గల్ఫ్‌లోని భారతీయుల క్షేమం గురించి నిరంతరం సంప్రదింపులు: విదేశాంగ శాఖ
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:54 AM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది నావికులు ఉన్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది నావికులు ఉన్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తుండటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రత, సంక్షేమం కోసం అక్కడి భారత దౌత్య కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపింది (22 Indians killed).
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మరణించారని, వారిలో 14 మంది నావికులు ఉన్నారని వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, వారి భద్రతకు అవసరమైన చర్యలపై దృష్టి సారించామని తెలిపారు. సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు (Ministry of External Affairs).
ఇటీవల సౌదీలోని దమ్మామ్‌లో ఉన్న కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించగా, పలువురు గాయపడ్డారు (Indians in Gulf countries). షైబా చమురు క్షేత్రంపై జరిగిన దాడిలోనూ ఒక భారతీయుడు గాయపడ్డాడు. యెమెన్‌కు చెందిన హౌతీ దళాలు సౌదీ అరేబియాలోని పౌర, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంపై భారత్ గతంలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ముప్పుగా మారవచ్చని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..