Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 22 , 2026 | 07:19 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 22, 2026 21:32 IST

    NTR పోలీస్ కమిషనరేట్‌ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు

    • కృష్ణా జిల్లా పరిధిలోని పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, ఆత్కూరు, ఉంగుటూరు, ఉయ్యూరు టౌన్‌, ఉయ్యూరు రూరల్‌, పమిడిముక్కల, తోట్లవల్లూరు పీఎస్‌లను NTR కమిషనరేట్‌లో విలీనం

    • ఇకపై NTR పోలీస్ కమిషనరేట్ పరిధిలో 37 పోలీస్ స్టేషన్లు

  • Jun 22, 2026 21:30 IST

    అమరావతి: రేపు మంత్రివర్గ సమావేశం

    • SIPBలో ఆమోదించిన పెట్టుబడులకు ఆమోదముద్ర

    • టూరిస్ట్‌ బస్సుల రిజిస్ట్రేషన్‌ ఛార్జీల తగ్గింపు అంశంపై చర్చ

    • క్వాంటం వ్యాలీలో 10 సంస్థల ఏర్పాటుకు ఆమోదం

    • తల్లికి వందనం నిధుల విడుదలకు ఆమోదం

    • కేబినెట్ ఎజెండా తర్వాత రెండేళ్ల కూటమి పాలనపై చర్చ

  • Jun 22, 2026 21:03 IST

    అమరావతి: రేపు లోకేష్ అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ భేటీ

    • ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గం ఉపసంఘం సమావేశం

    • హాజరుకానున్న సబ్‌కమిటీ ఆరుగురు సభ్యులు

  • Jun 22, 2026 20:42 IST

    శ్రీకాకుళం: కొత్తూరు పీఎస్ నుంచి వచ్చిన MLC దువ్వాడ శ్రీనివాస్‌

    • పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడను ప్రశ్నించిన పోలీసులు

    • ఈ నెల 27న మరోసారి విచారణకు రావాలని పోలీసుల ఆదేశం

  • Jun 22, 2026 20:32 IST

    కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

    • హైదరాబాద్‌ మెట్రో, IRFC లోన్ అంశాలపై చర్చ

  • Jun 22, 2026 20:27 IST

    ఏపీలో జనసేన సమాచార కమిటీ పరిశీలకుల నియామకం

    • సమాచార సేకరణ కమిటీలను నియమించిన పవన్‌

    • 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పరిశీలకుల నియామకం

  • Jun 22, 2026 20:04 IST

    హైదరాబాద్‌: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం

    • హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు

    • హాజరైన కేంద్రమంత్రులు పెమ్మసాని, అనుప్రియ పటేల్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు

  • Jun 22, 2026 20:03 IST

    నల్లగొండ: తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో నలుగురి మృతి

    • ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు

    • మృతుల్లో భార్యాభర్తలు సుల్తాన్, హసీనా

    • లభించని మరో ఇద్దరి గుర్తింపు

    • నల్లగొండ ప్రకాశం బజార్‌లో బ్యాగుల వ్యాపారి సుల్తాన్‌

    • ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న హసీనా

  • Jun 22, 2026 20:01 IST

    మియాపూర్‌లో విషాద ఘటన.. యువతి మృతి

    • మయూరి నగర్‌లోని అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన 20ఏళ్ల ప్రణవి

    • పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు సమాచారం

    • తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన యువతి

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 22, 2026 19:50 IST

    వాట్సాప్ సీఈఓగా ‘క్రెడ్’ వ్యవస్థాపకుడు కునాల్

    • తాజాగా ప్రకటించిన వాట్సాప్ మాతృసంస్థ మెటా

    • వాట్సాప్ గ్లోబల్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని వెల్లడి

    • వాట్సాప్ నాయకత్వానికి కునాల్ తగిన వ్యక్తి అని వ్యాఖ్య

  • Jun 22, 2026 19:49 IST

    రిలయన్స్ ADA గ్రూప్ కేసులో ఇద్దరు మాజీ సీఈఓల అరెస్ట్‌

    • RHFL కేసులో రూ.10వేల కోట్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రిలయన్స్ సంస్థలు

    • ఇప్పటివరకు ADA గ్రూప్ కేసుల్లో ఆరుగురి అరెస్ట్‌.. 16 మందిపై ఛార్జ్‌షీట్‌

  • Jun 22, 2026 19:42 IST

    సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్‌

    • కస్టోడియల్ టార్చర్ వల్లే సాయికృష్ణ మృతిచెందాడని పిల్‌

    • పిల్ దాఖలు చేసిన తాడిశెట్టి వీరబాబు

  • Jun 22, 2026 19:37 IST

    అమరావతి: హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నాని

    • 2021 నాటి ఘటనపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన ప్రభుత్వం

  • Jun 22, 2026 19:12 IST

    టీజీ20 లీగ్‌2026లో బోణీ కొట్టిన రంగారెడ్డి రైజర్స్

    • నల్గొండపై 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయం

    • స్కోర్స్: నల్గొండ- 189/8, రంగారెడ్డి- 190/5(16.3 ఓవర్లు)

  • Jun 22, 2026 19:09 IST

    ఢిల్లీ: రేపు 2026 పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం

    • మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌కు జ్ఞాపికలతో మంత్రి లోకేశ్ సత్కారం

    • ఇద్దరు సీనియర్‌ నటులకు పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణం: మంత్రి లోకేశ్

  • Jun 22, 2026 19:05 IST

    • హైదరాబాద్: బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు

    • కాసేపట్లో హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు

    • పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి

    • హాజరైన కేంద్రమంత్రులు పెమ్మసాని, అనుప్రియ పటేల్‌, ఏపీ మంత్రి సత్యకుమార్‌, కాంగ్రెస్‌ నేత కేవీపీ

  • Jun 22, 2026 18:48 IST

    కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    • హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి

    • మెట్రో ఫేజ్‌-1 టేకోవర్‌, IRFC లోన్ విడుదలపై చర్చ

  • Jun 22, 2026 18:45 IST

    DTO వెంకన్న మృతిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశం

    • విచారణాధికారిగా జాయింట్ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్ నియామకం

    • ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాస్తవాలపై సమగ్ర విచారణకు ఆదేశం

  • Jun 22, 2026 18:30 IST

    ఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌తో ముగిసిన టీజీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం

    • భవ్య ఇండస్ట్రియల్ స్కీం(భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన) కింద కొత్త పార్కులు ఏర్పాటుపై చర్చించా: శ్రీధర్ బాబు

    • హైదరాబాద్ బెంగుళూరు మార్గాన్ని డిఫెన్స్ కారిడార్‌గా గుర్తించాలని కోరా: శ్రీధర్ బాబు

    • జహీరాబాద్‌లో లాజిస్టిక్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరాను: శ్రీధర్ బాబు

  • Jun 22, 2026 18:24 IST

    విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు

    • కృష్ణలంక పీఎస్‌లో సిట్‌ బృందం

    • సీసీటీవీ ఫుటేజీ, కంప్యూటర్ డేటా పరిశీలన

    • ఉదయం విజయలక్ష్మిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్‌

    • విజయలక్ష్మి స్టేట్‌మెంట్‌తో సిట్‌ ఆధారాల సేకరణ

    • సీఐ నాగరాజునూ విచారణకు పిలిచే అవకాశం

  • Jun 22, 2026 18:19 IST

    అమరావతి: హైదరాబాద్‌ బయల్దేరిన సీఎం చంద్రబాబు

    • వెలగపూడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ బయల్దేరిన చంద్రబాబు

    • రాత్రికి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి రజితోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు

  • Jun 22, 2026 18:06 IST

    సికింద్రాబాద్ రసూల్‌పురాలో డ్రగ్స్ విక్రయాలపై DTF దాడులు

    • రూ.1.53 లక్షల విలువైన 51 గ్రాముల MDMA స్వాధీనం

    • రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితుల అరెస్ట్‌

  • Jun 22, 2026 17:58 IST

    యూపీ: లఖ్‌నవూలో జరిగిన అగ్నిప్రమాదంలో 12కు చేరిన మృతుల సంఖ్య

    • అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

    • గాయపడిన వారికి రూ.50వేల ఆర్థిక సాయం: PMO

    • లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై సీఎం యోగి దిగ్భ్రాంతి

  • Jun 22, 2026 17:51 IST

    ముంబైలో MLA, MLCలతో ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర భేటీ

    • ముగ్గురు MLAలు, MLC డుమ్మా

  • Jun 22, 2026 17:49 IST

    అసెంబ్లీ సమావేశాలకు పాకిన మహారాష్ట్ర పొలిటికల్‌ హీట్‌

    • మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం

    • రైతుల రుణమాఫీపై ప్రశ్నిస్తూ శివసేన UBT ఎమ్మెల్యేల నిరసన

  • Jun 22, 2026 17:36 IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం

    • శివసేన UBTకి లోక్‌సభలో కోలుకోలేని దెబ్బ

    • షిండే గూటికి ఆరుగురు శివసేన ఎంపీలు

    • ఢిల్లీలో షిండే వర్గంలో విలీనమైన ఆరుగురు ఎంపీలు

    • ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి తప్పించుకునే వ్యూహం

  • Jun 22, 2026 17:14 IST

    జులైలో యూకే కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం!

    • యూకే ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా

    • జులైలో నూతన ప్రధాని బ్రిటన్ పగ్గాలు చేపట్టవచ్చన్న స్టార్మర్

    • నూతన ప్రధానికి పూర్తి సహకారం అందిస్తానని వెల్లడి

  • Jun 22, 2026 16:49 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: మహిళల భారత జట్టు సెమీస్ చేరాలంటే!

    • ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో భారత్

    • తదుపరి రెండు మ్యాచుల్లో గెలవాలి

    • ఒక్క మ్యాచుల్లో ఓడినా సెమీస్ ఆశలు సంక్లిష్టం

    • ఆస్ట్రేలియాతో ఓడినా.. బంగ్లాతో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి

    పూర్తి కథనం

  • Jun 22, 2026 16:46 IST

    ఢిల్లీ: రిపబ్లిక్ టీవీ సమ్మిట్-2026లో ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

    • 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం విజన్: లోకేశ్

    • సీఎం చంద్రబాబు అత్యంత వేగంగా పనులు కోరుకునే 'స్పీడ్ బాస్': లోకేశ్

    • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా అహర్నిశలూ శ్రమిస్తున్నారు: లోకేశ్

    • పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ 3S(స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) ఫార్ములా: లోకేశ్

    • దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి: లోకేశ్

  • Jun 22, 2026 16:45 IST

    సీఎం చంద్రబాబును కలిసిన కర్ణాటక ప్రతినిధుల బృందం

    • తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

    • గతేడాది తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో మొత్తం 33 గేట్లు మార్చిన కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు

    • ఈనెల 25న తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభం

    • ప్రారంభించనున్న కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్

  • Jun 22, 2026 16:40 IST

    అమరావతి: ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్‌ అమలు: మంత్రి మండిపల్లి

    • 'ఆటో డ్రైవర్' సేవా పథకం కింద 2.9 లక్షల మంది ఆటోడ్రైవర్లకు రూ.15వేల చొప్పున పంపిణీ

    • డోన్‌, దర్శిలో ఇంటిగ్రేటెడ్ డ్రైవర్ ట్రైనింగ్‌ రీసెర్స్‌ సెంటర్లు

    • ఐదేళ్లపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పన్ను మినహయింపు: మంత్రి మండిపల్లి

  • Jun 22, 2026 16:24 IST

    ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

    • ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌

  • Jun 22, 2026 16:11 IST

    ఉత్తర్‌ప్రదేశ్‌: లఖ్‌నవూలో భారీ అగ్నిప్రమాదం

    • ఓ కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటలు

    • ప్రాణాలతో బయటపడేందుకు కోచింగ్ సెంటర్ నుంచి దూకేసిన విద్యార్థులు

    • పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం

  • Jun 22, 2026 16:00 IST

    హైదరాబాద్: నగరంలో భారీ వర్ష సూచనతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచన

    • విద్యాసంస్థలు, ఐటీ సహా ఇతర కంపెనీలకు ట్రాఫిక్ పోలీసుల సూచన

    • మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత విధులు ముగించేలా చర్యలు తీసుకోవాలని సూచన

    • సాయంత్రం భారీ వర్షం ఉండడంతో ముందుగానే ఆఫీస్ నుంచి బయల్దేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం

  • Jun 22, 2026 15:51 IST

    హైదరాబాద్: నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

    • రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(RDS), తుంగభద్ర డ్యామ్‌పై సమీక్ష

    • తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఉత్తమ్‌

    • RDSలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ ఉండదు: ఉత్తమ్

    • RDS ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు: ఉత్తమ్‌

  • Jun 22, 2026 15:38 IST

    ఇవాళ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

    • 291 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

    • 89 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ

    • అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో లాభాల బాట

  • Jun 22, 2026 15:25 IST

    అమరావతి: రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు

    • ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నం: సీఎం చంద్రబాబు

    • వివిధ ఘటనలకు కులమతాల రంగు పులుముతున్నారు: చంద్రబాబు

    • వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

    • దుష్ప్రచారంతో ఉద్యోగులు, అధికారులను బద్నాం చేస్తున్నారు: చంద్రబాబు

    • ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం: సీఎం చంద్రబాబు

  • Jun 22, 2026 15:22 IST

    హైదరాబాద్: సచివాలయంలో సీఎస్‌తో ఎస్‌బీఐ అధికారుల భేటీ

    • రాయదుర్గం భూముల పై చర్చ

    • రాయదుర్గం భూముల వ్యవహారంలో SBI తీరుపై సీరియస్‌గా ఉన్న సర్కార్

    • SBI లీడ్ బ్యాంక్ హోదా తొలగించే యోచనలో ప్రభుత్వం

    • SBIలో ఉన్న ప్రభుత్వ ఖాతాల లావాదేవీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయం

    • ప్రభుత్వ నిర్ణయంతో రాయబారానికి SBI అధికారులు

  • Jun 22, 2026 15:13 IST

    అమరావతి: RTGS కేంద్రం నుంచి శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • మానవీయ కోణంలో PGRS అర్జీల పరిష్కారం: చంద్రబాబు

    • ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తాం: సీఎం

    • పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తాం: సీఎం చంద్రబాబు

    • ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు

    • ఉద్యోగులు పాలనాపరంగా సామర్థ్యాలను పెంచుకోవాలి: చంద్రబాబు

    • మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు

  • Jun 22, 2026 15:08 IST

    భారత్‌కు విక్రయించిన కీలక ఆయుధాలకు సర్వీస్‌ అందించేందుకు అమెరికా అంగీకారం

    • అపాచీ హెలికాప్టర్లు, M777A2 శత్రుఘ్నలకు సంబంధించిన సర్వీసులు అందించనున్న యూఎస్ఏ

  • Jun 22, 2026 15:03 IST

    హైదరాబాద్: నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన సినీ నటుడు అల్లు అర్జున్‌

    • ముంబై నుంచి వర్చువల్‌గా కోర్టుకు హాజరైన అల్లు అర్జున్‌

    • వీడియో కాన్ఫరెన్స్ హాజరుకు అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు

  • Jun 22, 2026 14:53 IST

    నిర్మల్: కడెం మం. నచ్చన్ ఎల్లాపూర్ వద్ద కూలిన రైస్ మిల్

    • ఈదురు గాలులతో కూడిన వర్షానికి కూలిన నిర్మాణంలో ఉన్న రైస్ మిల్

    • నచ్చన్ ఎల్లాపూర్, ధర్మాజీపేట్ గ్రామాల సమీపంలో ప్రధాన రహదారి మీద కూలిన వృక్షాలు

  • Jun 22, 2026 14:47 IST

    అమరావతి: రెండేళ్ల పాలనపై వివిధ శాఖలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయనున్న ప్రభుత్వం

    • కీలకమైన 10 అంశాలపై ప్రగతి నివేదికల విడుదలకు సీఎం నిర్ణయం

    • ప్రొగ్రెస్ రిపోర్టుల విడుదలలో భాగంగా తొలుత విద్యుత్ శాఖ ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయనున్న మంత్రి గొట్టిపాటి

  • Jun 22, 2026 14:35 IST

    టెకీ గాయత్రి కేసులో మరో కీలక మలుపు

    • గాయత్రి కేసు విచారణాధికారి మార్పు

    • ముస్సోరి SHOపై ఉత్తరాఖండ్‌ DGP దీపంసేథ్‌ ఆగ్రహం

    • బాధితురాలి తండ్రి పట్ల SHO ప్రవర్తనపై సీరియస్‌

    • భర్త శ్రీచరణ్‌ను విచారిస్తున్న ముస్సోరి పోలీసులు

  • Jun 22, 2026 14:21 IST

    హనుమకొండ: రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు: కేటీఆర్‌

    • పంటల కొనుగోలు అంశంలో రేవంత్‌రెడ్డి డ్రామాలు: కేటీఆర్‌

    • యూరియా కోసం రైతులు క్యూలైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చింది: కేటీఆర్

    • అధికారం మనకు మాత్రమే సొత్తు అనుకోవద్దు: కేటీఆర్‌

    • వందసార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్‌..రాష్ట్రానికి ఏం తెచ్చారు?: కేటీఆర్‌

    పూర్తి కథనం

  • Jun 22, 2026 14:15 IST

    బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన కీర్‌ స్టార్మర్‌

    • లేబర్‌ పార్టీ నుంచి పెరిగిన ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

    • పదేళ్లలో యూకేకు ఏడో ప్రధానిగా పదవిని వీడుతున్న నేతగా స్టార్మర్‌

    • కొత్త నాయకత్వ ఎంపికపై లేబర్‌ పార్టీలో చర్చలు ప్రారంభమయ్యే అవకాశం

  • Jun 22, 2026 14:06 IST

    హనుమకొండ: BRS శవరాజకీయాలు మానుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

    • ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో భూపాలపల్లి DTO చనిపోయారు: పొన్నం

    • ఇసుక మాఫియా ఎక్కడా లేదు: మంత్రి పొన్నం

    • ఘటనపై సీఎం రేవంత్ సమగ్ర విచారణకు ఆదేశించారు: పొన్నం

  • Jun 22, 2026 13:56 IST

    హైదరాబాద్: హరీశ్‌రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

    • భూపాలపల్లి DTO వెంకన్న మృతిపై ప్రభుత్వం స్పందించింది: ఆది శ్రీనివాస్

    • హరీశ్ వ్యాఖ్యల్లో నిజముంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం: ఆది శ్రీనివాస్

    • ప్రతిదీ భూతద్దంలో చూస్తే ఎలా?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    • ప్రతి అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం సరికాదు: ఆది శ్రీనివాస్

  • Jun 22, 2026 13:55 IST

    వరంగల్: SIRతో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోంది: మీనాక్షి నటరాజన్

    • ఓట్ చోరీ ద్వారానే బెంగాల్‌లో బీజేపీ గెలిచింది: మీనాక్షి నటరాజన్

    • దేశంలో పేదలకు ఓటు వేసే హక్కు కూడా లేదా?: మీనాక్షి నటరాజన్

    • దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?: మీనాక్షి నటరాజన్

  • Jun 22, 2026 13:54 IST

    హైదరాబాదులో వెలుగు చూసిన భారీ మోసం

    • జ్యువెలరీ షోరూం యజమానులకు టోకరా వేసిన కేటుగాడు

    • రూ.21 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను కొట్టేసిన కేటుగాడు నితిన్

    • ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లతో కాంటాక్ట్స్‌ ఉన్నాయంటూ నితిన్ మోసం

    • 13 కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు తీసుకున్న నితిన్

    • సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నలుగురు జ్యువెలరీ షాప్ యజమానులు

  • Jun 22, 2026 13:48 IST

    అమరావతి: వైసీపీ కాపు నాయకులపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శలు

    • వైసీపీ కాపు నాయకులు చెప్పే కబుర్లు శ్రీరంగనీతుల్లా ఉన్నాయని వ్యాఖ్య

    • కాపులకు వచ్చిన 5% రిజర్వేషన్‌ను వైసీపీ ప్రభుత్వమే రద్దు చేసిందని ఆరోపణ

    • జీవో రద్దైనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీత

    • వైసీపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్య

  • Jun 22, 2026 13:41 IST

    అమెరికాకు చైనా షాక్‌

    • అమెరికాకు చెందిన 10 సైనిక కంపెనీలపై చైనా ఆంక్షలు

    • ఆయా కంపెనీలకు పౌర-మిలిటరీ వినియోగ వస్తువుల ఎగుమతిపై నిషేధం

    • ఇటీవల రక్షణరంగ కాంట్రాక్టుల్లో చైనా టెక్‌ కంపెనీలపై అమెరికా నిషేధం

  • Jun 22, 2026 13:38 IST

    ఢిల్లీ: నీట్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోపై ఎన్టీఏ స్పష్టత

    • నీట్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వీడియో ఫేక్: ఎన్టీఏ

    • తప్పుడు ప్రచారాలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మొద్దు: ఎన్టీఏ

    • ఫేక్ వీడియోను కొందరు కావాలనే వైరల్ చేస్తున్నారు: ఎన్టీఏ

    • neet.nta.nic.inలో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి: ఎన్టీఏ

  • Jun 22, 2026 13:15 IST

    ఢిల్లీ: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    • గాంధీ సరోవర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రాజ్‌నాథ్‌కు ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

  • Jun 22, 2026 13:15 IST

    మాస్కోపై మరోసారి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి

    • 60 డ్రోన్లను కూల్చేసిన రష్యా ఎయిర్ డిఫెన్స్

    • మాస్కోలో పలు ఎయిర్‌పోర్టుల మూసివేత

  • Jun 22, 2026 13:11 IST

    భూపాలపల్లి DTO వెంకన్న మృతిపై ఎక్స్‌లో స్పందించిన హరీశ్‌రావు

    • ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా?: హరీశ్ రావు

    • DTO వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాలి: హరీశ్ రావు

  • Jun 22, 2026 13:10 IST

    అమరావతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

    • ఇంద్రకీలాద్రి దేవాలయంలో నకిలీ టికెట్ల అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు

    • ఏబీఎన్ వరుస కథనాలపై స్పందించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    • తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి ఆనం

    • గత ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో జరిగిన తప్పిదాలపై ఇచ్చిన రిపోర్టులు సరిగా లేవు: మంత్రి ఆనం

    • సమగ్ర విచారణకు ఆదేశించాం: మంత్రి ఆనం

    • గతంలో రిపోర్టు ఇచ్చినవారిపైనా విచారణ జరుపుతాం: మంత్రి ఆనం

  • Jun 22, 2026 12:27 IST

    ఢిల్లీ: కర్ణాటకలో హనుమాన్ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

    • హనుమాన్ జన్మభూమి పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం

    • తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం

    • ఈ వ్యవహారంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదన్న సుప్రీంకోర్టు

    • నిబంధనల ప్రకారమే ఈ పిటిషన్ సాధారణ విచారణకు వస్తుందని స్పష్టం చేసిన న్యాయస్థానం

  • Jun 22, 2026 12:20 IST

    ఒడిశా: గంజాం జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

    • మంత్రి బిభూతి భూషణ్ జేనా మేనల్లుడు బిశ్వజిత్ జేనా (24) అరెస్ట్

    • ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై కేసు నమోదు

    • మృతురాలి మామ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభం

    • గోలంథర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

  • Jun 22, 2026 12:17 IST

    పట్నా: బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి

    • భూ వివాదం నేపథ్యంలో విజేంద్రనాథ్ తివారిపై కర్రలతో దాడి

    • బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా బెల్సండ్ గ్రామంలో ఘటన

    • తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన విజేంద్రనాథ్ తివారి

    • మెరుగైన చికిత్స కోసం పట్నాకు రిఫర్ చేసిన వైద్యులు

    • దాడి ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jun 22, 2026 12:07 IST

    హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ వాయిదా

    • అల్లు అర్జున్ మినహా కోర్టు ముందు హాజరైన మిగిలిన నిందితులు

    • వ్యక్తిగత కారణాలతో అల్లు అర్జున్ కోర్టుకు హాజరుకాలేకపోయారని తెలిపిన న్యాయవాదులు

    • అల్లు అర్జున్ ఆబ్సెంట్ పిటిషన్‌కు నాంపల్లి కోర్టు అనుమతి

    • మెమో దాఖలు చేయాలని అల్లు అర్జున్ న్యాయవాదులకు ఆదేశం

    • తదుపరి విచారణ జులై 6కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

  • Jun 22, 2026 11:58 IST

    ఫిలిప్పీన్స్‌: శాన్ హోసే నేషనల్ హైస్కూల్‌లో కాల్పుల కలకలం

    • తుపాకులతో విద్యార్థులపై రెచ్చిపోయిన ఇద్దరు దుండగులు

    • దాడిలో ముగ్గురు విద్యార్థుల మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు

    • నిందుతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి కాగా మరొకరు బయటి వ్యక్తి

  • Jun 22, 2026 11:39 IST

    హైదరాబాద్‌లో మిస్సింగ్.. ఏలూరులో ప్రత్యక్షం..

    • తల్లి తిట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

    • సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఫలక్‌నుమా పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తల్లి

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    • ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏపీలోని ఏలూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

  • Jun 22, 2026 11:29 IST

    స్విట్జర్లాండ్: అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన చర్చలు

    • చర్చలు సానుకూలంగా జరిగాయని పాకిస్థాన్, ఖతార్ వెల్లడి

    • అణు కార్యక్రమం, ఆంక్షలు, వివాదాల పరిష్కారానికి ఇరుదేశాల ప్రతినిధులతో ప్రత్యేక వర్కింగ్ గ్రూప్

    • లెబనాన్‌లో సైనిక దాడులకు ముగింపు పలికేందుకు ప్రత్యేక సెల్

    • ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అమెరికా, ఇరాన్ అంగీకారం

    • హోర్ముజ్ ద్వారా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి సమాచార వ్యవస్థ

  • Jun 22, 2026 11:28 IST

    హైదరాబాద్: కేటీఆర్, హరీశ్‌రావుకు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కౌంటర్

    • సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు: చామల

    • రెండేళ్ల రేవంత్ పాలన గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం: చామల

    • BRS పదేళ్ల పాలన సూపర్ హిట్ అనుకుంటున్నారా?: చామల

  • Jun 22, 2026 11:26 IST

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన సినీ దర్శకుడు మెహర్‌ రమేశ్‌

    • కుమార్తె పెళ్లికి ఆహ్వానించిన మెహర్‌ రమేశ్‌

  • Jun 22, 2026 11:15 IST

    శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం

    • ఘటనలో ఇద్దరు యువకుల మృతి

    • గ్రామదేవత సంబరాల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం

    • మృతులు కర్ని తులసీరావు (28), గర్తం మణి (23)

    • మృతదేహాలను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వజ్రపుకొత్తూరు పోలీసులు

  • Jun 22, 2026 11:12 IST

    బెల్జియంతో డ్రా తర్వాత అభిమానులకు భావోద్వేగ సందేశం వదిలిన ఇరాన్ జట్టు

    • లాకర్ రూమ్‌లో నోట్ ఉంచిన ఇరాన్ ఆటగాళ్లు

    • ‘గౌరవంగా పోటీ పడ్డాం.. ఆత్మగౌరవంతో వెళ్తున్నాం’ అంటూ సందేశం

    • లాస్ ఏంజెల్స్ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్

    • అన్ని దేశాల మధ్య శాంతి, గౌరవం, స్నేహం వర్ధిల్లాలని ఆకాంక్ష

  • Jun 22, 2026 11:07 IST

    ఏలూరు జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం

    • గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి

    • పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పులి కదలికల గుర్తింపు

    • ఆరు రోజులుగా జాడ లేకపోవడంతో డ్రోన్లతో గాలింపు చేపట్టిన అధికారులు

    • ట్రాకింగ్ కాలర్ సిగ్నల్ ద్వారా ఏలూరు జిల్లాలో ఉన్నట్లు నిర్ధారణ

    • పెద్దపులి కోసం రెండు జిల్లాల్లో ప్రత్యేక బృందాల గాలింపు

    • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అటవీశాఖ సూచన

  • Jun 22, 2026 11:05 IST

    కాకినాడ: గూడ్స్ రైలు నుంచి యూరియా బస్తాల చోరీకి యత్నం

    • సిగ్నల్ కోసం ఆగిన రైలు నుంచి 60 బస్తాలు కిందికి దింపిన దుండగులు

    • రైల్వే సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు

    • పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోయిన దొంగలు

  • Jun 22, 2026 11:02 IST

    విశాఖ: ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసిన టెకీ రాధాగాయత్రి తల్లి సత్యవతి

    • రాధాగాయత్రి కుటుంబ సభ్యులను ఓదార్చిన పల్లా శ్రీనివాసరావు

    • తమకు న్యాయం చేయాలని కోరిన రాధాగాయత్రి తల్లి సత్యవతి

    • హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు

    • ఇప్పటికే ముస్సోరిలో హత్య కేసు నమోదు చేశారు: పల్లా

    • రాధాగాయత్రి కుటుంబానికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాసరావు

  • Jun 22, 2026 10:58 IST

    తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం

    • కర్ణాటక వైఖరికి నిరసనగా DMK, AIADMK ఆందోళన

    • మేకెదాటు డ్యామ్‌పై చర్చించాలని డిమాండ్

    • మేకెదాటు డ్యామ్‌పై మాట్లాడేందుకు స్పీకర్ నిరాకరణ

    • స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నినాదాలు

    • తమిళనాడు అసెంబ్లీ నుంచి AIADMK సభ్యుల వాకౌట్

    • అసెంబ్లీ ఆవరణలో AIADMK సభ్యుల నిరసన

  • Jun 22, 2026 10:39 IST

    ప్రకాశం: సంతమాగులూరు మండలం వెల్లలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం

    • ఆటో-లారీ ఢీకొని ఇద్దరి మృతి

    • మరో ఆరుగురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 22, 2026 10:37 IST

    విశాఖ: టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

    • తల్లితో భర్త ప్రవర్తన చెప్పి వాపోయిన రాధాగాయత్రి

    • నా మనసు పూర్తిగా విరిగిపోయింది: ఫోన్‌లో రాధాగాయత్రి

    • నాపై అనుమానం, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు: రాధాగాయత్రి

    • నేను తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో చెప్పా: రాధాగాయత్రి

    • ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోలేదు: రాధాగాయత్రి

    • ఏదైనా ఉంటే మా అమ్మవాళ్లతో మాట్లాడమని చెప్పా: రాధాగాయత్రి

    • నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు: రాధాగాయత్రి

  • Jun 22, 2026 10:35 IST

    2శాతం పెరిగిన ముడిచమురు ధరలు

    • 82.30 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌ ధర

    • 78 డాలర్లకు చేరిన వెస్ట్‌టెక్సాస్‌ ఇంటర్మీడియట్ ధర

  • Jun 22, 2026 10:35 IST

    భారత కీలక రక్షణ వ్యవస్థల నిర్వహణకు అమెరికా సహాయం

    • 428.2 మిలియన్ డాలర్ల విలువైన రెండు రక్షణ సహాయ ప్యాకేజీలకు ఆమోదం

    • అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, ఎం-777 ఏ2 అల్ట్రా-లైట్ హోవిట్జర్ తుపాకుల నిర్వహణకు కేటాయింపు

    • అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేసిన విదేశాంగ శాఖ

  • Jun 22, 2026 10:34 IST

    అదంతా ముగిసిపోయింది: కోహ్లీ

    • టెస్టు క్రికెట్ రీఎంట్రీపై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు

    • టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లోనే కొనసాగుతోన్న కోహ్లీ

  • Jun 22, 2026 10:33 IST

    జయశంకర్ భూపాలపల్లి: గణపురం మండలం చెల్పూరులో దారుణ ఘటన

    • డీటీవో వెంకన్నను ఢీకొట్టిన లారీ

    • ఆర్టీవో కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీ చేస్తుండగా ఘటన

    • ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందిన డీటీవో వెంకన్న

  • Jun 22, 2026 09:57 IST

    స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం!

    • వాన్స్‌ను పట్టించుకోని ఖతార్ ప్రధాని

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

  • Jun 22, 2026 09:52 IST

    లాభాల్లో దేశీయ సూచీలు..

    • 409 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

    • 118 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.25

  • Jun 22, 2026 09:51 IST

    ఫిఫా ప్రపంచ కప్: న్యూజిలాండ్‌పై ఈజిప్ట్ విజయం

    • 3-1 తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన ఈజిప్ట్

    • 92 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో ఈజిప్ట్ విజయం

  • Jun 22, 2026 09:48 IST

    విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు

    • కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి సిట్ అధికారులు

    • కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న సిట్

    • ఇప్పటికే విచారణ నివేదికలను సిట్‌కు అందించిన ఏసీపీ దైవప్రసాద్

  • Jun 22, 2026 09:39 IST

    విజయవాడ: సీఐ నాగరాజుకు పెరుగుతున్న ప్రజల మద్దతు

    • కృష్ణలంకలో మహిళలు, యువకులు రోడ్ల పైకి వచ్చి ర్యాలీలు

    • సీఐ నాగరాజు వల్లే కృష్ణలంకలో ధైర్యంగా ఉన్నామంటూ నినాదాలు

    • నిన్న సీఐ నాగరాజుకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ చేసిన మహిళలు

    • నేడు రాణిగారితోట ప్రాంతంలో ర్యాలీ చేయనున్న మహిళలు

  • Jun 22, 2026 09:30 IST

    నెల్లూరు: ఏఎస్ పేట దర్గా వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

    • దర్గా నిర్వహణపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసిన ముస్లిం మత పెద్దలు

    • పోక్సో కేసులో ఉన్న వ్యక్తికి దర్గా బాధ్యతలు అప్పగించడం సముచితం కాదన్న పవన్

    • దర్గా పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన

    • ఈ విషయంపై వక్ఫ్ బోర్డుకు లేఖ రాసిన పవన్ కల్యాణ్

  • Jun 22, 2026 09:29 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉ.11గంటలకు RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • మ.2:45కు స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై MoU కార్యక్రమం

    • సా.4.30కు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

    • బసవతారకం ఆస్పత్రి రజతోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు

  • Jun 22, 2026 09:00 IST

    ఖతార్: రాస్ లఫాన్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ పేలుడు

    • బర్జాన్ గ్యాస్ సరఫరా కేంద్రంలో పేలుడు, అగ్నిప్రమాదం

    • 54మంది కార్మికులకు గాయాలు, 18మంది ఆచూకీ గల్లంతు

  • Jun 22, 2026 08:21 IST

    ప్రకాశం: సంతనూతలపాడు మండలం మంగమూరులో దారుణం

    • పిల్లి అశోక్(30) దారుణహత్య

    • హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

  • Jun 22, 2026 08:20 IST

    చిత్తూరు: బంగారెడ్డిపల్లిలో తీవ్ర విషాదం

    • ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

    • భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న దామోదర్

    • భార్య నిర్మలకు అనారోగ్య సమస్యతో మనస్తాపం

    • తమ మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్

    • మృతులు దామోదర్, నిర్మల, దిలీప్, శ్రీవిద్య

  • Jun 22, 2026 08:20 IST

    అమెరికా హెచ్చరికలకు భయపడబోం: ఇరాన్

    • లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే చర్చలు ముందుకు సాగవు: ఇరాన్

    • USకు ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు: ఇరాన్

  • Jun 22, 2026 08:19 IST

    నల్లగొండ: వేములపల్లి మం. బుగ్గబావిగూడెంలో దారుణం

    • అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన మినీ కంటైనర్

    • ఘటనలో ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న వెంకన్న మృతి

  • Jun 22, 2026 07:35 IST

    నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

    • బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి రజతోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Jun 22, 2026 07:34 IST

    నేడు తమిళనాడు సీఎం విజయ్‌ 52వ పుట్టినరోజు

    • తమిళనాడు వ్యాప్తంగా విజయ్‌ జన్మదిన వేడుకలు

  • Jun 22, 2026 07:33 IST

    రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌లో భారీ పేలుడు..

    • గుర్తుతెలియని పదార్థం పేలి డెకరేషన్ గోదాం కార్మికుడి మృతి

    • పేలుడు ధాటికి కార్మికుడి శరీర భాగాలు చెల్లాచెదురు

    • 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికుడి శరీర భాగాలు

    • మూడు రోజుల క్రితమే కోల్‌కతా నుంచి వచ్చిన కార్మికుడు

  • Jun 22, 2026 07:32 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

    • హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,070గా ఉంది.

    • 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,33,890గా ఉంది.

    • హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.

  • Jun 22, 2026 07:30 IST

    మధ్యలోనే ఆగిపోయిన అమెరికా-ఇరాన్‌ చర్చలు

    • ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి హెచ్చరిక

    • చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం: ట్రంప్‌

    • ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయి: ట్రంప్‌

    • హోర్ముజ్‌ను మూసివేస్తే ఇరాన్‌ను లేకుండా చేస్తాం: ట్రంప్‌

  • Jun 22, 2026 07:28 IST

    ఢిల్లీలో బిజీ బిజీగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

    • నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీలు

    • ఎస్‌బీఐ అంశంపై కేంద్రంతో చర్చించే అవకాశం

    • IRFC రుణంపై కూడా చర్చించనున్న రేవంత్‌

    • రాష్ట్ర ఆర్థిక అంశాలపై కేంద్రం దృష్టికి నివేదిక

  • Jun 22, 2026 07:19 IST

    హైదరాబాద్‌: నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌

    • సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో A11 అల్లు అర్జున్‌

    • నిందితులు అందరూ హాజరుకావాలని కోర్టు సమన్లు

    • ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి నిరాకరణ

    • వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్‌