Share News

టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ

ABN , Publish Date - May 31 , 2026 | 05:25 PM

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తీవ్ర సంచలనమవుతోంది. బీజేపీ నేతలే తనను చంపేందుకు కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను తాజాగా బీజేపీ ఖండించింది. టీఎంసీలో అంతర్గత విభేదాలే దాడికి కారణంగా కనిపిస్తోందని పేర్కొంది.

టీఎంసీలో అంతర్గత కుమ్ములాటలే అభిషేక్ బెనర్జీపై దాడికి కారణం... బీజేపీ
Abhishek Banerjee

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee)పై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తీవ్ర సంచలనమవుతోంది. బీజేపీ నేతలే తనను చంపేందుకు కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను తాజాగా బీజేపీ ఖండించింది. దాడి నిందితుల్లో అరెస్టయిన ఒక వ్యక్తికి టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మిత్రాతో సంబంధాలున్నాయని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. టీఎంసీలో అంతర్గత విభేదాలే దాడికి కారణంగా కనిపిస్తోందని అన్నారు. 'ఇది కేవలం ఒకే ఒక్క సంఘటనకు పరిమితమా? తృణమూల్ కాంగ్రెస్‌లో లోతైన వర్గ విభేదాలే కారణమా? జవాబులు కన్నా ప్రశ్నలే ఎక్కువ తలెత్తుతున్నాయి' అని ఆయన పేర్కొన్నారు.


మమతా బెనర్జీ తర్వాత టీఎంసీలో నెంబర్-2 గా పేరున్న అభిషేక్ బెనర్జీ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర అల్లర్లలో బాధితులైన కుటుంబాన్ని పరామర్శించడానికి శనివారంనాడు వెళ్లారు. ఆయనపై అకస్మాత్తుగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడ్లు, రాళ్లు విసురుతూ దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దారు. భద్రతా సిబ్బంది ఆయనకు హెల్మెట్ పెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై టీఎంసీ విరుచుకుపడింది. బీజేపీ మండల అధ్యక్షుడు అభిజిత్ బిశ్వాస్ ఈ దాడికి నేతృత్వం వహించి అల్లరిమూకను రెచ్చగొట్టారంటూ అతని ఫోటోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విడుదల చేసింది. ఈ ఘటనకు బాధ్యత నుంచి ముఖ్యమంత్రి సువేందు అధికారి తప్పించుకోవచ్చేమో కానీ ఈ ఘటనపై తలెత్తిన ప్రశ్నల నుంచి తప్పించుకోలేరని విమర్శించింది. జనాగ్రహమే దాడికి కారణమని బీజేపీ చెబుతున్నప్పుడు ఘటనాస్థలిలో బీజేపీ నేత ఎందుకు ఉన్నారు? చురుకుగా ఎందుకు వ్యవహరించారు? అని వరుస ప్రశ్నలు గుప్పించింది.


శశిథరూర్ స్పందన

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. 'రాజకీయాల్లో ఈ తరహా ఘటనలు మంచిది కాదు. ఏమి చెప్పదలచుకున్నా బ్యాలెట్ బాక్స్‌తోనే సమాధానం చెప్పడం మన సంప్రదాయం. అంతేకానీ రాళ్లతో కొట్టి చెప్పడం సరికాదు' అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

నేనో రాజకీయ హింసా బాధితుణ్ని.. దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ

మంత్రులు, డిప్యూటీ సీఎంలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. మల్లికార్జున్ ఖర్గే

Updated Date - May 31 , 2026 | 05:58 PM