Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 31 , 2026 | 06:12 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 31, 2026 19:34 IST

    వెర్స్ ఇన్నోవేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పీవీ రమేశ్ నియామకం

    • ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గానూ వ్యవహరించనున్న రమేశ్

    • గతంలో డెలాయిట్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేసిన రమేశ్

  • Mar 31, 2026 19:20 IST

    సంగారెడ్డి: పటాన్‌చెరు శ్రీనగర్‌ కాలనీలో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ సీజ్

    • 1500 కిలోల వరకు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • SOT పోలీసుల అదుపులో ముంబైకి చెందిన నిందితుడు అస్లాం

  • Mar 31, 2026 18:37 IST

    నేటితో ముగియనున్న ఆపరేషన్‌ కగార్‌ గడువు

    • ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన ఆపరేషన్‌ కగార్

    • మావోయిస్టు ముక్త్‌ భారత్‌ పరిపూర్ణం: అమిత్‌ షా

    • లక్ష్యం సంపూర్ణమైంది: అమిత్‌ షా

  • Mar 31, 2026 18:08 IST

    చెన్నై: TVK చీఫ్‌ విజయ్‌పై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శలు

    • తమిళనాడు రాజకీయాలపై విజయ్‌కు అవగాహన లేదు: పీయూష్‌

    • తమిళనాడు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు విజయ్‌కు తెలియవు: పీయూష్

    • ప్రస్తుతం విజయ్‌ ఓ కలల ప్రపంచంలో ఉన్నారు: పీయూష్‌ గోయల్

    • అభిమానుల ఆదరణ ఓట్లుగా మారతాయని చెప్పలేం: పీయూష్‌

  • Mar 31, 2026 17:57 IST

    ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కొరత లేదు: మంత్రి నాదెండ్ల

    • సరఫరా విషయంలో ఎక్కడా ఇబ్బంది లేదు: మంత్రి నాదెండ్ల

    • బ్లాక్‌ మార్కెట్‌ చేసిన 146 గ్యాస్‌ ఏజెన్సీలపై కేసులు: నాదెండ్ల

    • 4 వేలకు పైగా గ్యాస్ సిలిండర్ల స్వాధీనం: మంత్రి నాదెండ్ల

  • Mar 31, 2026 17:49 IST

    గుజరాత్‌: సూరత్‌లో అగ్నిప్రమాదం, ఐదుగురి మృతి

    • మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు

    • బాలుడు సహా నలుగురు మహిళలు సజీవ దహనం

  • Mar 31, 2026 17:43 IST

    హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో విషాదం

    • ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

    • మృతులు స్రవంతి, కార్తీక్‌(12), కౌశిక్‌(10)గా గుర్తింపు

    • కైతలాపూర్‌ రాఘవేంద్ర కాలనీలో ఘటన

    • ఘటనాస్థలిలో క్లూస్‌ సేకరిస్తున్న పోలీసులు

    పూర్తి కథనం

  • Mar 31, 2026 17:42 IST

    ఇండిగో నూతన CEOగా విలియం వాల్ష్‌‌

    • బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ CEOగా పనిచేసిన విలియం వాల్ష్‌

    • వచ్చే ఆగస్టు 3న బాధ్యతలు స్వీకరించనున్న విలియం వాల్ష్‌

  • Mar 31, 2026 17:36 IST

    హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌ యాప్స్‌పై చర్యలు

    • ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో 129 నకిలీ ప్రొఫైల్స్‌ తొలగించిన సైబర్‌క్రైమ్ పోలీసులు

    • 494 పెయిడ్ ప్రకటనలతో మోసం చేస్తున్న కేటుగాళ్లు

    • 746 ప్రమోషనల్ ప్రకటనలు తొలగించిన సైబర్‌క్రైం పోలీసులు

    • సైబర్ మోసాలకు గురైతే 1930కు కాల్ చేయాలని సూచన

  • Mar 31, 2026 17:25 IST

    హైదరాబాద్‌: అమీర్‌పేట HMDA ఆఫీస్‌కు బాంబు బెదిరింపు కాల్‌

    • కొద్ది గంటల్లోనే బాంబు పేలుతుందంటూ బెదిరింపు మెయిల్

    • తనిఖీలు చేపట్టిన ఎస్ఆర్ నగర్‌ పోలీసులు, బాంబు స్క్వాడ్

  • Mar 31, 2026 17:19 IST

    సీఎం రేవంత్‌ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: ఎంపీ రఘునందన్‌

