుపరిచే దిశగా ఎన్‌హెచ్‌ఏఐ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందుకోసం...
న్యూఢిల్లీ, మార్చి 21: జాతీయ రహదారులపై భద్రతతోపాటు నిర్వహణను మెరుగుపరిచే దిశగా ఎన్‌హెచ్‌ఏఐ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందుకోసం కృత్రిమ మేధను ఉపయోగించనుంది. 40 వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్‌పై కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత డ్యాష్‌కామ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈమేరకు రూట్ పెట్రోల్ వెహికిల్స్(ఆర్‌పీవీలు)పై ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చే సి పర్యవేక్షించనున్నారు. ఈ వాహనాలతో వారానికి ఒకసారి హైవేలపై సర్వే నిర్వహిస్తారు. రహదారులపై గుంతలు, మసకబారిన లేన్ గుర్తులు, పనిచేయని వీధిలైట్లు వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి ఇవి సహాయపడతాయని అధికారులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News