Maoists Surrender in Sukma: ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Jan 14 , 2026 | 02:48 PM
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం మరో 29 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా గోగుండ ప్రాంతానికి చెందిన 29 మంది మావోయిస్టులు బుధవారం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘం (డీఏకేఎమ్ఎస్) నేత పొడియం బుధ్రాతో పాటు డీఏకేఎమ్ఎస్, జనత సర్కార్ వింగ్ వర్గాలతో పాటు ఇతర మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. తమ ఆయుధాలను సరెండర్ చేశారు. పొడియం బుధ్రాపై రూ.2 లక్షల రివార్డు ఉంది (Maoists Surrender in Sukma District).
మావోయిస్టుల పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా అనేక మంది మావోయిస్టులు ఆయుధాలను త్యజించి జనజీవన శ్రవంతిలోకి వస్తున్నారని చెప్పారు. నక్సలిజంను వీడి సామాన్య జనజీవనాన్ని అవలంబించాలని ఈ సందర్భంగా ఇతర మావోలకు ఆయన పిలుపునిచ్చారు. కొంతకాలంగా మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతుండటంతో గోగుండ ప్రాంతంలో (దర్భా డివిజన్) ఉద్యమ ప్రాబల్యం మరింతగా తగ్గినట్టైంది.
గోగుండలో సెక్యూరిటీ క్యాంపు ఏర్పాటుతో మావోయిస్టుల కార్యకలాపాలు చాలా వరకూ తగ్గిపోయాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మావోయిస్టు మద్దతుదారుల నెట్‌వర్క్ బలహీనపడిందని, ఫలితంగా సరెండర్లు పెరిగాయని చెబుతున్నారు. జనవరి 8న దంతేవాడలో 63 మంది సరెండర్ కాగా అంతకుముందు రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 మంది లొంగిపోయారు. ఈ ఏడాది మార్చ్ 31 నాటికి నక్సలిజంను రూపుమాపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..