Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 22 , 2026 | 07:17 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 22, 2026 21:09 IST

    కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనూ పేపర్లు లీక్‌ అయ్యాయి: నడ్డా

    • హిమాచల్‌ ప్రదేశ్, జార్ఖండ్‌లో పేపర్లు లీక్‌ అయ్యాయి: నడ్డా

    • బెంగాల్‌, కర్ణాటకలోనూ ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి: నడ్డా

    • తెలంగాణలోనూ ఇంటర్‌ పేపర్‌ లీక్‌ అయ్యింది: జేపీ నడ్డా

    • కేరళ, తమిళనాడులోనూ పేపర్లు లీక్‌ అయ్యాయి: జేపీ నడ్డా

    • పంజాబ్‌లోనూ గ్రూప్‌-D పేపర్‌ లీక్‌ అయ్యింది: జేపీ నడ్డా

    • లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాలి: నడ్డా

    • మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది: జేపీ నడ్డా

  • Jul 22, 2026 21:08 IST

    హైదరాబాద్‌: ట్రాన్స్‌కో DE వెంకటరమణ అరెస్ట్

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్

    • DE ముత్యం వెంకటరమణకు చెందిన 9 ప్రాంతాల్లో 8 బృందాలతో ACB తనిఖీలు

    • కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న ACB

    • సోదాల్లో రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌

  • Jul 22, 2026 20:58 IST

    ఢిల్లీ: NCRలో పాత వాహనాల మార్పిడికి కేంద్రం అవకాశం

    • పరివర్తన్‌ పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

    • BS-4, అంతకంటే పాత బస్సులు, ట్రక్కులకే వర్తింపు

    • కొత్త వాహనాల కొనుగోలుపై పదేళ్లపాటు మోటార్ వాహన పన్ను పూర్తి మాఫీ

    • కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం రద్దు

  • Jul 22, 2026 20:46 IST

    హైదరాబాద్‌: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

    • 11.7 కిలోల గంజాయి స్వాధీనం

  • Jul 22, 2026 20:42 IST

    అల్లూరి: అరకులోయ సమీపంలో లిక్విడ్ గంజాయి పట్టివేత

    • అరకులోయ మం. చొంపి జంక్షన్‌ దగ్గర రూ.కోటి విలువైన లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్న NCB

  • Jul 22, 2026 20:32 IST

    అమరావతి: భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్‌

    • రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 'మీభూమి-బ్లాక్‌చెయిన్' పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

    • 7 జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్

    • 'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్'గా బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్

  • Jul 22, 2026 19:32 IST

    అమరావతి భూసేకరణపై ప్రజాహిత వ్యాజ్యం ఎందుకు వేశారని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

    • అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారని నిలదీత

    • ఇందులో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్న

    • రైతుల తరఫున పిల్ దాఖలు చేశామన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం

  • Jul 22, 2026 19:19 IST

    మార్కాపురం: గిద్దలూరు వద్ద బొలెరో వాహనం, కారు ఢీ

    • ఇద్దరి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

    • గాయపడ్డవారిని చికిత్స కోసం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • Jul 22, 2026 19:04 IST

    ప్రకాశం: దర్శిలో బంగారు ఆభరణాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు

    • బస్సులో మహిళ హ్యాండ్‌బ్యాగ్ నుంచి 128 గ్రాములు బంగారు నగల చోరీ చేసిన కుమారి అనే మహిళను అరెస్ట్

  • Jul 22, 2026 18:54 IST

    శ్రీకాకుళం: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

    • కుమారుడు ఆరవ్‌ను రోడ్డుప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు యత్నించిన కేసులో అరెస్ట్

    • సాక్ష్యాలు తారుమారు చేశారని అప్పలరాజుపై ఆరోపణలు

    • అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ చేసిన రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి

    • ఇప్పటికే అరెస్టై రిమాండ్‌లో ఉన్న అప్పలరాజు కుమారుడు ఆరవ్‌

  • Jul 22, 2026 18:09 IST

    శ్రీకాకుళం: కాశీబుగ్గలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నివాసం వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు

    • సీదిరి అప్పలరాజును ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం

    • కుమారుడు ఆరవ్‌ను రోడ్డుప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు యత్నించిన సీదిరి అప్పలరాజు

    • సీసీటీవీ ఫుటేజీలో బయటపడిన అప్పలరాజు బండారం

  • Jul 22, 2026 17:43 IST

    ఢిల్లీ: గోదావరి-కావేరి అనుసంధానంపై చంద్రబాబు, CR పాటిల్ కీలక చర్చ

    • భాగస్వామ్య రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటుచేస్తాం: CR పాటిల్‌

    • శ్రీశైలం నుంచి కావేరి అనుసంధానం కన్నా బనకచర్ల నుంచి కావేరి అనుసంధానం మంచిదన్న కేంద్ర జల్‌శక్తి శాఖ

  • Jul 22, 2026 17:22 IST

    మీడియాకు ముంబై నటి కాదంబరి జెత్వాని లేఖ

    • నేను అమాయకురాలిని: కాదంబరి జెత్వాని

    • AP CID ఛార్జ్‌షీట్‌ తప్పులతడకగా ఉంది: జెత్వాని

    • నా ఖాతాలో జమ అయిన రూ.4.5 లక్షలను రూ.1.32 కోట్లుగా ప్రచారం చేశారు: జెత్వాని

    • ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారు: జెత్వాని

  • Jul 22, 2026 16:52 IST

    ఢిల్లీ: కేంద్రానికి సోనమ్‌ వాంగ్‌చుక్‌ లేఖ

    • విద్యార్థులపై కేసులు పెట్టొద్దు: వాంగ్‌చుక్‌

    • కేసులు పెట్టబోమని హామీ ఇవ్వాలి: వాంగ్‌చుక్‌

    • కేంద్రం హామీ ఇస్తే దీక్ష విరమిస్తా: వాంగ్‌చుక్‌

  • Jul 22, 2026 16:41 IST

    నంద్యాల: శ్రీశైలం డంపింగ్ యార్డ్ దగ్గర చిరుత కలకలం

    • చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలను చిత్రీకరించిన భక్తులు

  • Jul 22, 2026 16:34 IST

    విజయవాడ: దుర్గమ్మ ఆలయ 16 రోజుల హుండీ లెక్కింపు

    • రూ.3,46,08,014 నగదు, బంగారం 280 గ్రాములు, 4.3 కిలోల వెండి ఆదాయం

  • Jul 22, 2026 16:22 IST

    ఢిల్లీ: ప్రెస్‌మీట్‌లో చేతికి నల్ల బ్యాడ్జి ధరించిన రాహుల్‌

    • విద్యార్థులపై దాడి దృశ్యాలను ప్రదర్శించిన రాహుల్‌

    • పోలీసులు దమనకాండకు పాల్పడ్డారు: రాహుల్‌

    • శాంతియుతంగా ఆందోళన చేసినవారిపై దాడి చేశారు: రాహుల్

    • విద్యార్థులను పోలీసులు దారణంగా కొట్టారు: రాహుల్‌

  • Jul 22, 2026 16:18 IST

    ఢిల్లీ: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై లోక్‌సభ సస్పెన్షన్ వేటు

    • మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్

    • వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్న స్పీకర్ ఓంబిర్లా

    పూర్తి కథనం

  • Jul 22, 2026 16:02 IST

    అమరావతి: భూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక కార్యాచరణ

    • గ్రామకంఠం, పట్టా, అసైన్డ్‌ భూముల రికార్డుల ప్రక్షాళన

    • 22A జాబితాలో చేరిన భూములపై ప్రత్యేక సమీక్ష

    • రికార్డుల ప్రక్షాళనపై కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు

    • 90 రోజుల్లో ప్రక్షాళన పూర్తి చేయాలని లక్ష్యం

    • 45 రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

  • Jul 22, 2026 15:49 IST

    హైదరాబాద్‌ AIG ఆస్పత్రిలో నటుడు బాలకృష్ణ

    • బాలకృష్ణ హెల్త్ బులెటిన్‌ విడుదల

    • బాలకృష్ణ కాలి కండరంలో రక్తం గడ్డకట్టినట్టు వైద్యుల వెల్లడి

    • బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం

    • ఆర్థోపెడిక్‌ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాలకృష్ణ

  • Jul 22, 2026 15:39 IST

    భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 715 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 191 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Jul 22, 2026 15:31 IST

    గుంటూరు: తాడికొండలో CRDA ఆధ్వర్యంలో గ్రామసభ

    • రైల్వే, రోడ్లు కనెక్టివిటీకి 4,348 ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదన

    • మెజారిటీ రైతులు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకారం: మంత్రి నారాయణ

    • రైతుల సందేహాలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది: నారాయణ

    • అమరావతి అభివృద్ధిలో రైతుల సహకారం కీలకం: నారాయణ

    పూర్తి కథనం

  • Jul 22, 2026 15:26 IST

    హైదరాబాద్: హాస్పిటల్ నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి డిశ్చార్జ్

    • మహిళా ఐపీఎస్ కేసులో ఉదయ్ ఆత్మహత్యాయత్నం

    • రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్

  • Jul 22, 2026 15:16 IST

    హైదరాబాద్: మణికొండలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యపై టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా

    • బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్

    • ఆందోళన చేస్తున్న విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • నిరసనకారుల్ని గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

  • Jul 22, 2026 15:05 IST

    బిహార్‌: పట్నా కాంగ్రెస్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

    • కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    • కాంగ్రెస్‌ కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నం

    • పరస్పరం రాళ్ల దాడి, పలువురికి గాయాలు

  • Jul 22, 2026 14:59 IST

    కరీంనగర్‌: కాంగ్రెస్‌ ర్యాలీలో ఉద్రిక్తత

    • బండి సంజయ్‌ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్‌ యత్నం

    • అడ్డుకున్న పోలీసులతో కాంగ్రెస్‌ శ్రేణుల వాగ్వాదం

    • కాంగ్రెస్‌ శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jul 22, 2026 14:52 IST

    జమ్మూకశ్మీర్‌: అనంత్‌నాగ్‌ లాల్‌చౌక్‌లో ఉగ్రదాడి

    • బైక్‌పై వచ్చి కానిస్టేబుల్‌పై ఉగ్రవాదుల కాల్పులు

    • ఉగ్రవాదుల కాల్పుల్లో కానిస్టేబుల్‌ హుస్సేన్ మృతి

  • Jul 22, 2026 14:48 IST

    ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: భారత బ్యాటర్ల ఆధిపత్యం

    • అగ్రస్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్

    • టాప్ ప్లేస్‌కు ఒకే ఒక్క పాయింట్ దూరంలో భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్

    • మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

    • టాప్-5లో ముగ్గురు భారత ప్లేయర్లే ఉండటం విశేషం

  • Jul 22, 2026 14:35 IST

    ఢిల్లీ: జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

    • పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ అంశాలపై చర్చ

    • పోలవరం సందర్శనకు రావాలని పాటిల్‌ని కోరిన చంద్రబాబు

    • ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో పోలవరం ముంపు ప్రాంతాల అంశాలను త్వరగా పరిష్కరించాలని సీఎం విజ్ఞప్తి

    • నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపైనా చర్చ

  • Jul 22, 2026 14:31 IST

    ఢిల్లీ: సా.4 గంటలకు రాహుల్‌ గాంధీ ప్రెస్‌మీట్‌

    • తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్న రాహుల్‌

  • Jul 22, 2026 14:17 IST

    ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు షాక్

    • మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్‌ను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చిన సిడ్నీ కోర్టు

    • వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనున్న కోర్టు

  • Jul 22, 2026 14:15 IST

    తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త

    • వడ్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

    • రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు ఆమోదం

  • Jul 22, 2026 14:13 IST

    ఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా

    • విపక్షాల ఆందోళనతో సభ రేపటికి వాయిదా

    • రాజ్యసభ మ.3 గంటలకు వాయిదా

  • Jul 22, 2026 14:13 IST

    ఢిల్లీ: పార్లమెంట్‌ను విపక్షాలు అవమానిస్తున్నాయి: కేంద్రమంత్రి జేపీ నడ్డా

    • సభలో చర్చ జరగడం విపక్షాలకు ఇష్టం లేదు: నడ్డా

  • Jul 22, 2026 14:12 IST

    ఢిల్లీ: పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

    • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి: ఖర్గే

    • రాజీనామా తర్వాతే సభలో చర్చిస్తాం: ఖర్గే

  • Jul 22, 2026 13:56 IST

    హైదరాబాద్: గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

    • జార్ఖండ్, ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా

    • గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు

    • 14 కిలోల గంజాయి స్వాధీనం, నిందితుడు నకుల్ యాదవ్(27) అరెస్ట్

    • బరంపూర్ నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు గుర్తించిన పోలీసులు

    • లింగంపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో డెలివరీకి సిద్ధంగా ఉండగా పట్టివేత

  • Jul 22, 2026 13:36 IST

    ముంబై: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    • 750 పాయింట్లకుపైగా నష్టంలో సెన్సెక్స్

    • 200 పాయింట్లకుపైగా నష్టంలో నిఫ్టీ

  • Jul 22, 2026 13:34 IST

    అమరావతి: అన్ని బొద్దింకల కంటే పెద్ద బొద్దింక రాహుల్ గాంధీ: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

    • ప్రకాశ్ రాజ్ లాంటి వారు ఢిల్లీ నిరసనల్లో కనిపించారు: మాధవ్

    • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అంశాలు పార్లమెంట్‌లో మాట్లాడటానికి సిద్ధంగా లేరు: మాధవ్

    • పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే రద్దు చేసి పరీక్ష నిర్వహించాం: మాధవ్

    • నిష్పాక్షికంగా నీట్ లీక్‌పై విచారణ చేస్తాం: మాధవ్

    • నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌లో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేశారు: మాధవ్

    • పార్లమెంట్‌పై దాడి చేస్తామనడం దేశంపై దాడి చేయడమే: మాధవ్

  • Jul 22, 2026 12:59 IST

    హైదరాబాద్‌: బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

    • టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో చలో గాంధీభవన్‌

    • గాంధీభవన్‌ ముట్టడికి బయల్దేరిన బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం

    • రాంచందర్‌రావు సహా బీజేపీ నేతల అరెస్ట్

  • Jul 22, 2026 12:58 IST

    విజయవాడలో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ నిరసనలు

    • కాంగ్రెస్‌ కార్యాలయ ముట్టడికి బీజేపీ యత్నం

    • బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు

    • జెండా కర్రలతో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల పరస్పర దాడి

    • నిరసనలు, ఆందోళనలతో విజయవాడలో ఉద్రిక్తత

  • Jul 22, 2026 12:57 IST

    హైదరాబాద్: లోక్‌భవన్‌కు భారీగా చేరుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు

    • బారికేడ్లు తోసుకుని లోక్‌భవన్‌లోకి వెళ్లేందుకు యత్నం

    • కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

    • లోక్‌భవన్‌ పరిసరాల్లో భారీగా పోలీస్‌ బందోబస్తు

    • నిన్న రాహుల్‌ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళన

    • లోక్‌భవన్‌ ఎదుట కాంగ్రెస్‌ నేతల అరెస్ట్

    • నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

  • Jul 22, 2026 12:55 IST

    ఢిల్లీ: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

    • ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

  • Jul 22, 2026 12:54 IST

    ఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీక్‌పై చర్చకు కేంద్రం సిద్ధం

    • లోక్‌సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

    • విద్యార్థులే మా తొలి ప్రాధాన్యం: రిజిజు

    • పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సంసిద్ధం

  • Jul 22, 2026 12:22 IST

    ఢిల్లీ: ప్రధాని మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే భేటీ

    • పార్లమెంట్ వెలుపల విపక్షాల నిరసనల వేళ ప్రధాని కార్యాలయంలో భేటీ

    • రైతుల సమస్యలు, సాగునీటి అంశాలపై ప్రధానికి వినతిపత్రం

    • భేటీలో మోదీ, శరద్ పవార్ ఆత్మీయ సంభాషణ

    • భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

  • Jul 22, 2026 12:20 IST

    హైదరాబాద్: స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ డ్రైవర్ల (గిగ్ వర్కర్ల ) సమ్మె ఎఫెక్ట్

    • ఎల్బీనగర్‌లో వాహనాలను ఆపేస్తున్న ఆటో డ్రైవర్స్, స్విగ్గీ, జొమాటో వర్కర్స్

    • ఎల్బీనగర్ రింగ్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా మొహరించిన పోలీసులు

    • తమ డిమాండ్స్‌కు ఒప్పుకోకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక

  • Jul 22, 2026 12:16 IST

    ఢిల్లీ: శివసేన (UBT) రెబల్‌ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

    • ఏక్‌నాథ్‌ షిండే గ్రూప్‌లో విలీనం కావడంపై నోటీసులు

  • Jul 22, 2026 12:16 IST

    న్యూఢిల్లీ: మాజీ అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్ న్యూస్

    • CAPF, అసోం రైఫిల్స్‌లో రిజర్వేషన్

    • BSF, CISF, CRPF, SSBలో 10 శాతం రిజర్వేషన్

    • CRPF ఎక్స్-అగ్నివీర్ బెటాలియన్‌లో 50 శాతం రిజర్వేషన్

    • అసోం రైఫిల్స్ రైఫిల్‌మెన్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్

    • మాజీ అగ్నివీరులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు

    • తొలి బ్యాచ్ అగ్నివీరులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు

  • Jul 22, 2026 12:12 IST

    పార్లమెంట్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం

    • పార్లమెంట్‌ ఉభయసభలు మ.2 గంటలకు వాయిదా

  • Jul 22, 2026 12:03 IST

    పదవి నుంచి తప్పుకున్న అఫ్గానిస్థాన్ కెప్టెన్

    • వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేసిన హష్మతుల్లా షాహిది

    • వ్యక్తిగత కారణాలతో పదవికి షాహిది రాజీనామా

  • Jul 22, 2026 11:50 IST

    కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం

    • గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్ స్వాధీనం

    • బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు

    • ప్రయాణికుడిని గన్నవరం పోలీసులకు అప్పగింత

  • Jul 22, 2026 11:49 IST

    ఢిల్లీ: పార్లమెంట్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఎంపీల నిరసన

    • నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌ వద్ద కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

    • కాంగ్రెస్‌కు మద్దతుగా ఇతర విపక్ష ఎంపీల నిరసన

    • అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలకు డిమాండ్

    • NEET అంశంపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాల పట్టు

    • విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై చర్చించాలని డిమాండ్

  • Jul 22, 2026 11:45 IST

    విజయవాడ: ధర్నా చౌక్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన

    • కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన

    • ధర్నా చౌక్‌లో పెద్దఎత్తున పాల్గొన్న కాంగ్రెస్‌ శ్రేణులు

    • ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఆందోళన

  • Jul 22, 2026 11:44 IST

    హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో బంగారం చోరీ కేసు ఛేదించిన పోలీసులు

    • ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

    • బంగారు ఆభరణాల స్వాధీనం

  • Jul 22, 2026 11:43 IST

    కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నిరసన ర్యాలీ

    • తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీగా బయల్దేరిన సీఎం

    • ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసన ర్యాలీ

  • Jul 22, 2026 11:42 IST

    హైదరాబాద్‌: కాంగ్రెస్ నేతల ఛలో లోక్ భవన్

    • నెక్లెస్ రోడ్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ బయల్దేరిన కాంగ్రెస్ నేతలు

    • పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

    • హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు

    • కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్

  • Jul 22, 2026 11:41 IST

    ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళనపై పోలీసుల ఆగ్రహం

    • RAF సిబ్బందిపై ఆందోళనకారుల రాళ్ల దాడి

    • దాడి ఘటనపై పలు చోట్ల కేసులు నమోదు చేసిన పోలీసులు

  • Jul 22, 2026 11:40 IST

    ఢిల్లీలో భారీ భద్రత..

    • జన్‌పథ్‌, రాజీవ్‌చౌక్‌, పటేల్‌ చౌక్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌, రాజీవ్‌ చౌక్‌, మెట్రో స్టేషన్ల గేట్లు మూసివేత

    • భద్రతా కారణాలతో మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం

    • పార్లమెంట్‌కు వెళ్లే మార్గంలో నాలుగంచెల భద్రత

    • విపక్షాలు, విద్యార్థుల ఆందోళనతో భద్రత కట్టుదిట్టం

    • పార్లమెంట్‌ భవనం వెలుపల భద్రత మరింత పటిష్టం

  • Jul 22, 2026 11:39 IST

    రంగారెడ్డి: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం

    • నార్సింగి పుప్పాలగూడ టోల్‌గేట్ వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం

    • అతివేగంగా దూసుకొచ్చి బైక్‌ని ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్

    • బైక్‌పై వెళ్తున్న సుశీల్ కుమార్(28) స్పాట్ డెడ్

    • మరో వ్యక్తి సురేష్‌కు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

    • ప్రమాదం తర్వాత అదుపు తప్పి మరో కారు, స్కూటీని ఢీకొట్టిన ట్యాంకర్

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 22, 2026 11:30 IST

    నేపాల్‌లో భూకంపం

    • సుదూర్‌పశ్చిమ్‌ ప్రావిన్స్‌లో భూ ప్రకంపనలు

    • రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.2గా నమోదు

  • Jul 22, 2026 11:29 IST

    అమరావతి: ఏపీలో ‘తల్లికి వందనం’ నిధుల విడుదల

    • విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ

    • ‘తల్లికి వందనం’ కోసం రూ.10,120 కోట్లు

  • Jul 22, 2026 11:26 IST

    హైదరాబాద్: నాంపల్లి బీజేపీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు

    • గాంధీభవన్‌ ముట్టడికి బీజేపీ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు

    • బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్న రాంచందర్‌రావు

    • ఢిల్లీలో నిన్న ప్రధాని మోదీ నివాసం ఎదుట రాహుల్‌ ఆందోళనకు నిరసనగా బీజేపీ పిలుపు

  • Jul 22, 2026 11:15 IST

    లోక్‌సభ మ.12 గంటల వరకు వాయిదా

    • ప్రారంభమైన వెంటనే లోక్‌సభ వాయిదా

    • మూడోరోజూ విపక్షాల ఆందోళనతో సభ వాయిదా

    • విద్యార్థులపై దాడి, నీట్‌, అయోధ్య అంశాలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

  • Jul 22, 2026 10:38 IST

    భారత్‌-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్‌

    • హరారే వేదికగా జులై 23, 25, 26 తేదీల్లో మ్యాచ్‌లు

    • రేపు భారత్‌-జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్‌

  • Jul 22, 2026 10:35 IST

    హౌతీ రెబల్స్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరిక

    • ఎర్రసముద్రంలో దిగ్బంధం విధిస్తే చూస్తూ ఊరుకోబోమన్న ట్రంప్‌

    • అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని ట్రంప్‌ హెచ్చరిక

    • హౌతీ రెబల్స్‌కు సరైన రీతిలో బుద్ధి చెబుతామన్న ట్రంప్‌

  • Jul 22, 2026 10:33 IST

    కొడంగల్‌లో SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    • ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేసి BLO కి అందజేసిన సీఎం

    CM-Revanth-Reddy.jpg

  • Jul 22, 2026 10:33 IST

    ఫిఫా వరల్డ్ కప్‌ 2026 ఫైనల్ మ్యాచ్ రికార్డ్

    • ఈ మ్యాచ్‌ను యూఎస్‌లో 60 మిలియన్ల మంది వీక్షించినట్లు వెల్లడి

  • Jul 22, 2026 10:31 IST

    అమరావతి: ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు

    • గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు

    • ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం చంద్రబాబు

    • భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు

    • పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం

  • Jul 22, 2026 10:28 IST

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    • రూ.2,290 పెరిగి రూ.1,46,510కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.2,100 పెరిగి రూ.1,34,300కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ. 5వేలు పెరిగి రూ.2,45,000కి చేరిన కిలో వెండి ధర

  • Jul 22, 2026 10:18 IST

    సౌదీ చమురు ట్యాంకర్లకు హౌతీల హెచ్చరిక

    • సౌదీ పోర్టుల్లో సరుకు లోడ్, అన్‌లోడ్ చేయొద్దని హౌతీల హెచ్చరిక

    • హెచ్చరికను పట్టించుకోకపోతే దాడి చేస్తామని వార్నింగ్

    • భారత్, చైనాలకు చమురు తీసుకెళ్తున్న 3 ట్యాంకర్ల యూటర్న్

    • యెమెన్ తీరంలో ప్రమాద భయంతో ఎర్ర సముద్రంలోనే వెనక్కి మళ్లిన నౌకలు

    • హోర్ముజ్ జలసంధి తర్వాత మరో షిప్పింగ్ మార్గానికి ముప్పు

    • హౌతీల చర్యతో ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన

  • Jul 22, 2026 10:12 IST

    ముంబై: తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించిన అమితాబ్ బచ్చన్

    • తాను ఆస్పత్రిలో చేరలేదని, ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని స్పష్టం చేసిన అమితాబ్

    • తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న అమితాబ్

  • Jul 22, 2026 10:09 IST

    హైదరాబాద్: గాంధీ భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ

    • ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ ముట్టడి

    • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో నిరసన

    • ఢిల్లీలో రాహుల్ గాంధీ వ్యవహారశైలికి నిరసనగా ఆందోళన

    • రాంచందర్ రావుతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు

  • Jul 22, 2026 10:05 IST

    హైదరాబాద్: శంషాబాద్ వద్ద ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

    • రాత్రి డ్యూటీ కోసం ఎయిర్ పోర్ట్‌కి క్యాబ్‌లో బయలుదేరిన ఇండిగో ఉద్యోగిని

    • నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసిన డ్రైవర్

    • ఇండిగో ఉద్యోగిని ప్రతిఘటించడంతో పరారైన క్యాబ్ డ్రైవర్

    • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

    • నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

  • Jul 22, 2026 10:03 IST

    కర్నూలు: ఆదోనిలో మురికి కాలువలో పడి రమేష్ గౌడ్ (26) మృతి

    • మద్యం మత్తులో ఇంటికి వెళ్తుండగా ప్రమాదం

    • ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 22, 2026 10:01 IST

    భారీ నష్టాల్లో దేశీయ సూచీలు

    • 587 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్

    • 168 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.32

  • Jul 22, 2026 10:00 IST

    సోషల్ మీడియా వినియోగంపై ఫ్రాన్స్ కీలక నిర్ణయం

    • 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకంపై నిషేధం విధింపు

  • Jul 22, 2026 09:59 IST

    సౌదీ అరేబియాతో అణు ఒప్పందానికి ట్రంప్ ఆమోదం!

