Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 07 , 2026 | 06:16 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 07, 2026 17:16 IST

    కేరళం సీఎం విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌ విమర్శలు

    • కేరళంలో బంగారం స్మగ్లింగ్‌ కేసులపై సీఎం రేవంత్‌ సందేహాలు

    • శబరిమల ఆలయ బంగారంపై సమాధానం చెప్పాలి: రేవంత్

    • విజయన్‌ భాష.. సీఎం స్థాయికి తగ్గట్లు లేదు: రేవంత్

    • GSDPలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది: రేవంత్

    • దేశ సగటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ఎక్కువ: రేవంత్

    • తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో ఉంది: రేవంత్

  • Apr 07, 2026 17:15 IST

    ఉపాధి హామీ నిధులు విడుదలలో కేంద్రం విఫలం: కవిత

    • ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి: కవిత

    • కేంద్రం పేదల పొట్టకొడుతుంటే బీజేపీ ఎంపీలు ఏంచేస్తున్నారు?

    • మోదీతో కొట్లాడైనా ఉపాధి హామీ నిధులు తేవాలి: కవిత

  • Apr 07, 2026 17:15 IST

    మీడియాపై వైసీపీ దాడులు హేయం: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

    • ABN-ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైపీపీ శ్రేణుల దాడులు దారుణం

    • ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం

    • విమర్శలు నచ్చకపోతే పద్ధతిగా సమాధానం చెప్పాలి

    • చట్టపరమైన మార్గాల్లో ముందుకెళ్లాలి

    • దాడులతో జర్నలిస్టులను భయపెట్టడం.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కాలని చూడటమే

  • Apr 07, 2026 16:52 IST

    పాక్‌లో స్వల్పస్థాయి లాక్‌డౌన్

    • రాత్రి 8 గంటల కల్లా షాపులు, మాల్స్ మూసేయాలంటూ ఆదేశాలు

    • డివిజన్ కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకూ కార్యకలాపాలకు అనుమతి

    • మెడికల్ షాపులు, ఇతర హెల్త్‌కేర్ సేవలకు మినహాయింపు

    • ఆంక్షల వివరాలను వెల్లడించిన పాక్ ప్రధాని

  • Apr 07, 2026 16:31 IST

    గుంటూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం

    • వైసీపీ తీరుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయ ప్రకాష్ నారాయణ ఆగ్రహం

    • విమర్శలను స్వీకరించలేని వారే దాడులకు దిగుతారు

    • ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వారు భౌతిక దాడులకు దిగరు

    • అభ్యంతరాలు తెలియపరచేందుకు చట్టబద్ధంగా దారులు చాలా ఉన్నాయి

  • Apr 07, 2026 16:25 IST

    కేరళం, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

    • ఎల్లుండి కేరళం, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు

    • ఈనెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు

    • ఈనెల 23 & 29న రెండు విడతల్లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు

    • మే 4న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

  • Apr 07, 2026 16:13 IST

    ఏపీ హైకోర్ట్ వద్ద అమరావతి విజయోత్సవ ర్యాలీ

    • ర్యాలీలో పాల్గొన్న రాజధాని రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు

    • న్యాయస్థానం, శాసనమండలి చోరవతో అమరావతి అజరామరమైంది: రైతులు

    • ‘జై అమరావతి’ అంటూ రైతులు, రైతు మహిళల నినాదాలు

  • Apr 07, 2026 16:00 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 510 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 155 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Apr 07, 2026 15:51 IST

    అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుపై వైసీపీ నేతల దాడి

    • ఖండించిన సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్

    • మీడియాపై దాడి అప్రజాస్వామికం: సురేశ్

    • ప్రజాస్వామ్యంపై నమ్మకం వున్న రాజకీయ శక్తులు దాడులకు తెగబడవు: సురేశ్

    • ఏబీఎన్ ప్రసారాలపై అభ్యంతరం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు: సురేశ్

    • మీడియాపై దాడులు గర్హనీయం: సురేశ్

  • Apr 07, 2026 14:37 IST

    ప్రజాస్వామ్యంలో దాడులకు తెగబడటం సరికాదు: ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్

    • కథనాలపై అభ్యంతరాలుంటే ఖండించాలి, చర్చించాలి: మాధవ్

    • రాజధాని అమరావతిపై విషం చిమ్మిందే జగన్: ఏపీ బీజేపీ చీఫ్

    • జగన్ మనసు మార్చుకుని అభివృద్ధికి సహకరించాలి: పీవీఎన్ మాధవ్

  • Apr 07, 2026 14:28 IST

    రాజధానిపై జగన్‌ను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: మంత్రి కొల్లు రవీంద్ర

    • మాజీ మంత్రులు మీడియా సంస్థపై దాడి దుర్మార్గం: మంత్రి

    • వైసీపీ రాక్షస సంస్కృతికి ఈ దాడి నిదర్శనం: మంత్రి కొల్లు రవీంద్ర

  • Apr 07, 2026 14:06 IST

    ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడులను ఖండించిన మంత్రి అనగాని

    • అధికారంలో లేకుండానే జ‌గ‌న్ 2.0 మనస్తత్వం చూపిస్తున్నారు..

    • జ‌గ‌న్ డైరెక్షన్‌లోనే ABN సంస్థపై దాడులు చేశారు: మంత్రి అనగాని

  • Apr 07, 2026 14:03 IST

    ABN ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

    • ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదు.. ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే

    • అమరావతి అంశంలో విషం చిమ్మింది జగన్‌రెడ్డే..

    • కథనాలపై అభ్యంతరాలుంటే ఖండించాలి లేదా చర్చించాలి: మాధవ్

  • Apr 07, 2026 14:00 IST

    ABN ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడిని ఖండించిన పవన్

    • వైసీపీ చర్యలపై వేమూరి రాధాకృష్ణ చేసిన విశ్లేషణను జీర్ణించుకోలేకే దాడులు: డిప్యూటీ సీఎం

    • వ్యాఖ్యలు నచ్చకపోతే ప్రజాస్వామ్యరీతిలో సమాధానం ఇవ్వాలి..

    • వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే విధ్వంసం సృష్టించింది: : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • Apr 07, 2026 13:38 IST

    హైదరాబాద్ : యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం

    • ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

    • ఘటనా స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు

    • మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలింపు

  • Apr 07, 2026 12:48 IST

    ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడులను ఖండించిన మంత్రి ఆనం

    • వైసీపీ ప్రణాళికాబద్ధంగా ABN ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు చేస్తోంది..

    • ప్రశ్నించే గొంతును అణచివేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనం: మంత్రి ఆనం

  • Apr 07, 2026 12:45 IST

    పల్నాడు జిల్లా: మాచర్లలో మహిళపై అత్యాచారం కేసులో కీలక మలుపు

    • బాధితురాలి ప్రియుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల నిర్ధారణ

    • సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు

    • నిందితుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారణ

    • నిందితుడికి ఎవరెవరు సహాకరించారనే అంశంపై పోలీసుల విచారణ

  • Apr 07, 2026 12:33 IST

    ABN సంస్థలపై వైసీపీ దాడులను ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి

    • మేం ఎదురు తిరిగితే సాక్షి పత్రిక బయటకు కూడా రాదు..

    • వైసీపీలోని లోపాలను ఎత్తి చూపితే అంత ఉలుకెందుకు?: మాజీ మంత్రి సోమిరెడ్డి

  • Apr 07, 2026 12:32 IST

    ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడులను ఖండించిన మంత్రి అచ్చెన్నాయుడు

    • జగన్‌ వైఖరిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: మంత్రి అచ్చెన్నాయుడు

    • మాజీ మంత్రులు, రౌడీమూకల దాడులు దారుణం..

    • దాడులు, ఒత్తిళ్లకు భయపడని వ్యక్తి వేమూరి రాధాకృష్ణ: మంత్రి అచ్చెన్నాయుడు

    • ABN సంస్థలపై వైసీపీ దాడులను ఖండించిన మంత్రి కొలుసు పార్థసారథి, శాప్ చైర్మన్ రవి నాయుడు

  • Apr 07, 2026 12:31 IST

    జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ACB దాడులు

    • కార్యాలయ సిబ్బంది ఫోన్లు సీజ్ చేసి తనిఖీలు

    • పలు శాఖలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఆరా

  • Apr 07, 2026 12:24 IST

    ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి.. ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనం: లోకేశ్

    • జగన్‌ కళ్లలో ఆనందం కోసం ABN ఆఫీస్‌పై వైసీపీ మూకల దాడి: మంత్రి లోకేశ్

    • దమ్మున్న ఛానల్ ABN ఆంధ్రజ్యోతిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

    • ఫాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

  • Apr 07, 2026 11:29 IST

    ABN ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

    • అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు ABN సంస్థపై దాడి

    • రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు మీడియా సంస్థలపైకి వెళ్లడం..

    • ఆ పార్టీ సంస్కృతికి నిదర్శనం: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Apr 07, 2026 11:20 IST

    యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

    • డెడ్‌లైన్‌ తర్వాత 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్‌ ప్లాంట్స్, బ్రిడ్జిలు పేల్చేయగలం

    • ఇరాన్‌ దగ్గర నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, డిఫెన్స్‌ సిస్టమ్‌ లేదు..

    • యుద్ధంలో దక్షిణ కొరియా, జపాన్‌, ఆస్ట్రేలియా మాకు సహకరించలేదు..

    • యుద్ధంలో అమెరికా విజయం సాధించింది: డొనాల్డ్ ట్రంప్

  • Apr 07, 2026 11:19 IST

    ఢిల్లీ: శబరిమల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

    • సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ

  • Apr 07, 2026 11:14 IST

    వైసీపీ నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్..

    • హైదరాబాద్: జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

    • వైసీపీ నేతల నిరసనతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు

    • హాస్పిటల్‌కి వెళ్లే రోగులకు తీవ్ర ఇక్కట్లు

    • కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

  • Apr 07, 2026 09:55 IST

    'వీకెండ్ కామెంట్‌ బై ఆర్కే' కథనంపై వైసీపీ రాద్ధాంతం

    • ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణుల ఆందోళన

    • ABN ఆంధ్రజ్యోతి లక్ష్యంగా వికృత క్రీడ

    • కార్యాలయం లోపలకు వెళ్లేందుకు వైసీపీ శ్రేణుల యత్నం

    • ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట

    • ఆందోళన ముసుగులో దాడులతో భయపెట్టాలనుకుంటున్న వైసీపీ

    • మావిగన్ ఊబి నుంచి బయటపడేందుకు వైసీపీ కుయుక్తులు

  • Apr 07, 2026 09:29 IST

    అమరావతి: NTR వైద్య సేవ ట్రస్టు ఆస్పత్రుల సమ్మె విరమణ

    • ప్రభుత్వ హామీతో సమ్మె విరమించినట్టు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన

    • 10 రోజుల్లో రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ

  • Apr 07, 2026 09:25 IST

    ఢిల్లీ: వలస కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్

    • రాష్ట్రాలకు 5 కేజీల సిలిండర్ల కోటాను రెట్టింపు చేసిన కేంద్రం

  • Apr 07, 2026 08:34 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉదయం 11.30 గంటలకు SIPB సమావేశంలో పాల్గొననున్న సీఎం

    • మధ్యాహ్నం 2.30కి ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

    • మధ్యాహ్నం 3.50కి అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌కు సీఎం చంద్రబాబు

    • నూతన ఫైరింజన్లు, అగ్నిమాపక పరికరాలను ప్రారంభించనున్న సీఎం

  • Apr 07, 2026 08:33 IST

    హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు హౌస్ అరెస్ట్

    • పరిగి వెళ్లకుండా హరీష్‌రావు గృహ నిర్బంధం

    • హరీష్‌రావుతో పాటూ సబిత, పలువురు BRS నేతల హౌస్‌అరెస్ట్

    • హరీష్‌రావు నివాసం దగ్గర పోలీసుల మోహరింపు

    • ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను కలిసేందుకు పరిగి వెళ్తానన్న హరీష్‌రావు

