Share News

హర్భజన్ సింగ్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తల నిరసన

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:36 PM

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు.. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వారందరూ బీజేపీలో చేరారు. ఇలా ఆప్‌ని వీడిన ఎంపీల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు.

హర్భజన్ సింగ్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తల నిరసన
Harbhajan Singh

ఇంటర్నెట్ డెస్క్: నిన్న(శుక్రవారం) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వారందరూ బీజేపీలో చేరారు. ఇలా ఆప్‌ని వీడిన ఎంపీల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన పంజాబ్ నుంచి ఆప్ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక హర్భజన్ బీజేపీలో చేరడంపై ఆప్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జలంధర్‌లోని హర్భజన్ ఇంటిని చుట్టుముట్టి నిరసన చేపట్టారు. దీంతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.


హర్భజన్ సింగ్ నివాసం వెలుపల ఉన్న గోడలపై నల్ల రంగుతో 'గదర్ (ద్రోహి)' అని రాశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచాడంటూ ఆప్ మద్దతురాలు మండిపడుతున్నారు. భజ్జీ బీజేపీలోకి పారిపోయాడంటూ ఆయన ఇంటి వద్ద నినాదాలు చేశారు. జలంధర్ నగర మేయర్ వనీత్ ధీర్, ఆప్ నేత నితిన్ కోహ్లీ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పరిస్థితి విషమించడంతో హర్భజన్ సింగ్ నివాసం, మరో ఎంపీ అశోక్ మిత్తల్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీలు చేసిన ఈ ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా ఆప్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేవరకు దిగ్బంధనం కొనసాగుతుంది.. ఇరాన్‌కు అమెరికా మంత్రి వార్నింగ్..

మీ ఒంటరితనానికి ఈ అలవాట్లే కారణం

Updated Date - Apr 25 , 2026 | 05:56 PM