Share News

బంగారం, వెండి మరింత డౌన్.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే

ABN , Publish Date - Mar 09 , 2026 | 10:28 AM

ఇటీవలి కాలంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పడిపోతుండడం నిపుణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

బంగారం, వెండి మరింత డౌన్.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే
gold and silver rates today

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సోమవారం మరింత కిందకు వచ్చాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పడిపోతుండడం నిపుణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సోమవారం వెండి కేజీకి రూ.5 వేల మేర తగ్గింది. మరోవైపు బంగారం ధర కూడా భారీగా తగ్గింది (Gold prices).


ఈ రోజు (మార్చి 9న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,61,680కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.1960 మేర తగ్గుదల నమోదైంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1800 మేర తగ్గింది.


మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. బుధవారం కిలోకు రూ.5 వేల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.80 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.90 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆ సమయంలో సచిన్ చాలా సహాయం చేశారు: సంజూ శాంసన్

Updated Date - Mar 09 , 2026 | 10:35 AM