Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 30 , 2026 | 06:03 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 30, 2026 07:19 IST

    మహిళల హాకీ ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనా

    • ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై 1-3 తేడాతో ఘన విజయం

    • ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడిన అర్జెంటీనా

  • Aug 30, 2026 06:45 IST

    తిరుపతి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

    • పీఎల్ఆర్ కల్యాణ మండపం వెనుక ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్న వైనం

    • 10 మంది పేకాటరాయుళ్ల అరెస్టు, రూ.48,400 నగదు స్వాధీనం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ పోలీసులు

  • Aug 30, 2026 06:42 IST

    తిరుపతి: ఇంటి నుంచి పారిపోయిన 12 ఏళ్ల బాలుడిని రక్షించిన ఈస్ట్ పోలీసులు

    • ​మార్కాపురానికి చెందిన వెంకటనారాయణ కుమారుడు కిషోర్‌గా బాలుడి గుర్తింపు

    • ​బాలుడు ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు

    • ​తండ్రీకొడుకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, బాలుడిని అప్పగించిన పోలీసులు

  • Aug 30, 2026 06:40 IST

    హైదరాబాద్‌: నీట్‌ అభ్యర్థులకు ట్రాఫిక్ అలర్ట్‌

    • ఉదయం 11:30 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు

    • 10K రన్‌తో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు

  • Aug 30, 2026 06:35 IST

    నేపాల్ వరదలు.. 108 మంది భారతీయులు సురక్షితం

    • 50 మంది భారతీయులతో అధికారులు సంప్రదింపులు

    • చైనా నుంచి నేపాల్ చేరుకున్న 598 మంది భారతీయులు

    • చైనాలో ఇంకా 900 మంది భారతీయులు

    • ఇప్పటివరకు 275 మంది భారతీయులు గల్లంతు

    • భారతీయుల భద్రతకు రాయబార కార్యాలయం చర్యలు

  • Aug 30, 2026 06:30 IST

    నేడు కేరళలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ పర్యటన

    • కౌముది వేడుకల్లో పాల్గొననున్న రాధాకృష్ణన్‌

    • అరన్ముల ఉత్సవాన్ని ప్రారంభించనున్న రాధాకృష్ణన్‌

    • లక్షద్వీప్‌లో మత్స్య శాఖ కార్యక్రమానికి హాజరు

  • Aug 30, 2026 06:27 IST

    ఉజ్బెకిస్థాన్‌లో కొనసాగుతున్న ప్రధాని మోదీ టూర్‌

    • ఉజ్బెకిస్థాన్‌లో నాలుగోసారి పర్యటిస్తున్న ప్రధాని మోదీ

  • Aug 30, 2026 06:25 IST

    నేడు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కిషన్‌రెడ్డి పర్యటన

    • జోగులాంబ ఆలయం దగ్గర సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ప్రారంభం

    • నేడు చేవెళ్ల లోక్‌సభ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

    • బీజాపూర్ హైవే పనులు పరిశీలించనున్న కిషన్‌రెడ్డి

    • వికారాబాద్‌-తాండూర్‌ రైల్వేస్టేషన్ల పరిశీలన

    • ఏకలవ్య ఫౌండేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • Aug 30, 2026 06:22 IST

    నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల పర్యటన

    • అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు

  • Aug 30, 2026 06:20 IST

    ఉమెన్స్ టీ20 ఆసియా కప్‌: నేడు భారత్‌ Vs థాయ్‌లాండ్‌

    • రాత్రి 8 గంటలకు దుబాయ్‌లో మ్యాచ్‌

  • Aug 30, 2026 06:17 IST

    నేటి నుంచి US ఓపెన్‌

    • తొలి రౌండ్‌లో సఫలిన్‌ Vs జకోవిచ్‌

  • Aug 30, 2026 06:15 IST

    బెంగళూరు: నేటినుంచి దులీప్‌ ట్రోఫీ సెమీస్‌

    • సెమీస్‌లో సౌత్ జోన్ Vs నార్త్ జోన్‌

    • మరో సెమీస్‌లో సెంట్రల్ జోన్ Vs ఈస్ట్‌ జోన్‌

  • Aug 30, 2026 06:12 IST

    నేడు దేశవ్యాప్తంగా నీట్‌ ఎగ్జామ్‌

    • 1,300 కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష

    • పరీక్ష రాయనున్న 2,73,183 మంది అభ్యర్థులు

    • ఉ.9 నుంచి మ.12 గంటల వరకు ఎగ్జామ్‌

  • Aug 30, 2026 06:10 IST

    నేడు తిరుపతి, అనంతపురం జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

    • వివాహ కార్యక్రమాలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు

  • Aug 30, 2026 06:05 IST

    నేడు విశాఖలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ

    • DSCపై వైసీపీ అసత్య ప్రచారం అంటూ ఆర్కే బీచ్‌లో టీచర్ల నిరసన

  • Aug 30, 2026 06:00 IST

    నేడు హైదరాబాద్‌లో 10K రన్‌ మారథాన్‌

    • ఉదయం 5 గంటల నుంచి 11.30 వరకూ మారథాన్‌

    • నెక్లెస్‌రోడ్‌ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ మారథాన్‌