సువేందు క్యాబినెట్ విస్తరణ.. 35 మంది మంత్రులతో జూన్ 1న ప్రమాణస్వీకారం
ABN , Publish Date - May 31 , 2026 | 06:39 PM
కీలకమైన మంత్రివర్గ విస్తరణను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేపట్టనుంది. కొత్తగా 35 మందిని మంత్రివర్గంలో తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదివారంనాడు ప్రకటించారు.
కోల్‌కతా: కీలకమైన మంత్రివర్గ విస్తరణను పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వం చేపట్టనుంది. కొత్తగా 35 మందిని మంత్రివర్గంలో తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదివారంనాడు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు నబన్నాలో జరిగే కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణస్వీకారం చేయిస్తారని తెలిపారు. ఈ క్యాబినెట్ విస్తరణలో పలువురు బీజేపీ సీనియర్ నేతలకు కీలక పదవులు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
కాగా, సంస్థాగత అవినీతి, మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు రెండు కమిషన్లను ఏర్పాటు చేయాలని మే 18న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సువేందు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై సువేందు అధికారి మాట్లాడుతూ, సంస్థాగత అవినీతిపై ఏర్పాటు చేస్తున్న కమిటీకి కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిశ్వజిత్ బసు సారథ్యం వహిస్తారని, మహిళలపై అకృత్యాల నిరోధానికి ఏర్పాటు చేసే కమిషన్‌కు రిటైర్డ్ జస్టిస్ సమాప్తి ఛటర్జీ సారధ్యం వహిస్తారని చెప్పారు. రెండు కమిషన్లు జూన్ 1 నుంచి పని ప్రారంభిస్తాయని తెలిపారు. పారదర్శకత, పౌరుల హక్కుల పరరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ
పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్