మధ్యప్రదేశ్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 9 మంది మృతి.!
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:02 AM
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 9 మంది మృతి చెందినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందారు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ జిల్లాలోని బండా తహసీల్‌లోని ఓ మద్యం దుకాణంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారు శనివారం రాత్రి మద్యం తాగారు. ఇంటికి వచ్చిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంలో చికిత్స పొందుతూ 9 మంది మృతి చెందారు. కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సుజానియా
సమాచారం అందుకున్న ఎస్పీ అనురాగ్ సుజానియా ఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా బండా తహసీల్‌లోని ఘూగర్,నౌరాజ్, బరాజ్ ఇతర చుట్టుపక్కల గ్రామస్థులు శనివారం రాత్రి ఓ దుకాణంలో మద్యం సేవించినట్లు గుర్తించామని తెలిపారు. అయితే, కల్తీ మద్యం తాగడం వల్లనే గ్రామస్థులు మరణించారని ఇప్పుడే నిర్ధారించలేమని ఆయన అన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతనే వాస్తవాలు బయటపడతాయని ఆయన అన్నారు.
ఇవీ చదవండి:
ఏకే-203 రైఫిళ్లకు అదానీ సంస్థ నుంచి బుల్లెట్లు