    • ఎలాంటి భద్రతా నిబంధనలు లేకుండానే ఒప్పందానికి ఆమోదం

  • Jul 22, 2026 09:56 IST

    హైదరాబాద్: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

    • ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు

    • 8 బృందాలు 14 ప్రాంతాల్లో ఏకకాలంలో కొనసాగుతున్న తనిఖీలు

    • సోదాల్లో కీలక స్థిర, చర ఆస్తి పత్రాలు, నగదు స్వాధీనం

  • Jul 22, 2026 09:46 IST

    ఢిల్లీ: జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న సీజేపీ ఆందోళన

    • నెల రోజులకుపైగా కొనసాగుతున్న సీజేపీ ఆందోళన

    • మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సామాజికవేత్త సోనమ్ వాంగ్ చుక్

    • తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్న సీజేపీ

  • Jul 22, 2026 09:39 IST

    అమరావతి: పిల్లలే మన సంపద.. వారి చదువులే తరగని ఆస్తి: మంత్రి లోకేశ్

    • ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం: మంత్రి లోకేశ్

    • వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం నిధులు విడుదల: మంత్రి లోకేశ్

    • 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లులకు లబ్ధి: మంత్రి లోకేశ్

    • 42.70 లక్షల బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ: మంత్రి లోకేశ్

    • నిధుల జమ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగుతుంది: మంత్రి లోకేశ్

    • పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం: మంత్రి లోకేశ్

  • Jul 22, 2026 09:29 IST

    ఢిల్లీ: లోక్ సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్

    • నీట్ యూజీ పేపర్ లీక్, జంతర్ మంతర్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై లాఠీఛార్జ్‌పై చర్చించాలని డిమాండ్

  • Jul 22, 2026 09:16 IST

    చిత్తూరు: వైసీపీ నేత మోహన్ నాయక్‌పై దాడి

    • ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దాడికి పాల్పడిన దుండగులు

    • గట్టురు తండాకు చెందిన కొందరు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించిన మోహన్ నాయక్

    • ఈ ఘటనలో మోహన్ నాయక్‌కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు

  • Jul 22, 2026 07:48 IST

    అమరావతి: నేడు ‘తల్లికి వందనం’ నిధుల విడుదల

    • అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ

    • ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికీ పథకం వర్తింపు

    • నేటి నుంచి ఈనెల 24 వరకు తల్లుల ఖాతాల్లో నిధుల జమ

    • ‘తల్లికి వందనం’ ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

  • Jul 22, 2026 07:38 IST

    విశాఖపట్నం: అక్కయ్యపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం

    • రోడ్డు పక్కన సరుకును అన్‌లోడ్ చేస్తున్న కళాసిలను ఢీ కొట్టిన లారీ

    • ఒకరు అక్కడకక్కడే మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

  • Jul 22, 2026 07:37 IST

    హైదరాబాద్: చలో లోక్‌భవన్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్

    • టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు

    • ఉదయం 11 గంటలకు లోక్ భవన్ వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు

    • నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు

    • హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు

    • రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన ఏఐసీసీ

    • నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

  • Jul 22, 2026 07:35 IST

    కరీంనగర్: నగరంలోని భగత్ నగర్‌లో వృద్ధ దంపతులను బెదిరించి భారీ దోపిడి

    • ఇంట్లోకి చొరబడి నకిలీ తుపాకీతో బెదిరించిన దుండగులు

    • భారీగా దొంగతనం జరిగినట్టు సమాచారం

    • వృద్ధులపై దాడి చేసి 50 తులాల బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తికెళ్లినట్టు సమాచారం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 22, 2026 07:34 IST

    పెద్దపల్లి: ఎన్టీపీసీ క్రషర్ నగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం

    • ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం వ్యాన్

    • డీసీఎం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి

    • నుజ్జు అయిన డీసీఎం

    • ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

  • Jul 22, 2026 07:17 IST

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    • రూ.1,44,230కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,32,210కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,40,100