-
-
Home » Mukhyaamshalu » Latest Breaking viral trending National and International Andhra Pradesh Telangana Live Updates on Jan 4th kjr
-
Breaking News: ముగిసిన ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ
ABN , First Publish Date - Jan 04 , 2026 | 06:36 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 04, 2026 21:23 IST
హైదరాబాద్: ముగిసిన ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ
ఏడు గంటలకు పైగా నవీన్‌రావును ప్రశ్నించిన సిట్
డివైజ్‌లతో ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలు ఆవాస్తవం: నవీన్ రావు
2024 సెప్టెంబర్‌లో 3 గంటల పాటు విచారణ చేశారు: నవీన్‌రావు
ఈరోజు మరోసారి విచారణకు రావాలని చెప్పారు: నవీన్‌రావు
ఉదయం నుంచి విచారణలో భాగంగా...
గత విచారణలో అడిగిన విషయాలే అడిగారు: నవీన్‌రావు
సిట్ విచారణకు అన్ని విధాలుగా సహకరించా: నవీన్‌రావు
మళ్ళీ విచారణకు రావాలని చెప్పలేదు..
ఎప్పుడు పిలిచిన రావడానికి సిద్ధం: నవీన్‌రావు
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వ్యక్తులతో...
నాకు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు: నవీన్‌రావు
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావును...
రెండో సారి విచారించారు అధికారులు: ఎమ్మెల్సీ నవీన్‌రావు
ఎలాంటి ఆధారాలు లేకుండా విచారించారు: నవీన్‌రావు
రాజకీయ కుట్రలో భాగంగా వేధిస్తున్నారు తప్ప ఏమీ లేదు
ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు: నవీన్‌రావు
ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు పేరుతో వేధిస్తున్నారు: నవీన్‌రావు
ఇది BRS పార్టీపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నా: నవీన్‌రావు
ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నాం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
-
Jan 04, 2026 21:22 IST
తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు
2024లో హరీష్‌రావు ఆదేశాలతో పోలీస్ అధికారి రాధాకిషన్‌రావు...
తన ట్యాప్ చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పీఎస్‌లో చక్రధర్ ఫిర్యాదు
-
Jan 04, 2026 21:21 IST
ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ
BRS నేత హరీష్‌రావు విచారణకు అనుమతి కోరుతూ...
సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణ
-
Jan 04, 2026 18:36 IST
ఢిల్లీ: జగన్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఆగ్రహం
జగన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై మాట్లాడే అర్హతే లేదు: కలిశెట్టి
ఎయిర్‌పోర్ట్‌కు సహాయ సహకారాలు అందించినట్లు మాట్లాడుతున్న...
జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: ఎంపీ కలిశెట్టి
-
Jan 04, 2026 18:35 IST
అనకాపల్లి: నక్కపల్లిలో హోంమంత్రి అనిత
విద్యుత్ చార్జీలు పెంపులేదన్న హామీని నిలబెట్టుకున్నాం: అనిత
గత ప్రభుత్వం ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది: అనిత
రూ.32 వేల కోట్ల వరకు ప్రజలపై భారం వేశారు: హోంమంత్రి అనిత
విద్యుత్ చార్జీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు
ట్రూఅప్ చార్జీలపై ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది
ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూఅఫ్ చార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది
ప్రతి యూనిట్‌కు 13 పైసలు తగ్గించింది ప్రభుత్వం
-
Jan 04, 2026 17:29 IST
జగిత్యాల: MLA సంజయ్‌ని ఉద్దేశించి మాజీ MLC జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదు.. మేం జేబులు నింపుకునే వాళ్లం కాదు: మాజీ MLC జీవన్‌రెడ్డి
పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించను: మాజీ MLC జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ జెండా పట్టనోడు.. టికెట్లు ఇస్తానంటే ఊరుకోను: జీవన్‌రెడ్డి
-
Jan 04, 2026 16:21 IST
కృష్ణా జలాలపై రేవంత్, ఉత్తమ్ వాస్తవాలు మాట్లాడారు: జగ్గారెడ్డి
కాళేశ్వరం కట్టాకే తెలంగాణకు నీళ్లు వచ్చినట్టు హరీష్‌రావు మాట్లాడారు
కాళేశ్వరం వల్లే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నారని ప్రచారం చేశారు
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఎన్ని డ్యామ్‌లు కట్టారు?: జగ్గారెడ్డి
సింగూరు, మంజీరా డ్యామ్‌లు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారు: జగ్గారెడ్డి
హైదరాబాద్ ప్రజలకు సింగూరు, మంజీరా డ్యామ్‌ల ద్వారా తాగునీరు: జగ్గారెడ్డి
-
Jan 04, 2026 16:20 IST
జగిత్యాల: MLA సంజయ్‌ని ఉద్దేశించి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదు.. మేం జేబులు నింపుకునే వాళ్లం కాదు
పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించను: మాజీ MLC జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ జెండా పట్టనోడు.. టికెట్లు ఇస్తానంటే ఊరుకోను: జీవన్‌రెడ్డి
-
Jan 04, 2026 16:20 IST
చిత్తశుద్ధితో చర్చలు లేవు: రఘునందన్‌రావు
సంగారెడ్డి: అసెంబ్లీలో పాలమూరు, కృష్ణా జలాలపై మాట్లాడకుండా..
ఒకరినొకరు తిట్టుకోవడమే సరిపోతుంది: ఎంపీ రఘునందన్‌రావు
అసెంబ్లీలో చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదు: రఘునందన్‌రావు
పాలమూరు జిల్లాకు BRS, కాంగ్రెస్ చేసిందేమీ లేదు: రఘునందన్‌రావు
రేవంత్ ఏదో చేస్తారని నమ్మిన పాలమూరు ప్రజలకు నిరాశే మిగిలింది
ప్రెజెంటేషన్ల పేరిట ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు: రఘునందన్
-
Jan 04, 2026 14:56 IST
చరిత్రాత్మక ఘట్టం నమోదైంది: సీఎం చంద్రబాబు
అమరావతి: భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్... ఎయిర్‌పోర్టుకు కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
ఏపీ విమానయాన రంగంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది: సీఎం చంద్రబాబు
వ్యాలిడేషన్ ఫ్లైట్‌ను సక్సెస్ చేయడం శుభపరిణామం: చంద్రబాబు
-
Jan 04, 2026 14:55 IST
తొలి విమానం ల్యాండింగ్
అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండింగ్
ప్రాజెక్టు పురోగతిలో కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక పాత్ర: అచ్చెన్న
ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి అచ్చెన్న
-
Jan 04, 2026 14:54 IST
ఏలూరు: ముసునూరు మం. పూడిలో ఓ కుటుంబం సెల్ఫీ కలకలం
కులపెద్దల పంచాయితీతో కలత చెంది ఆత్మహత్యంటూ సెల్ఫీ వీడియో
నాటుసారా విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన స్థానికుడు బొట్ల కనకరావు
కనకారావు కుటుంబానికి జరిమానాతో పాటు గ్రామ బహిష్కరణ విధింపు
-
Jan 04, 2026 13:38 IST
తాగుబోతులకు పోలీసుల పనిష్‌మెంట్..
కృష్ణా: మచిలీపట్నంలో తాగుబోతులకు పోలీసుల పనిష్‌మెంట్..
నడిరోడ్డుపై నడిపించుకుంటూ పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు..
గత రాత్రి గణేష్ భవన్‌పై వీరంగం సృష్టించిన ముగ్గురు యువకులు..
మద్యం మత్తులో పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా..
సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్‌పై దాడికి పాల్పడిన తాగుబోతులు.
-
Jan 04, 2026 13:23 IST
హైదర్ నగర్‌లో దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి..
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ నగర్‌లో దారుణం
ఓ గేటెడ్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ లో పడి అర్జున్ కుమార్(3) అనే బాలుడు మృతి..
ఆడుకుంటూ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడిన అర్జున్ కుమార్...
ఎవరు గమనించకపోవటంతో నీటిలో మునిగి మృతి చెందిన బాలుడు...
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Jan 04, 2026 11:06 IST
భోగాపురానికి చేరిన తొలి విమానం..
విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిన తొలి విమానం..
ఢిల్లీ నుండి భోగాపురానికి వచ్చిన విమానంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు..
కార్యక్రమానికి హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సీ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పూసపాటి అదితివిజయలక్ష్మిగజపతిరాజు, లోకం నాగమధవి.
తొలి దశ నిర్మాణ పనులకు రూ.4,592 కోట్ల వ్యయం
-
Jan 04, 2026 10:59 IST
MLC నవీన్‌రావును ప్రశ్నించనున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన MLC నవీన్‌రావు..
జూబ్లీహిల్స్ పీఎస్‌లో MLC నవీన్‌రావును ప్రశ్నించనున్న సిట్..
డివైజ్‌తో ట్యాపింగ్ చేయించినట్టు MLC నవీన్‌రావు ఆరోపణ..
త్వరలోనే BRS కీలక నేతలను విచారించనున్న సిట్.
-
Jan 04, 2026 10:59 IST
కేరళలో భారీ అగ్నిప్రమాదం..
త్రిస్సూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో చెలరేగిన మంటలు..
పార్కింగ్‌లో ఉన్న బైక్‌లు, కార్లు దగ్ధం..
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.
-
Jan 04, 2026 10:10 IST
నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు.
రేపు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు రానున్న సీఎం..
గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు..
తెలుగు మహాసభల్లో పాల్గొన్న అనంతరం ఉదయం 11.35 గంటలకు బయలుదేరి సచివాలయానికి చేరుకోనున్న సీఎం..
సచివాలయంలో పలు సమీక్షల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
-
Jan 04, 2026 10:08 IST
రెండో రోజు తెలుగు మహాసభలకు.. మారిషస్ అధ్యక్షుడు..
గుంటూరు: రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు..
తెలుగు మహాసభల్లో పాల్గొననున్న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్..
ప్రపంచ తెలుగు మహాసభలకు ఓ దేశ అధ్యక్షుడు రావడం ఇదే ప్రథమం..
రేపు తెలుగు మహాసభల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..
రేపటి వరకు కొనసాగనున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు.
-
Jan 04, 2026 09:40 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ..
ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చిన సిట్..
ఈరోజు 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకం గా మారిన పొలిటికల్ లీడర్ల విచారణ..
ప్రైవేట్ డివైస్ తో ఫోన్ ట్యాపింగ్ చేపించినట్టు నవీన్ రావ్ పై ఆరోపణలు..
త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సైతం విచారణ చేయనున్న సిట్.
-
Jan 04, 2026 09:32 IST
మరి కొద్దిసేపట్లో భోగాపురంలో దిగనున్న తొలి విమానం..
మరి కొద్దిసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగనున్న తొలి విమానం..
ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం..
ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు , ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు..
తొలి విమానం ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డీజీసీఏ..
ఇప్పటికీ రన్‌వే సిద్ధం చేసి ఫ్లైట్ నడిపేందుకు ట్రైయల్స్ నిర్వహణ.
-
Jan 04, 2026 09:25 IST
గాలి పటాలు ఎగరేస్తున్న బాలుడిపై కుక్కల దాడి..
అంబర్ పేట్ గోల్నాక డివిజన్ అన్నపూర్ణ నగర్ మూసి నది ఒడ్డున ఘటన..
గాలి పటాలు ఎగరేస్తున్న సమయంలో 8 సంవత్సరాల బాలుడిపై ఐదు కుక్కల దాడి
దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు కోరేంటి ఫీవర్ ఆసుపత్రికి తరలింపు..
మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఉస్మానియాకు తరలింపు..
తక్షణమే కుక్కలను ఇక్కడి నుంచి తరలించాలని ప్రజల డిమాండ్.
-
Jan 04, 2026 09:00 IST
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా డెల్సీ రోడ్రిగ్జ్
వెనెజువెలా సుప్రీంకోర్టు నియామకం..
ప్రెసిడెంట్ మదురోను అమెరికా కస్టడీలోకి తీసుకోవడంతో చర్యలు..
-
Jan 04, 2026 08:58 IST
గీజర్ సిలిండర్ పేలి.. 8 మందికి తీవ్ర గాయాలు..
అనంతపురం: తాడిపత్రిలో అగ్ని ప్రమాదం..
ఇంట్లో గీజర్ సిలిండర్ పేలి చెలరేగిన మంటలు..
ఇద్దరు చిన్నారుల సహా 8 మందికి తీవ్ర గాయాలు..
ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్సత్రికి తరలింపు.
-
Jan 04, 2026 08:02 IST
తెలంగాణలో పొగమంచు ప్రభావం
హైవేలపై కమ్మేసిన పొగమంచు, వాహనదారులకు ఇక్కట్లు..
ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి.
-
Jan 04, 2026 07:55 IST
గంగారం, కొత్తగూడ అడవుల్లో పెద్దపులి సంచారం..
మహబూబాబాద్ : గంగారం, కొత్తగూడ అడవుల్లో పెద్దపులి సంచారం
గంగారం మండలం దుబ్బగూడెం, జంగాలపల్లి అడవుల్లో పులి పాదముద్రలు గుర్తించిన అధికారులు..
కొత్తగూడ మండలంలోనూ పులి సంచరించినట్టు ప్రచారం..
అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించి చెప్పిన అధికారులు.
-
Jan 04, 2026 07:51 IST
పద్మావతి యూనివర్సిటీలో 23 మందికి పదోన్నతులు..
తిరుపతి: పద్మావతి మహిళా యూనివ ర్సిటీలో పనిచేస్తున్న 23 మంది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు..
పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసిన వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజని.
-
Jan 04, 2026 07:50 IST
ఎంపీపీ విజయలక్ష్మిపై సస్పెన్షన్ వేటు..
తిరుపతి: వడమాలపేట మండల పరిషత్ అధ్యక్షురాలు వై. ఎస్.విజయలక్ష్మిపై వైసీపీ సస్పెన్షన్ వేటు
ఆమె పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి రోజా అధిష్ఠానానికి ఫిర్యాదుతో నిర్ణయం..
ఇటీవల వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులే విజయలక్ష్మిపై అవిశ్వాసాన్ని ప్రతిపాదన..
అది వీగిపోవడంతో విజయలక్ష్మి ఎంపీ పీగా కొనసాగుతున్న వైనం.
-
Jan 04, 2026 07:25 IST
ఫిబ్రవరి రెండో వారంలో కొల్లేరు ఉత్సవం..
ఏలూరు: ఫిబ్రవరి రెండో వారంలో కొల్లేరు ఉత్సవం..
ఏలూరు మండలం మాధవాపురం, కైకలూరు మండలం ఆటపాక వద్ద ప్రత్యేక బోటింగ్ పాయింట్లు..
కొల్లేరు ఉత్సవం సందర్భంగా వివిధ అంశాలలో పోటీలు..
వలస పక్షులను తిలకించేందుకు బైనాక్యూలర్లు, వాచ్ టవర్లు ఏర్పాటు..
ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష.
-
Jan 04, 2026 07:12 IST
నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన
నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు.
-
Jan 04, 2026 07:10 IST
నేడు ముంబైకి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్
సుప్రీం అడ్వొకేట్, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో భేటీ..
రేపు సుప్రీంకోర్టులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు..
కేసు విచారణతో భేటీకి ప్రాధాన్యత.
-
Jan 04, 2026 07:08 IST
వెనిజువెలాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది: ట్రంప్
వెనిజువెలా ఆయిల్ కంపెనీలు మా ఆధీనంలో ఉంటాయి..
వెనిజువెలా ప్రతిపక్ష నేత మరియాకు ప్రజల మద్దతు లేదు..
వెనిజువెలాను మేమే పరిపాలిస్తాం: ట్రంప్
-
Jan 04, 2026 07:05 IST
కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు..
తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు..
శనివారం వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న 88వేల 662 మంది భక్తులు..
ఈ ఏడాది మొదట్లోనే రూ.5 కోట్లు దాటిన హుండీ ఆదాయం..
శనివారం హుండీ ద్వారా శ్రీవారికి రూ.5.05 కోట్ల ఆదాయం..
ఐదు రోజుల్లో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న 3లక్షల 74వేల 228 మంది భక్తులు.
-
Jan 04, 2026 06:37 IST
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,37,900..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,27,690..
హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,37,500.