  • Apr 07, 2026 07:43 IST

    అమరావతి: సమర్థ నీటి సరఫరాపై వర్క్‌షాప్‌

    • కానూరు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆఫీస్‌లో సమావేశం

    • హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

  • Apr 07, 2026 07:43 IST

    నేడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ

    • 20 లక్షల ఉద్యోగాల కల్పనపై సమీక్ష

    • మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో సమావేశం

    • ఉద్యోగాల కల్పన, భవిష్యత్‌ ప్రణాళికపై చర్చ

  • Apr 07, 2026 07:34 IST

    నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

    • ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో సీఎం రేవంత్ రోడ్ షో

    • ఉదయం 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో నిర్వహించనున్న సీఎం

    • మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో సీఎం రోడ్ షో

    • కేరళలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..

  • Apr 07, 2026 07:28 IST

    నేడు విజయవాడలో పర్యటించనున్న మంత్రి నారాయణ

    • విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మూడు కీలక రోడ్ల విస్తరణకు శంకుస్థాపన

    • విజయవాడ ఈస్ట్, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో రోడ్ల విస్తరణ

  • Apr 07, 2026 07:18 IST

    నేడు హుజురాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దీక్ష

    • సిరసపల్లిలో డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా దీక్ష

    • 48 గంటల పాటు దీక్ష చేయనున్న కౌశిక్‌రెడ్డి

  • Apr 07, 2026 07:05 IST

    ఉత్తర సిక్కింలో భారీగా మంచు

    • లాచెన్‌లో మంచులో చిక్కుకున్న 1200 మంది పర్యాటకులు

    • యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు

    • లాచెన్‌-శివమందిర్‌ మార్గంలో భారీగా పేరుకున్న మంచు

    • ప్రతికూల వాతావరణంలో సహాయక చర్యలకు ఆటంకం

  • Apr 07, 2026 07:05 IST

    నంద్యాల: నేడు శ్రీశైలంలో కుంభోత్సవం

    • స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాల రద్దు

  • Apr 07, 2026 07:04 IST

    IPL: నేడు రాజస్థాన్‌ Vs ముంబై మ్యాచ్‌

    • రాత్రి 7:30 గంటలకు గౌహతిలో మ్యాచ్‌

  • Apr 07, 2026 07:04 IST

    ఢిల్లీ: నేటి నుంచి జీన్‌కింగ్‌ టెన్నిస్‌ టోర్నీ

    • ప్లేఆఫ్స్‌ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్‌

    • తొలిపోరులో థాయ్‌లాండ్‌తో తలపడనున్న భారత్‌

  • Apr 07, 2026 07:03 IST

    నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

    • బరిలో పీవీ సింధు, లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌

  • Apr 07, 2026 06:22 IST

    ఏపీలోని పలు జిల్లాలకు నేడు రెడ్‌ అలర్ట్‌

    • పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

  • Apr 07, 2026 06:21 IST

    నేటితో ముగియనున్న ఇరాన్‌కు ట్రంప్‌ విధించిన గడువు

    • ఇరాన్‌కు విధించిన గడువు పొడిగించలేదు: డొనాల్డ్‌ ట్రంప్‌

    • ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తాం..

    • ఇరాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటాం..

    • ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: డొనాల్డ్‌ ట్రంప్‌

  • Apr 07, 2026 06:19 IST

    నేడు ములుగు జిల్లా కర్రెగుట్టల్లో DGP శివధర్ రెడ్డి పర్యటన

    • వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో పర్యటించనున్న డీజీపీ

    • చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పర్యటించనున్న డీజీపీ

    • కొత్తగా ఏర్పాటు చేసిన పామునూరు పోలీస్ బేస్ క్యాంప్‌ పరిశీలన

    • ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసిన తర్వాత డీజీపీ పర్యటన

  • Apr 07, 2026 06:18 IST

    ఏపీలో బస్సు ప్రమాదాలపై నేడు సమీక్ష

    • అమరావతి: ఏపీలో బస్సు ప్రమాదాలపై నేడు మంత్రుల సమీక్ష

    • సమీక్షించనున్న హోంమంత్రి అనిత, మంత్రి రాంప్రసాద్ రెడ్డి

  • Apr 07, 2026 06:16 IST

    రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

    • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ధన్యవాదాలు

    • ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..