Share News

బతికుండగానే తన పెద్దకర్మ చేసుకున్న 80 ఏళ్ల వృద్ధుడు!

ABN , Publish Date - Nov 16 , 2026 | 09:56 AM

సాధారణంగా ఎవరైనా మరణించిన 13 రోజుల తర్వాత పెద్దకర్మ నిర్వహించడం సాంప్రదాయం. కానీ, ఓ 80 ఏళ్ల వృద్ధుడు సంప్రదాయాలకు భిన్నంగా తానే స్వయంగా బతికుండగానే తన 'పెద్దకర్మ' వేడుకను నిర్వహించుకున్నారు.

బతికుండగానే తన పెద్దకర్మ చేసుకున్న 80 ఏళ్ల వృద్ధుడు!
Man Performs Own Funeral

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఎవరైనా మరణించిన 13 రోజుల తర్వాత పెద్దకర్మ నిర్వహించడం సాంప్రదాయం. కానీ, ఓ 80 ఏళ్ల వృద్ధుడు సంప్రదాయాలకు భిన్నంగా తానే స్వయంగా బతికుండగానే తన 'పెద్దకర్మ' వేడుకను నిర్వహించుకున్నారు. ఈ వినూత్నఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో చోటుచేసుకుంది. జోరి గ్రామానికి చెందిన చౌదరి బాల్జోర్ సింగ్ అనే వృద్ధుడు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం జరిగిన వేడుకకు సుమారు 900 మంది అతిథులు హాజరై సామూహిక విందులో పాల్గొన్నారు.


ఈ అసాధారణ కార్యక్రమంలో బాల్జోర్ సింగ్ స్వయంగా అతిథులను సాదరంగా ఆహ్వానించడమే కాకుండా వారితో కలిసి భోజనం చేశారు. ఈ వేడుకలో సింగ్ సాంప్రదాయబద్ధంగా హవనం నిర్వహించి, 'పాగ్రీ' (తలపాగా) ధరించే తంతును పూర్తి చేశారు. అంతేకాకుండా, తన కుటుంబ బాధ్యతలను మనవడు ముకుల్‌కు అప్పగిస్తూ లాంఛనంగా తలపాగాను అందజేశారు. ఈ విచిత్ర నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని బాల్జోర్ సింగ్ వివరిస్తూ.. తాను మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు, వారి మధ్య గొడవలు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


తన అంత్యక్రియల ఏర్పాట్ల విషయంలో భవిష్యత్తులో ఇతరుల నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బతికుండగానే ఈ కార్యక్రమం పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానిక చౌదరి కమ్యూనిటీ సభ్యులతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి కేపీ మాలిక్ కూడా ఈ వేడుకకు హాజరవడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఒకటిరెండు మ్యాచ్‌లు రోహిత్-కోహ్లీ కెరీర్‌ను డిసైడ్ చేయలేవు: అజయ్ జడేజా

రామోజీ రావు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి..

బ్రేకప్ చెప్పిందని ఇంతటి ఘాతుకమా?.. మాజీ ప్రియురాలి కుక్కలను చంపి వీడియో కాల్..

Updated Date - Nov 16 , 2026 | 10:07 AM