-
-
Home » Mukhyaamshalu » ap telangana national international viral and trending ABN Andhrajyothy telugu live updates of 8th february 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 08 , 2026 | 06:04 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Feb 08, 2026 21:53 IST
మేడారంలో నాలుగోరోజు హుండీల లెక్కింపు
ఇప్పటివరకు 615 హుండీల్లో రూ.10.71 కోట్ల ఆదాయం.
ఇప్పటి వరకు 18 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యం.
-
Feb 08, 2026 21:25 IST
పల్నాడు జిల్లా: కోలాహలంగా ముగిసిన కొండవీడు కోట ఉత్సవాలు.
ముగింపు వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణం రాజు.
కొండవీడు కోట ఉత్సవాలకు పోటెత్తిన పర్యటకులు.
అలరించిన సినీ గాయకుల సాంస్కృతిక కార్యక్రమాలు.
కనువిందు చేసిన ప్లవర్ షో, క్రాకర్స్ షో.
-
Feb 08, 2026 21:22 IST
కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
అన్నమయ్య జిల్లాకు చెందిన ముగ్గురు మృతి.
15 మందికి గాయాలు.
-
Feb 08, 2026 21:20 IST
నంద్యాల : శ్రీశైలంలో వైభవంగా మొదటిరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులు ఏఈవో మోహన్.
ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై ధ్వజపటావిష్కరణ.
ధ్వజపటావిష్కరణ చేసిన అర్చకులు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు.
-
Feb 08, 2026 21:06 IST
సంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు రికార్డ్.
సంగారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 15 కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొన్న మాజీమంత్రి.
ఉదయం బాచుగూడ (ఇంద్రేశం) నుండి రాత్రి సంగారెడ్డి వరకు జిల్లాను చుట్టేసిన హరీష్ రావు.
ఇస్నాపూర్ మునిసిపాలిటీ ( చిట్కుల్ ), ఇంద్రేశం (బచ్చుగూడ), సంగారెడ్డిలో 5, సదాశివపేటలో 3, జహీరాబాద్ లో 3, కోహిర్ లో 2 మీటింగ్స్.
అవిశ్రాంతంగా సాగిన హరీష్ రావు ప్రచారం.. గులాబీ శ్రేణుల్లో నిండిన కొత్త జోష్.
-
Feb 08, 2026 21:03 IST
కరీంనగర్‌లో కబడ్డీ మొదలైంది: బండి సంజయ్
కరీంనగర్‌లో ఎన్నికలు భారత్-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి.
కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే.
MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి.
రూ.100 కోట్లు ఖర్చుపెట్టి బీజేపీని ఓడించాలని చూస్తున్నారు.
కరీంనగర్‌లో MIM గెలిస్తే బీజేపీని ఎవరూ కాపాడలేరు.
-
Feb 08, 2026 20:49 IST
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుంది: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేస్తాం.
బీఆర్ఎస్ దొడ్డు రేషన్ బియ్యంతో 12 వేల కోట్లు వృథా.
సన్న బియ్యం పథకం ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారుతుంది.
సూర్యాపేట సమగ్రాభివృద్ధి బాధ్యత నాది.
బీఆర్ఎస్, బీజేపీలకి ఓటేస్తే మోరీలో వేసినట్లే.
మరో పదేళ్ళు కాంగ్రెస్‌కి డోకా లేదు.
-
Feb 08, 2026 20:46 IST
సిరిసిల్ల: కేటీఆర్‌కు నేతన్నల ఓట్లు అడిగే హక్కు లేదు: మంత్రి తుమ్మల
పదేళ్లు అధికారంలో ఉన్నా నేతన్నలను కేటీఆర్ కలవలేదు.
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం.
-
Feb 08, 2026 20:46 IST
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ ఏకగ్రీవ ఎన్నిక
ప్రధాన కార్యదర్శిగా రమణ ఎన్నిక.
-
Feb 08, 2026 20:41 IST
ఢిల్లీ: జగన్ తనతప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ఎంపీ కలిశెట్టి
నెయ్యి అంశంలో సుబ్బారెడ్డి వాస్తవాలు అంగీకరించడం సంతోషకరం.
బాబాయి నిజాలు అంగీకరించడంపై జగన్ ఏమంటారో చూడాలి.
టీటీడీ నిబంధనలు సడలించి భోలే బాబా డెయిరీ నుంచి రసాయనాలతో కూడిన లక్షల కిలోల నెయ్యి సరఫరా నిజం కాదా?
CFTRI నివేదికను తొక్కిపెట్టి బుకాయిస్తున్నారు.
-
Feb 08, 2026 20:30 IST
శ్రీశైలంలో భారీగా స్తంభించిన వాహనాలు
శ్రీశైలం నుంచి శిఖరం, చిన్నారుట్ల వరకు ట్రాఫిక్ జాం.
హైదరాబాద్ వైపు సున్నిపెంట వరకు నిలిచిన వాహనాలు.
భారీగా ట్రాఫిక్ జాంతో వాహనదారుల ఇబ్బందులు.
-
Feb 08, 2026 19:46 IST
ఢిల్లీలో మృతదేహాల కలకలం
పీరాగఢి ఫ్లైఓవర్ దగ్గర కారులో 3 మృతదేహాలు గుర్తింపు.
పార్క్ చేసిన కారులో మృతదేహాలు, పోలీసుల దర్యాప్తు.
మృతులు: రణధీర్(62), శివనరేష్(42), లక్ష్మి(40).
-
Feb 08, 2026 19:45 IST
జూబ్లీహిల్స్ ఇల్యూజన్ పబ్‌లో నార్కోటిక్స్ పోలీసుల దాడులు
పబ్‌కు వచ్చిన వారికి గంజాయి టెస్టులు.
యువకుడు అజయ్‌కు గంజాయి పాజిటివ్, కేసు నమోదు.
-
Feb 08, 2026 19:00 IST
తిరుపతి: తాటితోపు గ్రామంలో భారీ చోరీ.
68 గ్రాములు బంగారం, 30 వేల నగదు అపహరణ.
తిరుపతి రూరల్ మండలం వెంకటపతి నగర్ పంచాయతీలోని తాటితోపు గ్రామంలో ఘటన.
బాధితురాలు సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ ఎస్సై శ్రీరాములు.
-
Feb 08, 2026 18:40 IST
ఫోన్ ట్యాపింగ్‌తో రూ.వేల కోట్లు సంపాదించారు: సీఎం రేవంత్
ఫోన్ ట్యాపింగ్‌తోనే బిల్డర్లు, రియల్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నారు.
బీఆర్ఎస్ అంటే.. బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి.
ఇవాళ్టి నుంచి ఆ పేరుతోనే పిలుస్తాం.
-
Feb 08, 2026 18:15 IST
భూపాలపల్లి: అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం: మంత్రి పొంగులేటి
సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం.
భూభారతి చట్టం ద్వారా ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేశాం.
-
Feb 08, 2026 17:41 IST
భూపాలపల్లి: చెల్పూర్‌లో 'ప్రజాపాలన-ప్రగతిబాట' బహిరంగ సభ
జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఆలోచన లేదు: సీఎం రేవంత్
పునర్‌వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉంది.
బహిరంగంగా ప్రజల సూచనలు తీసుకునే ఆలోచన చేస్తాం.
భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామమని BRS తప్పుడు ప్రచారం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదు.
విపక్షాల కుట్రలు, కుతంత్రాలను నమ్మొద్దు.
-
Feb 08, 2026 17:06 IST
టీ20 ప్రపంచ కప్ 2026: బెథెల్, బ్రూక్ హాఫ్ సెంచరీలు.. నేపాల్ టార్గెట్ 185
వాంఖడే వేదికగా తలపడుతోన్న ఇంగ్లండ్-నేపాల్ జట్లు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసిన ఇంగ్లండ్.
హాఫ్ సెంచరీలతో చెలరేగిన జాకబ్ బెథెల్(55), హ్యారీ బ్రూక్(53).
