Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 09 , 2026 | 06:55 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 09, 2026 11:03 IST

    సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

    • ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక సూచనలు

    • రామగుండం థర్మల్ ప్రాజెక్టుకు పీపీఏ చేసుకోండి: కిషన్ రెడ్డి

    • ఎన్టీపీసీ రెండో దశ ప్రాజెక్టుకు తెలంగాణ మద్దతు కావాలి: కిషన్ రెడ్డి

  • Mar 09, 2026 10:47 IST

    అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు

    • ధనుంజయరెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యకు ఈడీ నోటీసులు

  • Mar 09, 2026 10:32 IST

    తగ్గిన బంగారం, వెండి ధరలు

    • రూ.1,960 తగ్గి రూ.1,61,680కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,800 తగ్గి రూ.1,48,200కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,90,000

    పూర్తికథనం

  • Mar 09, 2026 10:31 IST

    ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసుపై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ

    • సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించనున్న ధర్మాసనం

    • రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

    • ఈ కేసులో 23 మందిని నిర్దోషులుగా ప్రకటించిన రౌజ్ అవెన్యూ కోర్టు

  • Mar 09, 2026 10:27 IST

    జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం: మంత్రి నారాయణ

    • వైసీపీ హయాంలోని ఐదేళ్లపాటు చెత్తపాలన సాగించారు.

    • 1.15 కోట్ల టన్నుల చెత్త క్లియర్ చేశాం: మంత్రి నారాయణ

    • చంద్రబాబు ఆదేశాలతో చెత్త క్లియర్ చేస్తున్నాం: మంత్రి నారాయణ

  • Mar 09, 2026 09:42 IST

    హైదరాబాద్‌: రిటైర్డ్ జడ్జికి సైబర్ నేరగాళ్ల మోసం

    • మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసు పేరుతో బెదిరింపులు

    • సీబీఐ అధికారులమని వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్‌

    • బెంగళూరు ఇందిరానగర్‌లో మీపై కేసు నమోదైందంటూ బెదిరింపులు

    • సైబర్ నేరగాళ్లకు రూ.1.66 కోట్లు బదిలీ చేసిన రిటైర్డ్ జడ్జి

    పూర్తికథనం

  • Mar 09, 2026 09:29 IST

    ఇరాన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలకు రెక్కలు

    • రికార్డు స్థాయిలో పెరిగిన ముడిచమురు ధరలు

    • ఒకే రోజు 27 శాతం పెరిగిన ముడిచమురు ధర

    • నాలుగేళ్లలో తొలిసారి 115 డాలర్లకు చేరిన క్రూడాయిల్ ధర

  • Mar 09, 2026 09:28 IST

    భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 2వేల పాయింట్లు నష్టం

    • నిఫ్టీ 674 పాయింట్ల నష్టం

  • Mar 09, 2026 08:34 IST

    తిరుపతి: ఎర్రావారిపాలెం మండలంలో రెండు ఏనుగులు మృతి

    • విద్యుత్ తీగలు తగిలి మృతిచెందిన రెండు ఏనుగులు

    • పంటల రక్షణ కోసం కంచె ఏర్పాటుచేసుకున్న రైతులు

    • నెరబైలు పంచాయతీ సమీపంలో అడవుల్లో ఘటన

  • Mar 09, 2026 08:33 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

    • రూ.3కోట్ల విలువైన 9కేజీల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం

    • కస్టమ్స్ అదుపులో కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు

  • Mar 09, 2026 08:28 IST

    మైలార్‌దేవ్ పల్లి హిట్ అండ్ రన్ కేసు

    • పల్లె చెరువు వద్ద ముందు వెళుతున్న బైక్‌ను ఢీ కొట్టి వెళ్ళిన కారు

    • బైక్ ను 200 మీటర్ల వరకు లాక్కొని వెళ్ళిన కారు

    • కారును ఆపకుండా వెళ్ళడంతో వెంబడించి పట్టుకున్న స్థానికులు

    • కేసు నమోదు చేసిన పోలీసులు

  • Mar 09, 2026 08:26 IST

    జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల

    • మే 17న పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐటీ రూర్కీ ప్రకటన

    • ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

    • మే 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

  • Mar 09, 2026 08:18 IST

    నల్లగొండ: హైదరాబాద్ రోడ్డులో కారు బీభత్సం

    • మున్సిపల్ కార్మికురాలు, ఓ బైకిస్ట్‌ను ఢీకొట్టిన కారు

    • ఇద్దరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

    • కారు అతివేగమే ప్రమాదానికి కారణం

  • Mar 09, 2026 08:02 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • త్వరలోనే అసెంబ్లీలో బడ్జెట్‌‌ని ప్రవేశ పెట్టబోతున్నాం

    • 2047 విజన్ డాక్యూమెంట్‌కి అనుగుణంగా బడ్జెట్‌ని ప్రవేశపెడుతాం

    • తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతోంది

    • రాష్ట్రంపై ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించా: భట్టి

  • Mar 09, 2026 07:58 IST

    ఎయిరిండియా కీలక ప్రకటన

    • 9 అంతర్జాతీయ మార్గాల్లో ఎయిరిండియా అదనపు సర్వీసులు

    • పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

    • ఈ కారణంగా అదనపు విమాన సర్వీసులు నడపాలని నిర్ణయం

    • ఈనెల 10 నుంచి 18 వరకు 78 విమానాలు అదనంగా నడపనున్న ఎయిరిండియా

  • Mar 09, 2026 07:56 IST

    నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    • ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు

    • స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసంతో పాటు పలు బిల్లులపై చర్చ

    • పశ్చిమాసియా పరిస్థితిపై నేడు పార్లమెంట్‌లో ప్రకటన

    • ఉదయం 11గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్న జైశంకర్

    • మధ్యాహ్నం 12గంటలకు లోక్‌సభలో స్టేట్‌మెంట్

  • Mar 09, 2026 07:56 IST

    బీఆర్ఎస్ మీటింగ్

    • అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రిపరేషన్స్

    • మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

    • ఈనెల 16నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

    • అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం

    • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్

    • ప్రజా సమస్యలే లక్ష్యంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామంటోన్న ప్రతిపక్ష బీఆర్ఎస్

  • Mar 09, 2026 07:15 IST

    నేడు బంగారం, వెండి ధరలు

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,990

    • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,790

    • 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,50,140

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.2.89 లక్షలుగా ఉంది

    పూర్తికథనం

  • Mar 09, 2026 07:13 IST

    ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ

    • మొజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్టు అధికారికంగా ఇరాన్ ప్రకటన

    • అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇటీవల అయతుల్లా అలీ ఖమేనీ మృతి

  • Mar 09, 2026 06:55 IST

    నంద్యాల: నేడు డోన్ కు సీఎం చంద్రబాబు

    • ఉదయం 11:30లకు కొత్తబురుజులో గ్రామసభ

    • రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి

    • రైతులతో ముఖాముఖి, పంటలను పరిశీలించనున్న సీఎం

    • డోన్ నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం

    • సీఎం చంద్రబాబు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా అధికార యంత్రాంగం

    • 900 మందితో భారీ పోలీసు బందోబస్తు