Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 29 , 2026 | 06:13 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 29, 2026 07:15 IST

    ఖమ్మం: వైరా మండలం సోమవరం గ్రామం వద్ద ప్రమాదం

    • గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

    • ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌తో పాటూ పలువురికి గాయాలు

    • దేవరపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా జరిగిన సంఘటన

  • Sep 29, 2026 07:10 IST

    హైదరాబాద్: నాంపల్లి పరిధిలో నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శంకుస్థాపన

    • రెడ్ హిల్స్‌లో ఉదయం 11కు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి

    • హాజరుకానున్న మంత్రులు పొన్నం, మహమ్మద్ అజారుద్దీన్, స్థానిక ఎమ్మెల్యే

  • Sep 29, 2026 07:05 IST

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి

    • 33.80 అడుగుల వద్ద 5,61,492 క్యూసెక్కుల వరద ప్రవాహం

  • Sep 29, 2026 07:00 IST

    అమెరికా-ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు మధ్యవర్తుల ప్రయత్నాలు

    • టెహరాన్ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ రాజీకి యత్నాలు

    • వ్యూహంలో భాగంగానే టెహరాన్‌ ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చినట్లు సమాచారం

    • సైనిక చర్య లేకుండా సమస్య పరిష్కారానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారన్న అమెరికా

  • Sep 29, 2026 06:55 IST

    ఉత్తరప్రదేశ్‌ మాల్వాన్‌లో ఘోర ప్రమాదం

    • సిలిండర్ పేలి కుప్పకూలిన రెండంతస్తుల భవనం

    • ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

    • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

  • Sep 29, 2026 06:50 IST

    విజయవాడ: ఆటోనగర్‌లో లారీ క్లీనర్‌ను రాయితో కొట్టి చంపిన వ్యక్తి

    • ఫోన్ పోయిందన్న విషయంలో చెలరేగిన గొడవ

    • హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Sep 29, 2026 06:47 IST

    విశాఖ: ఇటీవల వర్షాలతో భారీ నష్టం

    • GVMC పరిధిలో 11.5 కి.మీ. దెబ్బతిన్న రోడ్లు

    • రూ.6 కోట్ల నష్టం

  • Sep 29, 2026 06:45 IST

    ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

    • మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

  • Sep 29, 2026 06:40 IST

    నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం: విరాట్ కోహ్లీ

    • భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

    • జట్టును ఎలా ముందుకు నడిపించాలో గిల్‌కు తెలుసు: విరాట్ కోహ్లీ

    పూర్తి కథనం..

  • Sep 29, 2026 06:35 IST

    హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇవీ

    • 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,160

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,640

    • కిలో వెండి ధర రూ.2.44 లక్షలు

  • Sep 29, 2026 06:30 IST

    యాదాద్రి : బీబీనగర్- ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్యలో ప్రమాదం

    • గొర్రెల మందను ఢీ కొట్టిన రైలు.. సుమారు 100 గొర్రెల మృతి

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 29, 2026 06:25 IST

    ఏపీ 2024 బ్యాచ్‌ IASలకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగ్‌

    • తెనాలి సబ్‌ కలెక్టర్‌గా సందీప్‌ రఘువంశీ

    • పాడేరు సబ్‌ కలెక్టర్‌గా కనాల చిరంజీవి

    • రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా ప్రదీప్‌ రాజ్‌కుమార్‌

    • చింతూరు సబ్ కలెక్టర్‌గా చిట్టుపాటి నరేంద్ర పాడల్‌

    • పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా సచిన్‌ రహర్‌

    • పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా ఫరీన్‌ జహీద్‌

    • నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా మనీషా

    • రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌గా శుభం నోఖ్వాల్‌

  • Sep 29, 2026 06:23 IST

    నేడు కేరళకు మాజీ మంత్రి కేటీఆర్‌

    • కొచ్చిలో ఓ కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్

  • Sep 29, 2026 06:20 IST

    విజయవాడ: నేడు మిషన్‌ కర్మయోగి వర్క్‌ షాప్‌

    • రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల సదస్సు

    • ఉదయం 10:30కు సదస్సును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • పాల్గొననున్న కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌

    • పాలనా నైపుణ్యాల పెంపుపై మిషన్‌ కర్మయోగి సదస్సు

  • Sep 29, 2026 06:19 IST

    నేడు ఒంగోలులో జగన్‌ పర్యటన

    • రాజశేఖర్‌ కుటుంబసభ్యులను పరామర్శించనున్న జగన్‌

    • ఇటీవల మృతిచెందిన వైసీపీ నేత కాకుమాను రాజశేఖర్‌

  • Sep 29, 2026 06:18 IST

    నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • రామాపురంలో పల్లె పండుగ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు

    • హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

  • Sep 29, 2026 06:17 IST

    నేడు గ్రూప్‌-1 అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ

    • అక్రమాలు జరగలేదని ఎంపికైన అభ్యర్థుల పిటిషన్‌

  • Sep 29, 2026 06:15 IST

    వివేకా కేసు: నేడు మరోసారి ఎర్ర గంగిరెడ్డిని విచారించనున్న ఈడీ

    • నిన్న 9 గంటల పాటు ఎర్ర గంగిరెడ్డిని విచారించిన ఈడీ

  • Sep 29, 2026 06:14 IST

    నేడు అనంతపురంలో కూటమి సమన్వయ కమిటీ సమావేశం

    • సమావేశానికి హాజరుకానున్న మూడు పార్టీల నేతలు

  • Sep 29, 2026 06:12 IST

    ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

    • రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

  • Sep 29, 2026 06:10 IST

    మెదక్: వచ్చే నెల 4న మెదక్ జిల్లాకు అమిత్ షా రాక

    • తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

    • మిల్క్ బల్క్ యూనిట్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్న అమిత్ షా

    • 5 లక్షల లీటర్ల కెపాసిటీతో మిల్క్ బల్క్ యూనిట్ ఏర్పాటు

    • అనంతరం రైతు బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

  • Sep 29, 2026 06:08 IST

    విజయవాడ: నేడు మిషన్‌ కర్మయోగి వర్క్‌ షాప్‌

    • రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల సదస్సు

  • Sep 29, 2026 06:05 IST

    ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్

    • రేపు CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • Sep 29, 2026 06:02 IST

    రేపు బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబీన్ అధ్యక్షతన కీలక భేటీ

    • కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లతో నితిన్‌ నబీన్ సమావేశం

    • నూతన జాతీయ వర్గంపై చర్చ

    • త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలపై చర్చ

  • Sep 29, 2026 06:00 IST

    తిరుమల: శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న మంత్రి నారా లోకేశ్

    • గాయత్రి నిలయం వద్ద లోకేశ్‌కి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, అధికారులు

    • వేకువజామున సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొన్న లోకేశ్

    • మధ్యాహ్నం రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో కేరళంకు వెళ్లనున్న లోకేశ్