Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 17 , 2026 | 06:03 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 17, 2026 21:58 IST

    ఢిల్లీలో టీడీపీ ఆఫీస్‌కు స్థలం కేటాయింపునకు రంగం సిద్ధం

    • న్యూఢిల్లీ 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్'లో స్థలం గుర్తింపు

    • ఆఫీస్ కోసం 2వేల చ.అ. స్థలాన్ని కోరిన టీడీపీ నాయకత్వం

    • బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌ దగ్గర టీడీపీ ఆఫీస్‌కు స్థలం గుర్తింపు

  • May 17, 2026 21:45 IST

    కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ

    • ఏపీ రొయ్యల ఎగుమతులపై కేంద్రం పన్నుల భారం పడుతోంది: సీఎం

    • ఏపీ నుంచి రూ.25వేల కోట్ల అక్వా ఉత్పత్తులపై ప్రభావం: సీఎం

    • వర్కింగ్ క్యాపిటల్‌ పరిమితులు పెంపు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం, GST నుంచి మినహాయింపు ఇవ్వాలి: సీఎం

    • ఏపీలో రీజినల్ ఫిషరీస్ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు లేఖ

  • May 17, 2026 21:30 IST

    సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు

    • సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్

    • దేశ అత్యున్నత న్యాయస్థానంలో పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య

    • పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం

  • May 17, 2026 21:15 IST

    కరీంనగర్‌ సింహగర్జన సభ@25: కేటీఆర్‌ పోస్ట్‌

    • ధన బలం లేదు.. రాజకీయ బలగం లేదు: కేటీఆర్‌

    • అయినా సింహగర్జన సభకి పోటెత్తిన జనం: కేటీఆర్‌

    • తెలంగాణ గోస పడుతుందన్న ఆవేదన, మాతృభూమిపై ప్రేమ, రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదల, ప్రజల భరోసా.. ఇవే కేసీఆర్‌ను నడిపించిన రథచక్రాలు: కేటీఆర్

  • May 17, 2026 21:12 IST

    కర్నూలు: ఆదోనిలో గ్రూప్-2 ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

    • రూ.50 లక్షలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులు

    • నిందితులపై పెద్దతుంబలం పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు

  • May 17, 2026 21:10 IST

    తమిళనాడు: మదురై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

    • ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతి

    • అదుపు తప్పి డివైడర్‌ని బలంగా ఢీకొన్న కారు

  • May 17, 2026 20:01 IST

    నల్లగొండ: దామరచర్లలో తల్లి మృతదేహంతో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై కూతుళ్ల ఆందోళన

    • ​అనారోగ్యంతో లక్ష్మి అనే మహిళ మృతి.. పట్టించుకోని భర్త శ్రీకాంత్

    • కన్నతండ్రి శ్రీకాంత్ తమను అనాథలను చేశాడంటూ కుమార్తెల కన్నీటి ఆవేదన

    • ఆందోళనతో రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు

  • May 17, 2026 19:58 IST

    స్వీడన్ పర్యటనలో ప్రధాని మోదీ

    • ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ దృష్టి

  • May 17, 2026 19:33 IST

    అమరావతి: ఢిల్లీ బయల్దేరిన మంత్రి నారా లోకేశ్

    • సోమవారం నాడు ఎగ్జిక్యూటివ్‌ డెలిగేషన్‌లో పాల్గొననున్న లోకేశ్

  • May 17, 2026 19:26 IST

    చెన్నై: సినీ నిర్మాత కె.రాజన్‌ ఆత్మహత్య

    • అడయార్‌లో బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య

    • ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల అనుమానం

  • May 17, 2026 18:45 IST

    రజనీకాంత్‌ వ్యాఖ్యలపై కమల్‌హాసన్ స్పందన

    • మా మధ్య ఎలాంటి అసూయ లేదు: కమల్‌హాసన్

    • మేమిద్దరం విమర్శించుకోకూడదని నిర్ణయించుకున్నాం: కమల్‌హాసన్

    • సినిమాల్లో ఆరోగ్యకరమైన పోటీతో రాణిస్తున్నాం: కమల్‌హాసన్

  • May 17, 2026 18:15 IST

    అమరావతి: జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పెన్షన్లు: మంత్రి అచ్చెన్న

    • త్వరలో ఆన్‌లైన్‌లో లబ్ధిదారులు నమోదుచేసుకునే అవకాశం

  • May 17, 2026 17:34 IST

    వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం

    • తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రెస్ మీట్లు వదిలేసి ట్విట్టర్ బాట పట్టారు: దేవినేని

    • వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితిని ICUలోకి నెట్టారు: దేవినేని

    • ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు ప్రచారం: దేవినేని ఉమ

  • May 17, 2026 17:32 IST

    ఈ నెల 25న పద్మ అవార్డుల ప్రదానోత్సవం

    • పద్మ అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ముర్ము

    • ఈ ఏడాది 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

  • May 17, 2026 17:31 IST

    అబుదాబిలోని న్యూక్లియర్ ప్లాంట్‌ దగ్గర డ్రోన్ దాడులు

    • డ్రోన్ దాడులతో న్యూక్లియర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలు

  • May 17, 2026 17:20 IST

    కాణిపాకం: కుటుంబ సమేతంగా వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

    • కాణిపాక గణపతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం: అనిత

    • మహిళల రక్షణ విషయంలో పోలీసు వ్యవస్థ కఠినంగా ఉంది: అనిత

    • తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: అనిత

    • కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోము: అనిత

    • రాష్ట్రాభివృద్ధే మా లక్ష్యం: అనిత

  • May 17, 2026 17:13 IST

    క‌ర్నూలు: టెన్త్‌లో టాపర్లకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు

    • కర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో టెన్త్‌లో టాప్ 5 మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించిన మంత్రి

    • పిక్కిలి లిఖిత‌-593, పింజ‌రి గిరీష‌-591, మీసాల మేఘ‌న‌-587, గాజుల రోహిత‌-582, కురువ మ‌ల్లికార్జున‌-581 మార్కులు.

    • విద్యార్థుల‌ను అభినందించి వారితో క‌లిసి భోజ‌నం చేసిన మంత్రి టీజీ భ‌ర‌త్

    • భ‌విష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాల‌ని సూచించిన మంత్రి

  • May 17, 2026 17:10 IST

    మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డబుల్ మర్డర్‌ కేసు

    • పురుగుల మందుతాగి నిందితురాలు కరీనాబేగం ఆత్మహత్యాయత్నం

  • May 17, 2026 16:09 IST

    రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందరిని ఆకర్షిస్తోంది: మంత్రి లోకేశ్

    • నూతన సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఎంతగానో ఆకర్షిస్తోంది: మంత్రి

    • నమ్మకం, ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు, భవిష్యత్తు గురించి సందేశం ఇస్తోంది: మంత్రి

  • May 17, 2026 16:07 IST

    కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి: కేటీఆర్‌

    • బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు: కేటీఆర్‌

    • బాలికకు న్యాయం జరగాలని నిలబడి పోరాడింది BRS పార్టీయే: కేటీఆర్‌

    • కాంగ్రెస్‌, బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని యత్నించాయి: కేటీఆర్

    • బీఆర్ఎస్ వల్లే బాధిత బాలికకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది: కేటీఆర్‌

    • నిందితుడిని ఇన్నాళ్లు దాచిపెట్టింది కేంద్రమంత్రి కాదా?: కేటీఆర్‌

    • కేంద్రమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి: కేటీఆర్‌

    • కేంద్రమంత్రి, సీఎం కలిసి పోక్సో కేసును నీరుగార్చే యత్నం: కేటీఆర్‌

  • May 17, 2026 15:22 IST

    అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురంలో చోరీ

    • ఓ వ్యక్తి ఇంట్లో 6 తులాల బంగారం చోరీ

  • May 17, 2026 14:55 IST

    గతంలోనూ, ఇప్పుడు నీట్‌ పేపర్‌ లీక్ అయింది: రాహుల్ గాంధీ

    • కేంద్ర మంత్రిని ఎందుకు తొలగించడం లేదు?: రాహుల్ గాంధీ

  • May 17, 2026 14:42 IST

    కర్ణాటక: బీదర్‌ జిల్లా బాల్కిలో గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉద్రిక్తత

    • గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు, పోలీసుల మధ్య వాగ్వాదం

    • పోలీసుల సమక్షంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ

  • May 17, 2026 14:31 IST

    యాదాద్రి: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం

    • ఎగసిపడుతున్న మంటలు, భారీగా వ్యాపించిన పొగ

    • ఇటీవలే నాలుగో యూనిట్‌లో విద్యుత్ ఉత్పాదన ప్రారంభం

  • May 17, 2026 13:31 IST

    ఆదిలాబాద్: రిమ్స్ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కలకలం

    • పీజీ వైద్య విద్యార్థిని వేధించిన నర్సింగ్ అధికారి

    • ఆపరేషన్ థియేటర్‌లో వేధింపులకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు

    • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • May 17, 2026 13:31 IST

    బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు

    • భగీరథ్ ఐఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్న పోలీసులు

    • ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక కోర్టుకు సమర్పించనున్న పోలీసులు

    • మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు

  • May 17, 2026 13:15 IST

    బండి భగీరథ్ ఎపిసోడ్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్

    • భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు: కిషన్‌రెడ్డి

    • భగీరథ్ కేసులో పోలీసులు ఎలాంటి విచారణ అయినా చేయొచ్చు..

    • విచారణ పూర్తిగా రాష్ట్ర పోలీసుల పరిధిలో ఉంటుంది..

    • సంజయ్ మంత్రి పదవిలో కొనసాగుతారా లేదా అనే దానిపై నేను కామెంట్ చేయలేను: కిషన్ రెడ్డి

  • May 17, 2026 13:05 IST

    అమరావతి: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సీఎం నిర్దేశించారు: మంత్రి గొట్టిపాటి

    • యూనిట్‌కు రూపాయి చొప్పున ఛార్జీలు తగ్గించాలని సీఎం చంద్రబాబు తెలిపారు: మంత్రి గొట్టిపాటి

    • దేశంలో ట్రూఅప్ పేరిట ఛార్జీలు పెరుగుతుంటే ఏపీలో ట్రూడౌన్ చేస్తున్నాం: మంత్రి గొట్టిపాటి రవి

  • May 17, 2026 13:03 IST

    విజయవాడ: యువకుడి అంతిమయాత్రలో మందుబాబుల హంగామా

    • డీజే సౌండ్‌లు, బాంబుల మోతతో హల్‌చల్

    • నిప్పురవ్వలు పడి ఓ వ్యక్తి కంటికి గాయాలు

    • ప్రశ్నించిన స్థానికులపై మందుబాబులు ఎదురుదాడి

    • పోలీసుల అదుపులో పలువురు మందుబాబులు

  • May 17, 2026 13:02 IST

    ఎబోలా వ్యాప్తి దృష్ట్యా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

    • ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

    • కాంగో, ఉగాండాలో వెలుగులోకి వచ్చిన 300 ఎబోలా కేసులు

    • ఎబోలాతో 88 మంది మరణించినట్టు WHO వెల్లడి

    పూర్తి కథనం..

  • May 17, 2026 13:01 IST

    నిర్మాణ దశలోనే రాజధాని అమరావతి అందరినీ ఆకర్షిస్తోంది: మంత్రి నారా లోకేష్‌

    • నూతన సృష్టికర్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఆకర్షిస్తోంది: లోకేష్‌

    • క్వాంటం ఆపరేషన్స్‌ కోసం గోపాల్ ముంబై నుంచి వచ్చారు..

    • పరిశోధకుడు నాగలక్ష్మయ్య.. రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలు నిర్మిస్తున్నారు: మంత్రి నారా లోకేష్‌

    పూర్తి కథనం..

  • May 17, 2026 13:00 IST

    రాత్రి 10గంటలకు కేరళంకు సీఎం రేవంత్‌రెడ్డి

    • రేపు కేరళం సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమం

    • పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

  • May 17, 2026 11:55 IST

    విశాఖ: ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మహిళల చేతివాటం

    • ప్రయాణికురాల నుంచి బంగారం కాజేసిన ఇద్దరు మహిళలు

    • 35 తులాల బంగారు అభరణాల అపహరణ

    • సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీ దృశ్యాలు

  • May 17, 2026 11:38 IST

    కృష్ణా: బంటుమిల్లిలో పెద్ద తుమ్మిడి వద్ద రోడ్డు ప్రమాదం

    • ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్న వ్యాన్

    • బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

  • May 17, 2026 11:32 IST

    తెలంగాణ EAPCET ఫలితాలు విడుదల

    • ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు

    • ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ర్యాంక్-ఎం.రుషి(ఉప్పల్)

    • రెండో ర్యాంక్-అన్షుల్(మూసాపేట్)

    • మూడో ర్యాంక్-ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)

  • May 17, 2026 10:57 IST

    నల్లగొండ : అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో దారుణం

    • కళ్లలో కారం చల్లి.. తల్లీకూతుళ్లను హత్య చేసిన దుండగులు

    • మృతులు రుద్రాక్ష సుమలత, లావణ్యగా గుర్తింపు

    • భూతగాదాల కారణంగా హత్య జరిగినట్లు పోలీసుల అనుమానం

  • May 17, 2026 10:54 IST

    చెన్నై: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

    • తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు: రజనీకాంత్

    • విజయ్ సీఎం కావడం సంతోషం.. నాకెవరిపై ద్వేషం లేదు

    • విజయ్‌ని సీఎం కాకుండా అడ్డుకోవాలని చూడలేదు: రజనీకాంత్

    పూర్తి కథనం..

  • May 17, 2026 10:17 IST

    కృష్ణా జిల్లా: ఉయ్యూరులో దారుణం

    • కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నం

    • నడి రోడ్డుపై భార్య తలపై రాయితో దాడి

    • భార్య పుష్పవతికి తీవ్రగాయాలు.. భర్త సాంబయ్యని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • మనస్పర్థలతో వేరుగా ఉంటున్న భార్యాభర్తలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • May 17, 2026 10:00 IST

    మొయినాబాద్ డబుల్ మర్డర్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

    • అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఇద్దరు మహిళల హత్య

    • డబ్బులు చెల్లిస్తామని ఫామ్‌హౌస్‌కు పిలిచి ఇద్దరు ప్రియులతో కలిసి హత్య చేసిన కరీమాబేగం

    • నిందితులు కరీమాబేగం, రెహమాన్, నయీమ్‌ అరెస్ట్

  • May 17, 2026 09:50 IST

    ప్రకాశం: దర్శి మండలం కొత్తరెడ్డిపాలెంలోని ఓ ఇంట్లో చోరీ

    • రూ.5లక్షల నగదు, నాలుగు సవర్ల బంగారం అపహరణ

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • May 17, 2026 09:49 IST

    CNG ధరలను మరోసారి పెంచిన కేంద్రం

    • కిలో CNG ధరపై రూపాయి పెంచిన కేంద్రం

    • రెండు రోజుల్లో CNG ధర రెండుసార్లు పెంపు

    • తాజా పెంపుతో ఢిల్లీ రూ.80.09కి చేరిన కిలో CNG

    • నోయిడా-ఘజియాబాద్‌లో కిలో CNG రూ.88.79

  • May 17, 2026 09:48 IST

    ప.గో.: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్

    • మున్సిపల్ వాటర్ వర్క్స్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ

    • ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆగ్రహం

    • రానున్న రోజులకు అవసరాలు తీర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఆదేశం

    • యుద్ధ ప్రాతిపదికన బోరు బావి తవ్వకాలు చేయిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

  • May 17, 2026 08:56 IST

    తూ.గో. జిల్లా: గోపాలపురం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం

    • ఎదురెదురుగా ఢీకొన్న లారీ, వ్యాన్..

    • వ్యాన్ డ్రైవర్ మృతి.. మరొకరికి గాయాలు..

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులు

  • May 17, 2026 08:46 IST

    విజయవాడలో డ్రగ్స్ పట్టివేత

    • 6 గ్రాముల MDMA స్వాధీనం, ఇద్దరు యువకుల అరెస్ట్

    • రాజస్థాన్ నుంచి తెచ్చి విజయవాడలో డ్రగ్స్ విక్రయం

  • May 17, 2026 08:46 IST

    నంద్యాల: ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం

    • లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

    • ప్రయాణికుడి మృతి, పలువురికి గాయాలు

    • అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు

    • లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం

    • ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు

  • May 17, 2026 08:45 IST

    రాజస్థాన్: కోటా రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదం

    • తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

    • షార్ట్ సర్క్యూట్‌తో రైలులో చెలరేగిన మంటలు

    • రెండు బోగీలకు వ్యాపించిన మంటలు

    • రైలు నుంచి రెండు బోగీలను వేరు చేసిన రైల్వే సిబ్బంది

    • మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది, ప్రయాణికులు సురక్షితం

  • May 17, 2026 08:18 IST

    హైదరాబాద్: మెహదీపట్నంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత

    • గోవులను తరలిస్తున్న లారీని ఆపిన ఓ వర్గం యువకులు

    • లారీని అప్పకుండా అడ్డుకున్న మరో వర్గం యువకులు

    • పరస్పరం రాళ్ల దాడి.. లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టిన పోలీసులు

  • May 17, 2026 08:16 IST

    ఆంబులెన్స్‌పై విరిగిపడిన భారీ వృక్షం.. ఇద్దరికి గాయాలు

    • వరంగల్: నర్సంపేట శివారు లక్నెపల్లిలో ఆంబులెన్స్‌పై విరిగిపడిన భారీ వృక్షం

    • రోగి సహా ఇద్దరికి స్వల్ప గాయాలు.. తప్పిన ప్రమాదం

    • రోగిని నర్సంపేట జనరల్ ఆస్పత్రి నుంచి వరంగల్ ఎంజీఎంకు ఆస్పత్రికి తరలిస్తుండగా ఘటన

  • May 17, 2026 08:14 IST

    అన్నమయ్య జిల్లా: పుంగనూరు పట్టణం మార్కెట్ యార్డ్ వద్ద తాగుబోతుల వీరంగం..

    • తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ల మధ్య తాగిన మత్తులో గొడవ

    • మాయ కన్నన్‌ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సురేశ్

    • క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

    • టమోటా లోడు కోసం తమిళనాడు నుంచి పుంగనూరు వచ్చిన డ్రైవర్లు

    • పోలీసుల అదుపులో నిందితుడు సురేష్

  • May 17, 2026 07:11 IST

    హైదరాబాద్‌: టప్పాచబుత్రాలో కారు బీభత్సం

    • మూడేళ్ల బాలుడిని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లిన కారు

    • బాలుడు లతీఫ్‌ పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు

  • May 17, 2026 06:33 IST

    IPLలో నేడు రెండు మ్యాచ్‌లు

    • నేడు ధర్మశాలలో మధ్యాహ్నం 3:30కు పంజాబ్‌ Vs బెంగళూరు మ్యాచ్‌

    • ఢిల్లీలో రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ Vs రాజస్థాన్‌ మ్యాచ్‌

  • May 17, 2026 06:17 IST

    హైదరాబాద్‌: నేడు హస్తినాపురంలో కేటీఆర్‌ పర్యటన

    • GSR కన్వెన్షన్‌లో ఎల్బీనగర్‌ నేతలతో భేటీకానున్న కేటీఆర్‌

  • May 17, 2026 06:17 IST

    అల్లూరి: నేడు పాడేరు మోదకొండ అమ్మవారి జాతర

    • నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు

  • May 17, 2026 06:03 IST

    నేడు JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

    • పరీక్ష రాయనున్న 1.90 లక్షల మంది అభ్యర్థులు

    • తెలుగు రాష్ట్రాల నుంచి 45 వేల మంది అభ్యర్థులు

    • జూన్‌ 1న ఫలితాల వెల్లడి

  • May 17, 2026 06:03 IST

    నేడు తెలంగాణ EAPCET ఫలితాలు

    • ఉదయం 11 గంటలకు EAPCET ఫలితాలు విడుదల