Indore Baby Incident: ఐదు నెలల బాలుడి ప్రాణం తీసిన 'పాలు'
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:46 PM
దేశంలోనే స్వచ్ఛ నగరంగా అవార్డులు పొందిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత తాగునీటి వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భగీరథ్‌పురలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మరణించారు. తాజాగా ఆ నీటిని పాలలో కలిపి ఇవ్వడంతో ఐదు నెలల బాలుడు మరణించాడు.
మధ్యప్రదేశ్, జనవరి 2: ఇండోర్‌లోని భగీరత్‌పురలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాలల్లో కలిసిని కలుషిత మైన నీరు అవ్యాన్ సాహు అనే ఐదు నెలల చిన్నారి(5 Month Old Baby Pass Away)ఉసురు తీసింది. బాధితుడి తండ్రి సునీల్ సాహు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరికి పదేళ్ల క్రితం కింజల్ అనే పాప పుట్టింది. చాలా ఏళ్ల ఎదురు చూపుల తరువాత గత ఏడాది జూలై 8న అవ్యాన్ అనే బాబు జన్మించాడు. పదేళ్ల నిరీక్షణ తర్వాత బాబు పుట్టడంతో ఆ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. చక్కటి ఆరోగ్యంగా ముద్దుల మూటగడుతున్న చిన్నారిని చూసి అమ్మమ్మ ఎంతో మురిసిపోయింది. అయితే అవ్యాన్ పుట్టిన తరువాత కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా తల్లికి పాలు పడలేదు. డాక్టర్ల సలహా మేరకు ప్యాకెట్ పాలు పట్టిస్తున్నారు. రోజూ లాగానే రెండు రోజుల క్రితం బిడ్డకు తమకు సప్లయ్ అయ్యే కుళాయి వాటర్ పట్టి.. పాలు కలిపి తాగించారు. ఆ తర్వాత అవ్యాన్‌కు జ్వరం, డయేరియాలు వచ్చాయి.
దీంతో వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. వారు మెడిసిన్ ఇచ్చారు. అయితే తర్వాత ఆదివారం అతడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో అవ్యాన్ మృతి చెందాడు. కుళాయి నీరు వడకట్టి, పటికను జోడించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకున్నా.. కూడా ఘోరం చోటుచేసుకుంది. అవ్యాన్ సాహు మృతితో ఆ కుటుంబంలో ఒక్కసారి తీరిని విషాదం అలుముకుంది. బిడ్డను కోల్పోయిన తల్లి గుండెలు పగిలేలా విలపిస్తోంది. నీరు కలుషితమైందని తమకెవరూ చెప్పలేదంటూ బాలుడి తండ్రీ సునీల్ కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ నీరు తాగితే ప్రమాదం అని తెలుసు.. అయినా ప్యాకెట్ పాలలో నీళ్లు కలపి..బాబుకు పట్టించాలని వైద్యులు సలహా ఇచ్చారని సునీల్ తెలిపాడు. అందుకే తాము తాగే నీరు పాలలో కలిపి.. తమ బిడ్డ ప్రాణాలు(baby pass away due to bad water) తీసుకున్నామంటూ సునీల్ కన్నీటి పర్యంతమయ్యాడు. తాము నమ్మిన నీరే బిడ్డ ప్రాణం తీసిందని వాపోతున్నాడు. తాము పేదోళ్లమని, తాము ఎవర్నీ నిందించలేమంటూ బాలుడి అమ్మమ్మ రోదించింది. ఇది మా తలరాత అంటూ అసలు ఏం జరిగిందో అర్థం కాక పదేళ్ల కింజల్ నిశ్శబ్దంగా నిర్జీవంగా ఉన్న తమ్ముుడి వైపు దీనంగా చూస్తోంది.
అసలు సంగతి ఏంటంటే?
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఏడేళ్లు గుర్తింపు పొందిన ఇండోర్(Indore) పట్టణంలోని భగీరత్‌పుర ప్రాంతంలో నర్మదా నది నుంచి వచ్చే పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలిసి తాగునీరు కలుషితమైంది. దీంతో చాలామంది చనిపోయారు. కలుషిత నీరు తాగి డయేరియాతో ఈ మరణాలు సంభవించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. పైప్‌లైన్ లీకేజీ(, Madhya Pradesh water crisis) కారణంగా ఆ ప్రాంతంలోని తాగునీరు కలుషితమైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. గత పది రోజులుగా పలువురు బాధితులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్నారు. మరోవైపు ఈవిషయంపై దర్యాప్తు నిమిత్తం మధ్యప్రదేశ్ సర్కార్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి..
విషం సరఫరా చేస్తున్నారు.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్ నిప్పులు
ఇండోర్‌లో దారుణం.. తాగు నీరు కలుషితం కావడంతో 10 మంది మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి