-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 3rd October 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 03 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 03, 2026 07:35 IST
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం
మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్‌కు పసిడి
ఈ విభాగంలో గోల్డ్ సాధించిన తొలి మహిళగా కుంకుమ్ చరిత్ర
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో కొరియాపై ఘన విజయం

-
Oct 03, 2026 06:45 IST
నేటి మార్కెట్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,50,290గా ట్రేడింగ్
22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.1,37,760గా ట్రేడింగ్
ప్రస్తుతం రూ.2,34,900గా ట్రేడ్ అవుతున్న కిలో వెండి
-
Oct 03, 2026 06:40 IST
విశాఖ: రుషికొండ బీచ్‌లో కొనసాగుతున్న గాలింపు
నిన్న బీచ్‌లో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు
ఒకరి మృతదేహం లభ్యం, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు
-
Oct 03, 2026 06:35 IST
హైదరాబాద్: గుట్కా తయారీ కేంద్రం గుట్టురట్టు
ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ గుట్కా తయారీ కేంద్రంపై దాడులు
టాస్క్‌ఫోర్స్, ఆసిఫ్‌నగర్ పోలీసుల సంయుక్త దాడి
రూ.50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 03, 2026 06:30 IST
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం పేరు
కేంద్రం ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన
-
Oct 03, 2026 06:25 IST
నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా
టీబీజేపీ కీలక నేతలతో సమావేశం కానున్న అమిత్ షా
జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం
రేపు తూప్రాన్‌పేట్, కరీంనగర్‌లో అమిత్ షా పర్యటన
-
Oct 03, 2026 06:20 IST
G7 దేశాల కీలక నిర్ణయం
4 నెలల వ్యవధిలో 10 కోట్ల బ్యారెళ్ల చమురు
ఇంధన ఉత్పత్తులను విడుదల చేసేందుకు అంగీకారం
అమెరికాలో రికార్డు స్థాయికి చేరిన డీజిల్ ధర
-
Oct 03, 2026 06:17 IST
కాంగోలో వణికిస్తోన్న ఎబోలా మహమ్మారి
ఇప్పటివరకూ 4 వేల మందికిపైగా మృతి
ఎబోలా వ్యాధి బారిన మరో 8,300 మంది
-
Oct 03, 2026 06:15 IST
నేడు భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర
ప్రధాని మోదీ 25 ఏళ్ల సేవకు సంఘీభావంగా యాత్ర
భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి దర్శనం
వారణాసి వరకు సేవా సంకల్ప యాత్ర
-
Oct 03, 2026 06:12 IST
హైదరాబాద్: నేడు నటుడు ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్
SIRపై ఉదయం 11 గంటలకు నటుడు ప్రకాష్‌రాజ్ ప్రెస్‌మీట్
-
Oct 03, 2026 06:10 IST
హైదరాబాద్: నేడు మంత్రుల మెట్రో ప్రయాణం
ఉదయం 11 గంటలకు బేగంపేట మెట్రోస్టేషన్ నుంచి మంత్రుల ప్రయాణం
మంత్రులందరికీ వన్డే పాస్‌ను కొనుగోలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి
-
Oct 03, 2026 06:07 IST
విజయవాడలో నేడు పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్
సదస్సుకు హాజరుకానున్న సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్
ఒకే వేదికపైకి రానున్న ఐఐటీయన్లు, పారిశ్రామిక దిగ్గజాలు
ఏపీని టెక్‌హబ్‌గా మార్చే దిశగా మరో అడుగు
-
Oct 03, 2026 06:05 IST
ముంబైలో కొనసాగుతున్న సీజేపీ ఆందోళన
కేంద్రం ఎన్నికల సంఘం తీరుకు నిరసన
జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
-
Oct 03, 2026 06:03 IST
బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్
మధ్యాహ్నానికి పిటిషన్ ఫైల్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులను నియమించాలని ఆదేశం
-
Oct 03, 2026 06:02 IST
ఆసియా గేమ్స్‌లో నేడు మెన్స్ క్రికెట్ ఫైనల్
నేడు భారత్ Vs పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
ఉదయం 10 గంటల నుంచి మ్యాచ్
-
Oct 03, 2026 06:00 IST
నేడు అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు
అక్కడక్కడ పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం
కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