నేపాల్ బౌలర్లలో దీపేంద్ర, నందన్ యాదవ్ తలో 2, షేర్ మల్లా, సందీప్‌లకు చెరొక వికెట్.
నేపాల్ విజయ లక్ష్యం 185 పరుగులు.
-
Feb 08, 2026 17:01 IST
హనుమకొండ: పరకాలలో ఎంపీ ఈటల రాజేందర్ కార్నర్ మీటింగ్
కరోనా కష్టకాలంలో భారతీయులకు 80 కోట్ల మందికి 5 కేజీ బియ్యం ఇచ్చిన మహానేత ప్రధాని మోదీ: ఈటల
పరకాలను స్మార్ట్ సిటీ చేయాలంటే బీజేపీతోనే సాధ్యం: ఈటల
మార్పు కావాలంటే బీజేపీతోనే సాధ్యం: ఈటల
-
Feb 08, 2026 16:40 IST
నెల్లూరు: సీతారాంపురం పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం.
పోలీస్ అధికారి వేదింపులే కారణమనే ఆరోపణలు.
సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.
సమీపంలోని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా... దూరంగా ఉన్న వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై బలపడుతున్న అనుమానాలు.
మహిళా కానిస్టేబుల్‌కి వైద్యం అందిస్తున్న వైద్యులు, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడి.
-
Feb 08, 2026 16:15 IST
కర్ణాటక: మంగళూరులో కుప్పకూలిన శిక్షణా విమానం
పొలాల్లో కూలిన రెడ్‌బర్డ్ సంస్థకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్.
విమానంలోని ఇద్దరికి తీవ్రగాయాలు.
-
Feb 08, 2026 15:45 IST
ముంబై: రిటైర్మెంట్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కీలక వ్యాఖ్యలు.
వయసుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని సంఘ్ కోరింది: మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవికి ఎన్నికలు ఉండవు: మోహన్ భగవత్
దిగిపోవాలని ఆదేశిస్తే వైదొలగేందుకు సిద్ధం: మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఇంతవరకు ఎవరినైనా పదవీ విరమణ చేయించల్సిన పరిస్థితి రాలేదు: భగవత్
-
Feb 08, 2026 15:40 IST
టీ20 వరల్డ్‌కప్: అఫ్ఘాన్‌పై న్యూజిలాండ్ విజయం
5 వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌పై న్యూజిలాండ్ గెలుపు.
స్కోర్లు: ఆఫ్ఘన్ 182/6, న్యూజిలాండ్ 183/5 (17.5 ఓవర్లు).
-
Feb 08, 2026 14:51 IST
భద్రాద్రి: కొత్తగూడెంలో బీజేపీ విజయ సంకల్ప సభ
తెలంగాణను అప్పుల ఊబిలో ముంచింది BRS: రాంచందర్‌రావు
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: రాంచందర్‌రావు
కాంగ్రెస్‌లో వర్గపోరుతో స్కామ్‌లు బయటపడుతున్నాయి: రాంచందర్‌రావు
సింగరేణి కార్మికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: రాంచందర్‌రావు
-
Feb 08, 2026 14:50 IST
ఏలూరు జిల్లా: భవిష్యత్తులో వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావు: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్
కల్తీ నెయ్యి వ్యవహారంలో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
లడ్డూ వ్యవహారం పక్కదారి పట్టించడానికి వైసీపీ నాయకులు కులాల వ్యవహారం తెరమీదకు తీసుకొచ్చారు..
తప్పు చేశారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
-
Feb 08, 2026 14:43 IST
తిరుమల.. మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం..
41వ మలుపు వద్ద బస్సు క్రింద పడ్డ ద్విచక్ర వాహన దారుడు.
ద్విచక్ర వాహనం బస్సు క్రింద దూరడంతో వాహనదారుడికి గాయ్యం.
గాయపడిన భక్తుడిని తిరుపతి రూయకు తరలించిన భద్రతా సిబ్బంది.
-
Feb 08, 2026 14:41 IST
కరీంనగర్: చొప్పదండిలో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రచారం
రెండేళ్లలో మున్సిపాలిటీలకు రెండు రూపాయలైనా ఇచ్చారా?
నిధులు ఇచ్చేది కేంద్రం.. తేచ్చేది మేము.. మరీ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి?
రెండేళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది.. గాడిద గుడ్డు.
BRS పాలనలో కబ్జాలు, అరాచకాలు తప్ప ఏమీ లేవు.
-
Feb 08, 2026 14:30 IST
విశాఖ: ఉక్కు నిర్వాసితుల మహా గర్జన.
గాజువాక లంకా మైదానంలో విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహ గర్జన సభ.
మహా గర్జన సభలో అధిక సంఖ్యలో పాల్గొన్న ఉక్కు నిర్వాసితులు.
ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ గోపాల్ గౌడ, మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు.
-
Feb 08, 2026 14:18 IST
అమరావతి: మరో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ నాగబాబు.
జగన్, వైసీపీ నేతలకు పలు ప్రశ్నలు సంధించిన నాగబాబు.
-
Feb 08, 2026 12:52 IST
టీ20 ప్రపంచ కప్ 2026: నైబ్ హాఫ్ సెంచరీ.. కివీస్ టార్గెట్ 183
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నై వేదికగా తలపడుతోన్న అఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ జట్లు
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన అఫ్గానిస్తాన్
కివీస్ విజయ లక్ష్యం 183 పరుగులు
హాఫ్ సెంచరీతో చెలరేగిన అఫ్గానిస్తాన్ బ్యాటర్ గుల్బాదిన్ నైబ్(63)
కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 2, హెన్రీ, డఫీ, రచిన్ రవీంద్రలకు చెరో వికెట్..
-
Feb 08, 2026 12:50 IST
తాండూర్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం..
వికారాబాద్: తాండూర్‌లో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం..
రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రజలు మోసపోయారు..
మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దు..
రెండోసారి కూడా మోసపోతే మీదే తప్పవుతుంది..
రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలనూ రద్దు చేశారు: కేటీఆర్
-
Feb 08, 2026 12:48 IST
పాడి గేదెల హోం డెలివరీ పేరుతో మోసం..
కామారెడ్డి: పాడి గేదెల హోం డెలివరీ పేరుతో సైబర్ మోసం..
తక్కువ ధరకే పాడి గేదెలు హోం డెలివరీ చేస్తామంటూ యూట్యూబ్‌లో ప్రకటన..
పోస్ట్ చూసి సంప్రదించిన రైతు చాకలి రమేష్ ..
లింక్ పంపించి, విడతల వారీగా రూ.8.84లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
-
Feb 08, 2026 12:48 IST
మంచు విష్ణుకు నోటీసులు..
తిరుపతి: MBUలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసు..
మంచు విష్ణుకు నోటీసులు ఇచ్చిన చంద్రగిరి పోలీసులు..
కేసులో A2గా మంచు విష్ణు, A3గా మోహన్‌బాబు పేర్లు
ఇప్పటికే పీఆర్వో సతీష్(A1), పలువురు బౌన్సర్లు అరెస్ట్..
-
Feb 08, 2026 12:47 IST
కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి లబ్ధి: కేంద్ర మంత్రి పెమ్మసాని
సెమీ కండక్టర్ల తయారీకి బడ్జెట్‌లో రూ.40వేల కోట్లు కేటాయింపు..
ఖనిజాల వెలికితీత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాం..
ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు రూ.10వేల కోట్లు కేటాయించాం :కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
-
Feb 08, 2026 12:47 IST
అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం..
అన్నమయ్య జిల్లా: పుంగనూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ కలకలం..
సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లిలో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ..
వారం రోజుల నుంచి 3 కోళ్ల ఫారాల్లో 28వేల కోళ్లు చనిపోయాయని సమాచారం..
ఇంకా బతికున్న కోళ్లను ఊరి బయట జెసిబి సాయంతో గుంత కొట్టి గుంతలో పుడ్చేస్తున్న అధికారులు.
మూడు కోళ్ల ఫారాలను ఇప్పటికే సీజ్ చేసిన తహసిల్దార్ ప్రమీల..
-
Feb 08, 2026 12:46 IST
బండి సంజయ్ ఆరోపణల్లో వాస్తవం లేదు: ABNతో పొన్నం
కరీంనగర్: బండి సంజయ్ ఆరోపణల్లో వాస్తవం లేదు: ABNతో పొన్నం
మేయర్ పీఠం ఎమ్‌ఐఎమ్‌కు మేం ఎందుకు ఇస్తాం?..
ఎంపీగా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఎన్ని నిధులు తెచ్చారు?..
మేం కబ్జాలు చేయలేదు.. బ్లాక్‌మెయిల్ చేయలేదు: ABNతో మంత్రి పొన్నం ప్రభాకర్
-
Feb 08, 2026 11:02 IST
రష్యాలో కత్తిపోట్ల కలకలం.. భారతీయ విద్యార్థులపై దాడి..
రష్యా: బాష్కోర్తోస్థాన్‌లోని ఓ వర్సిటీలో కత్తిపోట్ల కలకలం
నలుగురు భారతీయ విద్యార్థులపై కత్తితో దాడి చేసిన యువకుడు..
అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపైనా దాడి చేసిన వైనం..
-
Feb 08, 2026 10:37 IST
స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు
రాజస్థాన్: స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు..
మంటలు గుర్తించి రైలును నిలిపేసిన లోకో పైలట్..
జేతా-చందన్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన..
-
Feb 08, 2026 10:04 IST
మలేషియాలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన
సీఈవో ఫోరం సమావేశానికి హాజరుకానున్న ప్రధాని మోదీ
మలేషియా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్న మోదీ
-
Feb 08, 2026 09:33 IST
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం
9 మంది నోడల్ అధికారులను నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం..
ఎన్నికలపై నోడల్ అధికారులకు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం..
ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం..
రేపటి వరకు రాత్రి వేళల్లో 92475 97066 ద్వారా ఫిర్యాదులు స్వీకరణ..
-
Feb 08, 2026 09:30 IST
నాంపల్లి అగ్ని ప్రమాదంపై దర్యాప్తు..
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు..
మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్‌లో ప్రమాదం..
ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, లాప్టాప్, పెన్ డ్రైవ్ దగ్ధమైనట్లు గుర్తింపు..
కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ షికా గోయల్..
-
Feb 08, 2026 07:43 IST
వ్యాన్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి..
శ్రీకాకుళం: నందిగాంలో వ్యాన్‌ను ఢీకొట్టిన కారు..
ప్రమాదంలో ఇద్దరి మృతి, ఐదుగురికి గాయాలు..
మృతులు ఒడిశాకు చెందిన దాలయ్య, మోహినమ్మ..
-
Feb 08, 2026 06:25 IST
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ..
ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం చంద్రబాబు..
-
Feb 08, 2026 06:24 IST
నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం..
రేపటి నుంచి వాహన సేవలు, గ్రామోత్సవం..
స్వామి వారి అలంకార దర్శనానికి భక్తులకు అనుమతి..
శివ స్వాములకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి..
-
Feb 08, 2026 06:16 IST
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం రోడ్ షో
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం..
వైరా, మధిర మున్సిపాలిటీల్లో భట్టి రోడ్ షో..
-
Feb 08, 2026 06:13 IST
నేడు నర్సంపేటలో కేటీఆర్ పర్యటన
వరంగల్: నేడు నర్సంపేటలో కేటీఆర్ పర్యటన..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్..
సాయంత్రం వర్దన్నపేటలో ప్రచారం..
-
Feb 08, 2026 06:11 IST
నేడు టీ20 వరల్డ్ కప్‌లో.. 3 మ్యాచ్‌లు
చెన్నైలో ఉ.11 గంటలకు ఆఫ్గనిస్థాన్ Vs న్యూజిలాండ్
ముంబైలో మ.3 గంటలకు ఇంగ్లండ్ Vs నేపాల్
కొలంబోలో రాత్రి 7 గంటలకు శ్రీలంక Vs ఐర్లాండ్
-
Feb 08, 2026 06:04 IST
నేడు భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్న సీఎం..
చెల్పూర్ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి..