Share News

మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు.. లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్..

ABN , Publish Date - Jul 22 , 2026 | 03:38 PM

లోక్‌సభ సమావేశాల సందర్బంగా మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టీఎంసీ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు.

మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు.. లోక్‌సభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్..
Kalyan Banerjee

ఇంటర్‌నెట్ డెస్క్: లోక్‌సభ సమావేశాల సందర్బంగా మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టీఎంసీ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ప్రతిపక్షాల నిరసనల నడుమ సభ వాయిదా పడిన తర్వాత టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి.. మాజీ టీఎంసీ సభ్యులు కకోలి ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, మితాలి బాగ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.


ఈ సందర్భంగా కల్యాణ్ బెనర్జీ తమను ఉద్దేశించి అసభ్యకరమైన భాష వాడారని, దూషించారని ఆరోపిస్తూ సదరు మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ తెన్నేటి ఈ ఫిర్యాదును ప్రస్తావించారు. బెనర్జీ వ్యాఖ్యలు సభ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలంటూ ప్రవేశ పెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా... కల్యాణ్ బెనర్జీని సభ నుంచి సస్పెండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: రోహిత్ శర్మ జోరు.. అగ్రస్థానానికి అడుగు దూరంలో గిల్

లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్ కాల్.. వీడియో వైరల్

Updated Date - Jul 22 , 2026 | 04:10 PM