    • తమిళనాడు, పుదుచ్చేరి, కేరళం ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు: ఎంపీ

    • కాంగ్రెస్ నేతలు ఎప్పుడు అస్త్ర సన్యాసం చేస్తారో వారికే తెలియదు: ఎంపీ

    • మోదీని తిడితే పెద్ద లీడర్ అవుతామనుకుంటే పొరపాటే: రఘునందన్‌

    • కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు: ఎంపీ రఘునందన్‌

  • Mar 31, 2026 17:13 IST

    మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమీక్ష

    • మూసీ ప్రాజెక్టుపై మంత్రులు భట్టి, పొన్నం సమీక్ష

    • మూసీ పునరుజ్జీవంపై అభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయం

    • musrirdc@gmaill.comకు అభిప్రాయాలు పంపాలని సూచన

    • నేటి నుంచి ఏప్రిల్‌ 15 వరకు సలహాలు స్వీకరించాలని నిర్ణయం

  • Mar 31, 2026 17:12 IST

    అమరావతి: రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవల బంద్

    • బకాయిల విడుదల కోరుతూ గతంలోనే నోటీసులు

    • నోటీసులకు ప్రభుత్వం స్పందించలేదంటున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌

    • పాత పథకం బకాయిలు ఇవ్వకుండా కొత్త పథకం ప్రకటించడంపై ఆగ్రహం

    • రూ.3 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌

  • Mar 31, 2026 17:01 IST

    విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ పర్యటన

    • లొట్లప‌ల్లి జ‌డ్పీ హైస్కూల్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన మంత్రి కొండ‌ప‌ల్లి

    • విద్యార్థులతో కలిసి మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి నాణ్యత ప‌రిశీలించిన మంత్రి

    • త‌ర‌గ‌తి గ‌దులను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి

  • Mar 31, 2026 16:59 IST

    రేపటి నుంచి తెలంగాణలో చికెన్‌ షాపుల బంద్‌

    • చికెన్‌ విక్రయాల్లో మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌

    • పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌ తగ్గించాయని నిరసన

    • తగ్గించిన మార్జిన్‌ పెంచేవరకు..

    • బంద్‌ కొనసాగిస్తామన్న చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌

  • Mar 31, 2026 16:53 IST

    ఖమ్మం: సత్తుపల్లి మున్సిపల్‌ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

    • ACB అధికారులను చూసి మేనేజర్‌ శ్రీనివాస్‌ పరారీ

    • శ్రీనివాస్‌ నివాసంలోనూ ఏసీబీ అధికారుల సోదాలు

  • Mar 31, 2026 16:49 IST

    గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

    • 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టైడ్ గ్రాంట్స్ రూ.371.91 కోట్లు,..

    • అన్‌టైడ్ గ్రాంట్స్ రూ.247.94 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

  • Mar 31, 2026 15:16 IST

    పాక్‌లో మసూద్ అజహర్ సోదరుడు తాహిర్ అన్వర్ మృతి

    • తాహిర్ అన్వర్ మృతిని ధ్రువీకరించిన జైషే మహమ్మద్ అధికారిక ఛానల్

    • అన్వర్ మరణానికి కారణాలపై అస్పష్టత

    • జైషే సంస్థలో కీలకమైన వ్యక్తిగా పేరున్న తాహిర్ అన్వర్

  • Mar 31, 2026 14:50 IST

    తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్‌

    • నేడు కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్

    • గురువారం తమిళనాడులో ఉత్తమ్‌ ఎన్నికల ప్రచారం

  • Mar 31, 2026 14:42 IST

    హైదరాబాద్‌లో కల్తీ పదార్థాలపై అధికారుల ఫోకస్

    • కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు

    • నాసిరకం అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్నట్లు గుర్తింపు

    • రూ.22 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం

    • కల్తీ పదార్థాలు విక్రయిస్తున్న హాసన్ రూపానీ అరెస్ట్

  • Mar 31, 2026 14:32 IST

    మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరోసారి పోలీస్ కస్టడీకి నిందితులు

    • మూడు రోజుల కస్టడీ విధించిన ఉప్పర్‌పల్లి కోర్టు

    • పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌ శర్మకు పోలీస్‌ కస్టడీ

  • Mar 31, 2026 14:28 IST

    తుంగభద్ర డ్యామ్ గేట్ల బిగింపు పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల

    • డ్యామ్ సైట్ నుంచి సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన పయ్యావుల కేశవ్

    • కొత్త గేట్లు అమర్చే పనుల గురించి సీఎంకు వివరించిన మంత్రి

    • ఏప్రిల్ నెలాఖరుకు గేట్ల బిగింపు పనులు పూర్తకానున్నట్టు మంత్రి వెల్లడి

  • Mar 31, 2026 14:22 IST

    ఢిల్లీ: సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్ఛార్జ్

    • ఈ నెల 24న అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సోనియా

  • Mar 31, 2026 13:47 IST

    పశ్చిమబెంగాల్: బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

    • బీజేపీ తరఫున బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్న పేస్

    • టెన్నిస్‌లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న పేస్

    • కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో బీజేపీలో చేరిక

    • పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం

  • Mar 31, 2026 13:29 IST

    అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా చేశారు: హరీష్‌రావు

    • శాసనసభపై అధికార పక్షానికి గౌరవం లేదు: హరీష్‌రావు

    • సభలో మమ్మల్ని ప్రశ్నలు అడగనివ్వలేదు..

    • మా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి పారిపోయారు: మాజీ మంత్రి హరీష్‌రావు

  • Mar 31, 2026 13:24 IST

    రేపు పార్లమెంట్‌కు ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు

    • రేపు ఉదయం బిల్లుకు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్‌

    • ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లుగా పేరు

    పూర్తి కథనం

  • Mar 31, 2026 13:23 IST

    తోటలో విషాహారం తిని.. 25 కోతుల మృతి

    • కామారెడ్డి: దొమకొండ మండలం ముత్యంపేటలో 25 కోతుల మృతి

    • తోటలో పెట్టిన విషాహారం తిన్న కోతులు

    • అస్వస్థతకు గురై వివిధ ప్రాంతాల్లో మృతి చెందిన కోతులు

    • రైతు కావాలనే ఇలా చేశాడని గ్రామస్తుల ఆరోపణ

    • రైతుపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

  • Mar 31, 2026 13:08 IST

    జగన్‌ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరు: మంత్రి కొల్లు

    • కడప స్టీల్‌ప్లాంట్‌ పూర్తి చేయలేని క్రెడిట్‌ జగన్‌దే: మంత్రి కొల్లు రవీంద్ర

    • విధ్వంసకారుడు, దోపిడీదారుడనే క్రెడిట్‌ జగన్‌దే..

    • వివేకా హత్య కేసులో ఆడిన డ్రామాల క్రెడిట్‌ జగన్‌దే: మంత్రి కొల్లు రవీంద్ర

  • Mar 31, 2026 12:42 IST

    జగిత్యాలలో ఈదురుగాలులతో భారీ వర్షం

    • మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం

    • రెండు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా

    • ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి

  • Mar 31, 2026 12:41 IST

    చల్లపల్లి పీఎస్‌ దగ్గర పేలుడుపై స్పందించిన హోంమంత్రి అనిత

    • కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి

    • గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

  • Mar 31, 2026 12:39 IST

    నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: జడ్చర్ల MLA అనిరుధ్‌రెడ్డి

    • నేను ఇప్పసారా తాగమనలేదు.. దానికి 3వేల ఏళ్ల చరిత్ర ఉందని చెప్పా

    • ఇప్ప సారా ఇండియన్ లిక్కర్..

    • ఆదివాసీలు లిక్కర్ తయారు చేస్తే తప్పా? కార్పొరేట్ కంపెనీలు చేస్తే కరెక్టా?: MLA అనిరుధ్‌రెడ్డి

  • Mar 31, 2026 12:31 IST

    అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి నారా లోకేశ్

    • పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేశ్

    • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావుతో లోకేశ్ భేటీ

    • సంస్థాగత వ్యవహారాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ

  • Mar 31, 2026 12:11 IST

    BRS ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి సీఐడీ నోటీసులు

    • కౌశిక్‌రెడ్డితో పాటు మరో 20 మందికి CID నోటీసులు

    • ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు రావాలని ఆదేశం

    • జనవరి 29న సమ్మక్క జాతరలో ఘర్షణపై కేసు నమోదు

  • Mar 31, 2026 11:34 IST

    బిహార్: నలంద జిల్లాలోని శీతలా ఆలయంలో తొక్కిసలాట

    • 8 మంది మహిళల మృతి, పలువురికి గాయాలు

    పూర్తి కథనం..

  • Mar 31, 2026 11:33 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

    • బ్యాంకాక్ నుంచి వస్తున్న వారి నుంచి హైడ్రోపోనిక్ డ్రగ్స్ స్వాధీనం

    • 25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

    • ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు

  • Mar 31, 2026 11:10 IST

    హైదరాబాద్‌లోని దివంగత జయలలిత నివాసం సీజ్

    • శ్రీనగర్‌ కాలనీలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత పేరుతో భవనం

    • 2017 నుంచి పేరుకున్న ఆస్తి పన్ను బకాయిలు

    • నోటీసులకు స్పందించకపోవడంతో GHMC సీజ్

  • Mar 31, 2026 11:02 IST

    బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీకి సంప్రదాయ వేదికలు దూరం

    • సంప్రదాయ వేదికలను పక్కన పెట్టిన బీసీసీఐ

    • ఈ విషయంపై స్పందించిన క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ

    • అన్ని వేదికలపై టెస్ట్‌ మ్యాచ్‌లు జరగాలి: గంగూలీ

    • రాంచీ, గువాహటి వంటి వేదికలపై కూడా జరగాలని ఆకాంక్ష

  • Mar 31, 2026 11:00 IST

    కృష్ణా: చల్లపల్లి పోలీస్ వాహనంలో పేలుడు

    • సీజ్ చేసిన బాణసంచా తరలిస్తుండగా ప్రమాదం

    • ఒక్కసారిగా బాణసంచా పేలి పోలీస్ జీపు దగ్ధం

    • ఎస్ఐ సహా నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Mar 31, 2026 10:55 IST

    ఉగ్రవాది షబ్బీర్ లోన్ విచారణలో కీలక విషయాలు

    • పాక్ హ్యాండ్లర్స్‌ ఆసిఫ్ దార్, సుమామ బదర్‌తో టచ్‌లో ఉన్న షబ్బీర్

    • ఢిల్లీలో ఆలయాలు, వాణిజ్య సముదాయాల్లో రెక్కీ చేసినట్టు గుర్తింపు

  • Mar 31, 2026 10:54 IST

    హైదరాబాద్‌లో జోరుగా కల్తీ వంట నూనె విక్రయాలు

    • లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ముఠా

    • కల్తీ నూనె సేకరిస్తున్న వ్యక్తుల అరెస్ట్

    • 20 డబ్బాల్లో కల్తీ నూనెను గుర్తించిన పోలీసులు

  • Mar 31, 2026 10:53 IST

    ఎన్టీఆర్: నందిగామలో విక్రయాల నిషేధం

    • వారం పాటు మాంసం విక్రయాల నిషేధం

    • చందాపురంలో డయేరియా ప్రబలుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ నిర్ణయం

    • హోటళ్లు, చికెన్ షాపులు, కర్రీ పాయింట్లలో మాంసం విక్రయాల నిషేధం

  • Mar 31, 2026 10:51 IST

    చెన్నైలోని పెరవల్లూరు పీఎస్‌లో TVK చీఫ్ విజయ్‌పై కేసు

    • విజయ్‌తో పాటు 5వేల మంది TVK కార్యకర్తలపై కేసులు

    • ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు

    • పబ్లిక్ న్యూసెన్స్‌తో పాటు 5 సెక్షన్ల కింద కేసులు నమోదు

  • Mar 31, 2026 09:43 IST

    నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

    • పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, రెండు వ్యాగన్ల బోల్తా

    • కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ఘటన

    • విజయవాడ-తిరుపతి, కొమ్మరపూడి జంక్షన్-కృష్ణాపట్నం..

    • విజయవాడ-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం

  • Mar 31, 2026 09:04 IST

    విజయవాడ: దుర్గగుడిలో సిబ్బంది చేతివాటం

    • హుండీ లెక్కింపులో బంగారాన్ని దారి మళ్లించే యత్నం

    • అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెట్టిన సిబ్బంది

    • అనుమానం వచ్చి తనిఖీ చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులు

    • పక్కనపెట్టిన రూ.1.25లక్షల విలువైన బంగారం స్వాధీనం

    పూర్తి కథనం..

  • Mar 31, 2026 08:46 IST

    నేడు కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్

    • 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పురోగతిపై చర్చ

  • Mar 31, 2026 08:46 IST

    నేడు కర్నూలులో మంత్రి నిమ్మల పర్యటన

    • బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొననన్న మంత్రి నిమ్మల రామానాయుడు

    • మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో మంత్రి సమావేశం

  • Mar 31, 2026 07:23 IST

    నంద్యాల: శ్రీశైలం జలాశయంలో అడుగంటిన నీటి నిల్వలు

    • ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 44 టీఎంసీలు

    • విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన ఇరు రాష్ట్రాలు

    • పది నెలల్లో ఏపీ 2,060 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

    • తెలంగాణ 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

  • Mar 31, 2026 07:10 IST

    నేడు కేరళంలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం

    • కన్నూర్‌ సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం

    • మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రాలో కార్నర్ మీటింగ్‌లు

    • బులుస్సేరి నుంచి నన్మండ వరకూ రాహుల్ బస్సు యాత్ర

    • సాయంత్రం కోలులాండి నుంచి కొల్లాం వరకూ రోడ్‌షో

  • Mar 31, 2026 07:09 IST

    హైదరాబాద్: నేడు మహావీర్ జయంతి

    • మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశం

    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అధికారులు

  • Mar 31, 2026 07:09 IST

    నేడు కేరళంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Mar 31, 2026 07:08 IST

    నేడు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • సనంద్‌లో కేన్స్‌ సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ

  • Mar 31, 2026 07:07 IST

    రంగారెడ్డి: అత్తాపూర్‌లో పోలీసుల ముందు యువకుల స్టంట్స్

    • రక్షక్ పోలీస్ వాహనం ముందే ప్రమాదకర విన్యాసాలు

    • పోలీస్ వాహనం కనిపించేలా వీడియో చిత్రీకరణ

    • ఇద్దరు యువకులను పట్టుకున్న పోలీసులు

  • Mar 31, 2026 06:52 IST

    విజయవాడలో ప్రైవేట్ బస్సుకు తప్పిన ముప్పు

    • షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో చెలరేగిన మంటలు

    • హుటాహుటిన ప్రయాణికులను దించిన డ్రైవర్‌

    • సురక్షితంగా బయటపడ్డ 34 మంది ప్రయాణికులు

    • రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయిఆర్కే ట్రావెల్స్‌ బస్సు

  • Mar 31, 2026 06:18 IST

    తిరుమలలో కొనసాగుతున్న సాలకట్ల వసంతోత్సవాలు

    • ఉదయం 8గంటలకు బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు

    • తర్వాత వసంత మండపంలో వసంతోత్సవం

  • Mar 31, 2026 06:17 IST

    దేశ వ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు

    • పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్ల బంద్‌

    • ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో..

    • స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

  • Mar 31, 2026 06:16 IST

    హైదరాబాద్‌: మియాపూర్‌లో తప్పిన పెను ప్రమాదం

    • హఫీజ్‌పేట మార్తాండనగర్ కాలనీలో హెవీ లోడ్‌తో పేలిన ట్రాన్స్‌ఫార్మర్

    • ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న టాటా ఏసీ వాహనం, రెండు టూవీలర్ల దగ్ధం

  • Mar 31, 2026 06:15 IST

    చెన్నై: నేడు తిరువారూర్‌లో సీఎం స్టాలిన్ ప్రచారం

    • సౌత్‌కార్ స్ట్రీట్‌లో సీఎం స్టాలిన్‌ బహిరంగ సభ

    • 3 రోజుల్లో 32 నియోజకవర్గాల్లో స్టాలిన్ ప్రచారం

  • Mar 31, 2026 06:15 IST

    నేడు LPGతో ముంబై చేరుకోనున్న నౌక

    • రేపు న్యూ మంగళూరు చేరుకోనున్న మరో LPG నౌక

  • Mar 31, 2026 06:14 IST

    ఆపరేషన్‌ కగార్‌కు నేడే చివరి రోజు

    • నేటితో ముగియనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డెడ్‌లైన్‌

    • అజ్ఞాతంలోనే అగ్ర నేతలు గణపతి, బెస్రా, నరహరి

  • Mar 31, 2026 06:13 IST

    IPL: నేడు పంజాబ్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్‌

    • న్యూ చండీగఢ్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

  • Mar 31, 2026 06:12 IST

    నేడు ఏపీలో పలుచోట్ల వర్షాలు: విపత్తు నిర్వహణ శాఖ

    • ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు