Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 20 , 2026 | 06:19 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 20, 2026 21:10 IST

    హైదరాబాద్: నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం

    • వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వారం రోజుల్లో 6 క్రిమినల్ కేసులు నమోదు

    • నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

  • Aug 20, 2026 21:09 IST

    రాజమండ్రి: ఇంజినీర్ నూకరాజు ఆత్మహత్య కేసు

    • కుమార్తె సౌజన్య మృతదేహం లభ్యం

    • కొత్తపేట మండలం కొమరాజులంక దగ్గర గోదావరిలో సౌజన్య మృతదేహం గుర్తింపు

    • నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గాలింపు

  • Aug 20, 2026 20:55 IST

    హనుమకొండ: రెండు రోజులుగా ఆగి ఉన్న కారులో డెడ్ బాడీ

    • భయభ్రాంతులకు గురైన స్థానికులు

    • ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘటన

    • విచారణ జరుపుతున్న పోలీసులు

  • Aug 20, 2026 20:00 IST

    బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: పీవీ సింధుకు షాక్

    • ప్రపంచ బ్మాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు వరుస షాక్‌లు

    • ప్రిక్వార్టర్ ఫైనల్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీపై సింధు ఓటమి

  • Aug 20, 2026 18:43 IST

    హైదరాబాద్‌: మరో వేలానికి సిద్ధమైన HMDA

    • బాచుపల్లి ప్లాట్ల వేలంపై HMDA ప్రీ-బిడ్డింగ్‌ భేటీ

    • బాచుపల్లిలో 35 రెసిడెన్షియల్‌ ప్లాట్ల వేలం

    • రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 31 వరకు గడువు

    • సెప్టెంబర్‌ 2న బాచుపల్లి, మోకిల ప్లాట్ల వేలం

  • Aug 20, 2026 18:40 IST

    లడఖ్‌లో వైరల్ అయిన యువతి.. భద్రతా సిబ్బందికి క్షమాపణలు

    • భారత సైన్యం, జమ్మూకశ్మీర్, లడఖ్ పోలీసులకు సారీ చెప్పిన యువతి

    • రోడ్డు మూసివేతపై ఆగ్రహంతో మాట్లాడానని వివరణ

    • గంటల తరబడి వేచి ఉండటంతో అసహనంలో వ్యాఖ్యలు చేశానన్న యువతి

    • VIP మూవ్‌మెంట్‌ ఉందన్న విషయం తమకు తెలియదన్న యువతి

    • సైన్యాన్ని అవమానించాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టీకరణ

  • Aug 20, 2026 18:37 IST

    హైదరాబాద్: చార్మినార్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలుడు

    • నిమ్మరసం విక్రయించే వ్యక్తికి చెందిన చిన్న గ్యాస్ సిలిండర్ పేలుడు

    • ఎలాంటి నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు

  • Aug 20, 2026 18:13 IST

    హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై కేసు

    • వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మంత్రి మాజీ OSD

    • మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదుతో జీరో FIR నమోదు

    • కేసును జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ

    • హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

  • Aug 20, 2026 18:13 IST

    హైదరాబాద్: 22A భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు

    • 22A సమస్యపై ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం: పొంగులేటి

    • ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలి: మంత్రి పొంగులేటి

    • కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు అధికారుల పర్యవేక్షణ

    • ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకోవాలి: పొంగులేటి

    • ఫిర్యాదులపై తహసీల్దార్, RDO, సబ్‌రిజిస్ట్రార్‌లు తక్షణం స్పందించాలి: పొంగులేటి

    • భూమి 22A జాబితాలోకి ఎందుకు వచ్చిందో క్షేత్రస్థాయిలో పరిశీలన: పొంగులేటి

  • Aug 20, 2026 17:36 IST

    హైదరాబాద్: స్కిల్‌ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ల విలీనం అనేది అపోహ మాత్రమే: మంత్రి వివేక్‌

    • పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నాం: మంత్రి వివేక్‌

    • ఈసెట్ ద్వారా బీటెక్ ప్రవేశాలు యథాతథం: మంత్రి వివేక్‌

    • బీటెక్‌లో లాటరల్‌ ఎంట్రన్స్ యథాతథం: మంత్రి వివేక్‌

  • Aug 20, 2026 17:32 IST

    హైదరాబాద్: సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం: మంత్రి కొండా సురేఖ

    • కుమార్తె అయినంత మాత్రాన తన వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం సముచితం కాదు: సురేఖ

    • సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం: సురేఖ

    • కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై గౌరవం ఉంది: సురేఖ

    • తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి విజ్ఞప్తి చేసిన కొండా సురేఖ

  • Aug 20, 2026 17:21 IST

    విశాఖ: లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై డీఈవో కార్యాలయం ఆరా

    • ఘటనపై టీచర్లు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన అధికారులు

  • Aug 20, 2026 17:19 IST

    అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు

    • టీటీడీకి సంగం డెయిరీ నెయ్యి సరఫరాపై సజ్జల ఆరోపణలు

    • పాల సేకరణ చేయకుండా నెయ్యి సరఫరా చేస్తున్నారని సజ్జల ఆరోపణలు

    • భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారని సంగం డెయిరీ పిటిషన్

    • పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్

  • Aug 20, 2026 17:18 IST

    జంతర్‌మంతర్‌ ఆందోళనలపై సుప్రీంకోర్టు కమిటీ

    • ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

    • జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

    • కమిటీలో ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జీలు

    • మరో ఇద్దరు దర్యాప్తు సంస్థల అధికారులు

    • ఆందోళనల్లో హింసపై దర్యాప్తు చేయనున్న కమిటీ

  • Aug 20, 2026 16:40 IST

    రాజమండ్రి: మెడికో ప్రియాంక మృతి కేసులో పోలీసుల దర్యాప్తు

    • కస్టడీలో నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు

    • కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

    • దస్వంత్‌, జోసెఫ్‌ నివాసాల దగ్గర సీన్ రీ-క్రియేషన్‌

    • ప్రసాద్ మాల్‌ దగ్గర ఘటనపై రీ-క్రియేషన్‌

    • ఆధారాలతో నివేదిక సిద్ధం చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 16:39 IST

    అమరావతి: రేపు ఏపీలో పలుచోట్ల వర్షాలు: ఐఎండీ

    • పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షాలు: ఐఎండీ

    • కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో మోస్తరు వర్షాలు: ఐఎండీ

    • మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు: ఐఎండీ

  • Aug 20, 2026 16:30 IST

    చిక్కుల్లో పడ్డ బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

    • జూనియర్ స్థాయి క్రికెట్ సెలక్షన్‌లో ఎంపియకయ్యేందుకు పుట్టిన తేదీ మార్చినట్లు ఆరోపణలు

    • దీనిపై జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రటరీ ఫిర్యాదు

    • విచారణకు ఆదేశించిన జమ్మూకశ్మీర్ స్థానిక కోర్టు

  • Aug 20, 2026 16:27 IST

    అమరావతి: జగన్‌కు మంత్రి నారా లోకేశ్ కౌంటర్

    • ఏపీ పరీక్షల వ్యవస్థపై జగన్‌కు కనీస అవగాహన లేదు: లోకేశ్

    • DSC, APPSC మధ్య తేడా తెలియని వ్యక్తి జగన్‌: లోకేశ్

  • Aug 20, 2026 16:27 IST

    అమరావతి: జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశం

    • రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై లోతుగా చర్చించాం: పవన్‌

    • స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం: పవన్‌

  • Aug 20, 2026 16:25 IST

    రేపు కేరళం కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • రేపటి నుంచి 20 రోజులపాటు కేరళంలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో ఉండనున్న పవన్‌

    • తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్‌ కల్యాణ్‌

    • ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌

    • 20 రోజుల పాటు వైద్య శిబిరంలో చికిత్స చేయించుకోనున్న పవన్‌

  • Aug 20, 2026 16:24 IST

    ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

    • మొత్తం 12 బిల్లులకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ

    • ఒక బిల్లు ఉపసంహరణ

    • మూడు అంశాలపై స్వల్పకాలిక చర్చ

    • 344 నిబంధన కింద రెండు అంశాలపై చర్చ

    • ఒక ప్రభుత్వ తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం

    • మొత్తం 103 మంది సభ్యుల ప్రసంగం

  • Aug 20, 2026 16:00 IST

    భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 628, నిఫ్టీ 153 పాయింట్ల లాభం

  • Aug 20, 2026 15:41 IST

    రవీంద్ర జడేజా ప్రభావం తగ్గింది: రవిచంద్రన్ అశ్విన్

    • జడేజాపై మాజీ క్రికెటర్ ఆర్.అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

    • బంతితో జడేజా చూపే ప్రభావం తగ్గిపోయింది: అశ్విన్

  • Aug 20, 2026 15:33 IST

    హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల చట్టబద్ధతపై హైకోర్టులో విచారణ

    • ఉచిత పథకాల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి: హైకోర్టు

    • పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు బెనిఫిట్స్‌ అందడం లేదు: హైకోర్టు

    • పెన్షన్లు, బెనిఫిట్స్ అందక చాలామంది కోర్టును ఆశ్రయిస్తున్నారు: హైకోర్టు

    • ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో వివరాలు లేవు: హైకోర్టు

    • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని AAGకి హైకోర్టు ఆదేశం

    • విచారణ ఈ నెల 24కి వాయిదావేసిన హైకోర్టు

  • Aug 20, 2026 15:24 IST

    విద్యార్థి మెడ పట్టుకున్న సీఐ.. విచారణకు ఎస్పీ ఆదేశం

    • జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్

    • మహబూబాబాద్‌లో బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు

    • విద్యార్థులను అడ్డుకునే యత్నంలో ఓ విద్యార్థి మెడ పట్టుకున్న సీఐ రఘుపతిరెడ్డి

    • సీఐ తీరుపై వెల్లువెత్తిన విమర్శలు

    • సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్పీ శబరీష్‌

  • Aug 20, 2026 15:19 IST

    విశాఖ: లిటిల్‌ గార్డెన్ స్కూల్లో దారుణం

    • విద్యార్థిని చితకబాదిన టీచర్‌

    • టీచర్ దెబ్బలకు విద్యార్థి ప్రణయ్‌ తేజ్‌ (6) మృతి

    • క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిన ప్రణయ్ తేజ్‌

    • విశాఖ వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదు

  • Aug 20, 2026 15:17 IST

    మానవ్ సుతార్‌కు మాజీ క్రికెటర్ పుజారా కీలక సూచన

    • ఐపీఎల్ కోసం సహజ శైలిని మార్చుకోవద్దు: పుజారా

    • టెస్టు క్రికెట్ కోసం భారత జట్టు సుతార్‌ను కాపాడుకోవాలి: పుజారా

    • శ్రీలంకపై తొలి టెస్టులో 10 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్

  • Aug 20, 2026 15:09 IST

    ఢిల్లీ: సోనియా ఆత్మకథపై రాహుల్‌ భావోద్వేగ పోస్ట్‌

    • 35 ఏళ్ల క్రితం తన తల్లిదండ్రులను కలిసి చూశానన్న రాహుల్

    • నాన్న మరణం తర్వాత అమ్మకు అన్నీ కష్టాలే: రాహుల్

    • ఇప్పుడు అమ్మను చూసి నాన్న గర్వపడతారు: రాహుల్

  • Aug 20, 2026 15:06 IST

    చెన్నై: హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

    • హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు

    • సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు

    • దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

    • కేంద్రం-రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు

  • Aug 20, 2026 15:04 IST

    నెల్లూరు: విడవలూరు మండలం ముదివర్తిలో రసాభాసగా మారిన భూ సమస్యల గ్రామసభ

    • వీఆర్వో, విలేజ్ సర్వేయర్‌ ముడుపులు తీసుకొని కూడా పనులు చేయడంలేదని తహసీల్దార్‌ని నిలదీసిన రైతులు

    • రీ-సర్వే తప్పిదాలతో ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆవేదన

    • వీఆర్వో, విలేజ్ సర్వేయర్, తహసీల్దార్‌పై టీడీపీ నేతల ఆగ్రహం

  • Aug 20, 2026 15:01 IST

    హైదరాబాద్: కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన సీపీ సజ్జనార్

    • బైక్‌పై వచ్చి క్షేత్రస్థాయిలో ట్రాఫిక్‌ను పరిశీలించిన సీపీ సజ్జనార్

    • రోడ్ నంబర్ 45, జూబ్లీ చెక్‌పోస్ట్, ఫిల్మ్‌నగర్ మీదుగా బైక్‌పై రెండుసార్లు పర్యటించిన సీపీ

    • కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ప్రస్తుతం సాఫీగా సాగుతోంది: సీపీ సజ్జనార్

  • Aug 20, 2026 14:49 IST

    ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో యువ షట్లర్ల జోరు

    • క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీ

    • రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో 21-16, 21-12 తేడాతో జపాన్‌పై విజయం

  • Aug 20, 2026 14:34 IST

    రంగారెడ్డి: లోకమాన్య తిలక్ ట్రైన్‌లో 11.16 కిలోల గంజాయి స్వాధీనం

    • ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు

    • అనుమానాస్పద బ్యాగులు చెక్ చేయగా 11.16 కిలోల గంజాయి గుర్తింపు

    • గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని అంచనా

    • పోలీసులను చూసి నిందితుడి పరారీ, గాలిస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 14:30 IST

    తిహార్ జైలులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్(80) మృతి

    • 1984 సిక్కు వ్యతిరేక ఆందోళన కేసులో నిందితుడిగా సజ్జన్

    • 2018లో సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు విధించిన ఢిల్లీ హైకోర్టు

  • Aug 20, 2026 13:59 IST

    ఇబ్రహీంపట్నం: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు

    • RDO ఆఫీస్‌లో పనిచేస్తున్న ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా దాడులు

    • హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు

    • గతంలో మహేశ్వరం ఎమ్మార్వోగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి

    • సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించే అవకాశం

  • Aug 20, 2026 13:45 IST

    విశాఖ: ఎన్ఏడీ కొత్త రోడ్డు సమీపంలోని శాంతినగర్‌లో వ్యక్తి హత్య

    • దుర్గాప్రసాద్ (78) అనే వృద్ధుడిని హత్య చేసిన భరత్ అనే వ్యక్తి

    • మృతుడు దుర్గాప్రసాద్ ఇంట్లో అద్దెకు ఉంటున్న భరత్

    • మూడు రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన భరత్

    • ఇంటి అద్దె చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య వివాదం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 13:30 IST

    చెన్నై: కావేరి జలాలు తమిళనాడుకు జీవనాడి: సీఎం విజయ్

    • కావేరి నీటిపై కోట్లాది ప్రజల జీవితాలు ఆధారపడి ఉన్నాయి: సీఎం విజయ్

    • అంతర్రాష్ట్ర నదుల నీటి పంపకాలు చట్టబద్ధంగా జరగాలి: విజయ్

    • పూర్తి సహకారంతో నీటి పంపకాలు నిర్వహించాలి: విజయ్

    • దిగువ రాష్ట్రాల న్యాయమైన నీటివాటా హక్కులు కాపాడాలి: సీఎం విజయ్

    • కావేరిపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి: సీఎం విజయ్

  • Aug 20, 2026 13:20 IST

    'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా

    • రెండు చరణాలను మాత్రమే పాడాలన్న CWC నిర్ణయం జాతి వ్యతిరేకం: అమిత్‌షా

    • 'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలి: అమిత్‌షా

    • కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలకు నిదర్శనం: అమిత్‌షా

    • కాంగ్రెస్ విధానాల వల్లే భారత్ రెండు ముక్కలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

  • Aug 20, 2026 13:15 IST

    నెల్లూరు: కావలిలోని మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డులో ప్రమాదం

    • ట్రాక్టర్‌ని ఢీకొన్న బైకు

    • బైకుపై ప్రయాణిస్తున్న చందు (17) మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 13:04 IST

    నంద్యాల జిల్లా: ఆత్మకూరులో విషాదం

    • భార్య అంత్యక్రియలు జరుగుతుండగానే భర్త మృతి

    • ​అనారోగ్యంతో మృతిచెందిన భార్య లక్ష్మీదేవి

    • భార్య మృతిని తట్టుకోలేక గుండెపోటుతో భర్త సుబ్బరాయుడు కన్నుమూత

    • ఒకే రోజు భార్యాభర్తలు మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

  • Aug 20, 2026 13:02 IST

    అమరావతి: శాసన మండలి నిరవదిక వాయిదా

    • పది బిల్లులకు శాసనమండలిలో ఆమోదం

    • బిల్లులకు ఆమోదం అనంతరం మండలి నిరవధిక వాయిదా

    • మండలిని నిరవధికంగా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేనురాజు ప్రకటన

  • Aug 20, 2026 13:01 IST

    తెలంగాణలో రైస్‌ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా

    • ప్రభుత్వానికి బాకీ పడ్డ 20 మంది రైస్‌ మిల్లర్లు

    • ఈడీకి రైస్‌ మిలర్ల జాబితా ఇచ్చిన సివిల్ సప్లయ్ శాఖ

    • హవాలా రూపంలో డబ్బులు సంపాదించారని మిల్లర్లపై ఆరోపణలు

    • మిల్లర్ల ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు

  • Aug 20, 2026 13:00 IST

    హైదరాబాద్: ACB పేరుతో ప్రభుత్వ అధికారికి టోకరా

    • R&B ఏఈ మల్లారెడ్డికి నరేందర్‌ నుంచి వాట్సాప్ కాల్

    • అవినీతి ఫిర్యాదు వచ్చిందంటూ నరేందర్ బెదిరింపులు

    • భయంతో విడతలవారీగా రూ.10లక్షలు బదిలీ చేసిన బాధితుడు

    • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, కేసు నమోదు

  • Aug 20, 2026 13:00 IST

    ఢిల్లీ: 22A నిషేధిత భూములపై ప్రజా ఆందోళన చేస్తాం: ABNతో లక్ష్మణ్‌

    • రెవెన్యూ మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి: లక్ష్మణ్‌

    • 22A భూముల నిషేధంపై పొంగులేటి సమాధానం చెప్పాలి: లక్ష్మణ్‌

    • భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై CBIతో విచారణ జరిపించాలి

    • ఖర్గే, రాహుల్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి: ABNతో లక్ష్మణ్‌

  • Aug 20, 2026 12:56 IST

    కేబీఆర్ పార్కు ప్రాంతంలో చెట్ల నరికివేత కేసుపై సుప్రీంలో విచారణ

    • పార్క్ ఈకో సెన్సిటివ్ జోన్‌లో 25-30 మీటర్ల చెట్లను నరకవద్దన్న గత ఆదేశాలను పొడిగించిన కోర్టు

    • ప్రభుత్వం నుంచి తదుపరి సూచనల కోసం కేసును వాయిదా వేయాలని కోరిన న్యాయవాది

    • తదుపరి విచారణ వచ్చే నెలకి (సెప్టెంబర్ 3) వాయిదా

  • Aug 20, 2026 12:30 IST

    హైదరాబాద్: మంత్రి పొంగులేటి భారీ అవినీతికి తెరలేపారు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

    • అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలూ నా దగ్గర ఉన్నాయి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

    • CBI విచారణ జరగాలి, హౌస్ కమిటీ వేయాలి: మహేశ్వర్‌రెడ్డి

    • పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకూ కదిలేది లేదు: మహేశ్వర్‌రెడ్డి

    • ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

  • Aug 20, 2026 12:25 IST

    భారత విద్యార్థులకు గూగుల్‌ ఏడాది ఉచిత ఏఐ ప్లస్‌

    • కాలేజీ విద్యార్థులకు 12 నెలల ఉచిత సేవలు

    • అర్హులైన విద్యార్థులకు గూగుల్‌ ప్రత్యేక ఆఫర్‌

    • ఏఐ ప్లస్‌ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్న గూగుల్‌

    • విద్యార్థులకు జెమినీ కొత్త స్టడీ టూల్స్‌

    • ఏఐ ప్రో ప్లాన్‌పైనా గూగుల్‌ డిస్కౌంట్‌ ఆఫర్

  • Aug 20, 2026 12:22 IST

    హైదరాబాద్: గన్‌పార్క్‌ దగ్గర బీజేపీ నేతల ఆందోళన

    • మీడియా పాయింట్‌ దగ్గరకు వెళ్లేందుకు యత్నం

    • అసెంబ్లీ గేట్ వద్ద బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

    • ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతల నినాదాలు

    • మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్

    • పొంగులేటి అక్రమాస్తులపై ఆధారాలతో వస్తానన్న ఏలేటి

    • చర్చకు రావాలని పొంగులేటికి నిన్న మహేశ్వర్‌రెడ్డి సవాల్‌

  • Aug 20, 2026 12:20 IST

    సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్

    • సరిహద్దుల్లో వేగంగా మౌలిక వసతుల కల్పన

    • అరుణాచల్‌లో సరిహద్దు ప్రాంతాల్లో కిరణ్ రిజిజు పర్యటన

    • గతంలో సరిహద్దులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి: రిజిజు

    • సరిహద్దుల్లో వేగంగా ఇన్‌ఫ్రా పనులు: కేంద్ర మంత్రి రిజిజు

  • Aug 20, 2026 12:15 IST

    కీవ్‌పై రష్యా క్షిపణి దాడి

    • 12 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా

    • ఆరుగురి మృతి, మరో 33 మందికి గాయాలు

  • Aug 20, 2026 12:10 IST

    బిహార్ ప్రభుత్వం కీలక ప్రకటన

    • ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రోగ్రామ్‌లపై వీడియోలు చేస్తే రూ.10వేలు అందిస్తామని వెల్లడి

  • Aug 20, 2026 12:05 IST

    డేటా సెంటర్ల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • అదానీ ఇన్‌ఫ్రా ప్రతిపాదనలకు ఆమోదం

    • విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి విక్రయ ఒప్పందాల్లో మార్పులకు SIPB ఆమోదం

    • డేటా సెంటర్ల భారీ పెట్టుబడుల దృష్ట్యా.. విదేశీ వాణిజ్య రుణాలు పొందేందుకు ప్రభుత్వం అనుమతి

  • Aug 20, 2026 12:00 IST

    విజయవాడ: దుర్గగుడికి రూ.21 లక్షల విలువైన బంగారు హారం విరాళం

    • అమ్మవారికి రూ.21 లక్షల విలువైన బంగారు హారం కానుక

    • 141 గ్రాముల బంగారు రాధాకృష్ణుల హారం సమర్పణ

    • సీతారాంపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ విరాళం

    • ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సమక్షంలో విరాళం అందజేత

  • Aug 20, 2026 11:55 IST

    అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్

    • స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు

    • అనకాపల్లిలో 4,950 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు ఫీజులు మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో

    • అచ్చుతాపురం దగ్గర క్లీన్ ఎనర్జీ, అణు పరిశోధన, రేడియేషన్ సాంకేతికతపై BARC పరిశోధనా కేంద్రం

  • Aug 20, 2026 11:50 IST

    అమరావతి: మిలాద్-ఉన్-నబి సెలవు రోజు మార్పు

    • ఈనెల 25కు బదులు 26న సెలవు ప్రకటన

    • చంద్ర దర్శనం ఆధారంగా మిలాద్-ఉన్-నబి పండుగ 26న రానుండటంతో ప్రభుత్వం నిర్ణయం

    • ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో విజ్ఞప్తితో సెలవు తేదీని సవరించిన ప్రభుత్వం

  • Aug 20, 2026 11:45 IST

    ఢిల్లీ: మోదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది: సీపీఐ సీనియర్ నేత నారాయణ

    • జంతర్ మంతర్‌లో విద్యార్థుల ఆందోళనే అందుకు నిదర్శనం: నారాయణ

    • వచ్చే నెల 1న వేలాది మందితో ఢిల్లీలో భారీ ర్యాలీలు నిర్వహిస్తాం: నారాయణ

    • విద్యార్థులు, విద్యారంగ సమస్యలపై ఉద్యమం ఉధృతం చేస్తాం: నారాయణ

    • ప్రజా సమస్యలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదు: సీపీఐ సీనియర్ నేత నారాయణ

  • Aug 20, 2026 11:39 IST

    హైదారాబాద్: కాసేపట్లో అసెంబ్లీ మీడియా పాయింట్‌కు BJLP నేత ఏలేటి

    • పొంగులేటి అక్రమాస్తులపై ఆధారాలతో వస్తానన్న ఏలేటి

    • చర్చకు రావాలని పొంగులేటికి నిన్న మహేశ్వర్‌రెడ్డి సవాల్‌

  • Aug 20, 2026 11:38 IST

    హైదరాబాద్ గాంధీభవన్: సుస్మిత ఇష్టానుసారం మాట్లాడటం కరెక్టేనా?: ఇందిరాశోభన్

    • సుస్మిత ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నారు?: ఇందిరాశోభన్

    • సీఎంపై మాట్లాడే హక్కు సుస్మితకు ఎక్కడిది?: ఇందిరాశోభన్

    • సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ తలదించుకునే పరిస్థితి: కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్

  • Aug 20, 2026 11:20 IST

    రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు

    • రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుందాం: సీఎం రేవంత్‌రెడ్డి

    • బలమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 20, 2026 11:18 IST

    కొమురం భీం జిల్లా: కౌటాల మండలం గుండాయిపేట్ సమీపంలో పులి సంచారం

    • పాద ముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు

    • సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

  • Aug 20, 2026 11:16 IST

    విశాఖ జూపార్క్ దగ్గర పోలీస్ ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా

    • ప్రమాద వివరాలు తెలుసుకున్న హోంమంత్రి

    • అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచన

    • చికిత్స పొందుతున్న పోలీస్ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

  • Aug 20, 2026 11:15 IST

    ఏపీలో కలెక్టరేట్ల నిర్మాణంపై మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సమాధానం

    • భీమవరం కలెక్టరేట్ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం: మంత్రి జనార్ధన్‌రెడ్డి

    • ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలకు R&B శాఖ డిజైన్లు సిద్ధం చేసింది

    • డిజైన్ల పరిశీలన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం: మంత్రి జనార్ధన్‌రెడ్డి

  • Aug 20, 2026 11:14 IST

    మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • మణిపూర్‌లో 3 రోజుల పాటు విద్యాసంస్థల మూసివేత

    • మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల దృష్ట్యా నిర్ణయం

  • Aug 20, 2026 10:50 IST

    తూ.గో.: దేవరపల్లి మండలం పల్లంట్లలో చీటీల పేరుతో మోసం

    • అధిక వడ్డీల పేరుతో మోసం

    • రూ.2కోట్లు కాజేసి పరారైన కుటుంబం

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

  • Aug 20, 2026 10:45 IST

    గోదావరి పుష్కరాల కోసం రూ.824 కోట్లు కేటాయించాం: మంత్రి నారాయణ

    • పురపాలకశాఖ ద్వారా రూ.150 కోట్ల కేటాయింపు: మంత్రి నారాయణ

    • నిధుల కేటాయించాలని కేంద్రానికి సీఎం లేఖ రాశారు: మంత్రి నారాయణ

    • సాస్కి, హోం వంటి పథకాల ద్వారా పురపాలికలకు రూ.1,140 కోట్లు వస్తున్నాయి: మంత్రి నారాయణ

  • Aug 20, 2026 10:43 IST

    క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న మంత్రి కొండా సురేఖ

    • సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్న కొండా సురేఖ

    • నిన్న రేవంత్‌పై కొండా సుస్మిత తీవ్ర ఆరోపణలు

    • సుస్మితకు కాంగ్రెస్ సభ్యతం లేకపోవడంతో కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ

    • గతంలోనూ రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుస్మిత

    • గతంలో కుమార్తె తరఫున రేవంత్‌కు క్షమాపణ చెప్పిన సురేఖ

  • Aug 20, 2026 10:43 IST

    విశాఖ: జూ వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం

    • సుమారు 10మంది కానిస్టేబుళ్లకు గాయాలు

    • క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలింపు

  • Aug 20, 2026 10:30 IST

    విశాఖ: గాజువాక చట్టివానిపాలెంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

    • గురువారం తెల్లవారుజామున చెట్టి అవినాశ్ (26) అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య

    • అవినాశ్‌ను కుటుంబ సభ్యులు సమీపంలోని క్లినిక్‌కు తరలింపు

    • పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ

    • మృతదేహాన్ని మార్చురీకి తరలించిన గాజువాక పోలీసులు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 10:30 IST

    తిరుపతి: తిరుచానూరు పీఎస్‌కు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి

    • హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన కరుణాకర్ రెడ్డి, అభినయ్‌రెడ్డి

    • తనపల్లిలో భూ ఆక్రమణ కేసులో పోలీసుల విచారణ

    • వైసీపీ పాలనలో కబ్జా చేసిన భూమిలో రోడ్ల నిర్మాణం చేశారని ఆరోపణ

    • బాధితుడు వెంకట ప్రసాద్ ఫిర్యాదుతో భూమనపై కేసు నమోదు

  • Aug 20, 2026 10:25 IST

    అమరావతి: శాసన మండలి కొద్ది సేపు వాయిదా

    • వైసీపీ సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేసిన చైర్మన్

    • వాయిదా అనంతరం సభలో నేలపై కూర్చుని వైసీపీ నిరసన

    • మెగా డీఎస్సీపై విచారణ చేపట్టాలని డిమాండ్

  • Aug 20, 2026 09:57 IST

    భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    • రూ.4,300 పెరిగి రూ.1,59,270కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.3,950 పెరిగి రూ.1,46,000కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలోపై రూ.10వేలు పెరిగి రూ.2,60,000కి చేరిన వెండి

    పూర్తి కథనం..

  • Aug 20, 2026 09:50 IST

    సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్

    • SCBA కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్ ఘన విజయం

    • గతంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్లు, గవర్నర్లకు న్యాయసలహాదారుగా సేవలు

    • వైసీపీ తెచ్చిన 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన రవిశంకర్

    • 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పలు కీలక కేసుల్లో వాదనలు

  • Aug 20, 2026 09:45 IST

    హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

    • పాక్ IAS నెట్‌వర్క్‌కు హైదరాబాద్‌తో లింకులు

    • మేడ్చల్‌, యూసఫ్‌గూడలో ఆధారాలు

    • గతంలో అరెస్టయిన ఇద్దరు యువకులకు నెట్‌వర్క్ లింకులు

    • ఉగ్రకుట్ర కేసులో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 253 మంది అరెస్ట్

  • Aug 20, 2026 09:30 IST

    అమరావతి: నాల్గవ రోజు ప్రారంభమైన ఏపీ శాసన మండలి సమావేశాలు

    • మెడలో నల్ల కండువాలతో సభకు వచ్చిన వైసీపీ సభ్యులు

    • మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ వాయిదా తీర్మానం

    • వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్

    • పోడియం వద్ద వైసీపీ సభ్యుల ఆందోళన

  • Aug 20, 2026 09:20 IST

    విశాఖ: మత్స్యకారుడు అప్పన్న కోసం కొనసాగుతున్న గాలింపు

    • ఈనెల 16న వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారులు, ఒకరి గల్లంతు

    • అధికారులకు సమాచారం అందించిన మత్స్యకారులు

    • అప్పన్న కోసం సముద్రంలో కొనసాగుతున్న గాలింపు

    • గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని హోంమంత్రి అనిత ఆదేశం

  • Aug 20, 2026 09:15 IST

    అమరావతి: 11వ రోజు జూనియర్ డాక్టర్ల నిరసన

    • ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన జూనియర్ డాక్టర్లు

    • సమ్మె యథావిథిగా కొనసాగుతుందని ప్రకటన

    • స్టైఫండ్ 3, 5శాతం పెంపు సరిపోదంటున్న జూడాలు

  • Aug 20, 2026 09:10 IST

    కామారెడ్డి: మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

    • మున్సిపల్ కమిషనర్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం

    • కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

    • నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు

  • Aug 20, 2026 09:00 IST

    ఉమ్మడి మహబూబ్ నగర్: జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం

    • జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన బాలానగర్ మండలానికి చెందిన ముగ్గురు యువకులు

    • బుధవారం రాత్రి డ్యామ్‌పై బైక్ స్కిడ్ కావడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు

    • మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం శివ, గణేష్ మృతి

    • మరో యువకుడి పరిస్థితి విషమం

    • యువకుల మృతితో విషాదంలో కుటుంబ సభ్యులు, స్థానికులు

  • Aug 20, 2026 08:50 IST

    కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    • సుస్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే నోటీసులిచ్చాం: మహేశ్ గౌడ్

    • సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖను వివరణ కోరాం: మహేశ్ గౌడ్

    • పార్టీ టికెట్ ఎవరికివ్వాలనేది CWC నిర్ణయం తీసుకుంటుంది: మహేశ్ గౌడ్

    • పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఉపేక్షించం: మహేశ్ గౌడ్

  • Aug 20, 2026 08:45 IST

    ఢిల్లి: రాజీవ్ గాంధీ జయంతి.. వీర్ భూమి దగ్గర రాజీవ్‌కు కాంగ్రెస్ నేతల నివాళులు

    • నివాళులర్పించిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక

    • కాంగ్రెస్ ఆధ్వర్యంలో సద్భావన దినోత్సవ కార్యక్రమాలు

  • Aug 20, 2026 08:30 IST

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం

    • కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. కారులోని నరేష్ అనే వ్యక్తి మృతి

    • ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 08:29 IST

    నంద్యాల: ఎగువ అహోబిలంలో అదృశ్యమైన ఏడుగురు సురక్షితం

    • నరసింహస్వామి దర్శనానికి వచ్చిన ప్రొద్దుటూరు భక్తులు

    • చీకట్లో భారీ వర్షానికి దారితప్పిన ఏడుగురు భక్తులు

    • భక్తులను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

  • Aug 20, 2026 08:20 IST

    హైదరాబాద్: పాతబస్తీ జూ పార్క్ వద్ద రోడ్డు ప్రమాదం

    • లారీని వెనుక నుంచి ఢీకొట్టిన టాటాఏస్ వాహనం

    • షాద్‌నగర్‌కు చెందిన డ్రైవర్ యాదగిరి అక్కడికక్కడే మృతి

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 08:15 IST

    మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణం శివాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రమాదం

    • బొలెరో ఢీకొని వ్యక్తి మృతి

    • మృతుడు సింగరేణి కార్మికుడు సురేష్‌గా గుర్తింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 08:00 IST

    కొమురం భీం: కాగజ్ నగర్ గాంధీ నగర్ వార్డు పరిసరాల్లో తనిఖీలు

    • సరైన పత్రాలు లేని 32 బైకులు, ఒక ఆటో సీజ్

  • Aug 20, 2026 07:55 IST

    రాహుల్‌గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ

    • తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందని లేఖ

    • రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోంది: హరీశ్ రావు

    • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి: హరీశ్ రావు

  • Aug 20, 2026 07:50 IST

    విశాఖ: ఈ నెల 22, 23న బ్రిక్స్‌ దేశాల కీలక సమావేశాలు

    • సమావేశాలకు హాజరుకానున్న 11 బ్రిక్స్‌ దేశాల మంత్రులు

    • సమావేశంలో భాగస్వామ్యం కానున్న సీఎం చంద్రబాబు

    • ఈ నెల 22న యువజన మంత్రుల సమావేశం

    • ఈ నెల 23న బీచ్‌రోడ్‌లో ఫ్రెండ్షిప్‌ సైకిల్‌ ర్యాలీ

  • Aug 20, 2026 07:40 IST

    నంద్యాల : శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరదనీరు

    • ఇన్ ఫ్లో : 66.385 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 40.023 క్యూసెక్కులు

    • పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 875.40 అడుగులు

    • పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం : 165.5340 టీఎంసీలు

  • Aug 20, 2026 07:30 IST

    పల్నాడు జిల్లా: మేడికొండూరు -సత్తెనపల్లి మధ్య అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై దాడి

    • బస్సుపై రాయి విసిరిన గుర్తు తెలియని దుండగుడు

    • 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన బస్సు డ్రైవర్

    • అనంతరం సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

    • పొన్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు

  • Aug 20, 2026 07:20 IST

    తమిళనాడుకు వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్ సంజయ్ జాజు

    • నేడు మహాబలిపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్

    • కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశం

    • తెలంగాణ నుంచి కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్న భట్టి, సీఎస్ సంజయ్ జాజు

  • Aug 20, 2026 07:15 IST

    తూ.గో.: డాక్టర్ ప్రియాంక మృతి కేసు.. నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు

    • రెండో రోజు ఇద్దరు నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు

    • ఘటన జరిగిన ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర సీన్ రీకన్‌స్ట్రక్షన్

  • Aug 20, 2026 07:00 IST

    కాకినాడ: తుని చిన్నారి జ్ఞానేశ్వరి ఆదృశ్యంపై హైకోర్టుకు నివేదిక

    • రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 70 రోజులు

    • దర్యాప్తు వివరాలు కోర్టుకు సమర్పించిన పోలీసులు

  • Aug 20, 2026 06:50 IST

    పల్నాడు: వినుకొండలో రోడ్డు ప్రమాదం

    • బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన బొలెరో.. దంపతుల మృతి

    • మృతులు వల్లూరి రవి(58), వల్లూరి సావిత్రి(55)గా గుర్తింపు

    • ప్రభుత్వ చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న సావిత్రి

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 20, 2026 06:48 IST

    తిరుపతి: శ్రీకాళహస్తి ఎన్టీఆర్ నగర్‌లో యువకుల బీభత్సం

    • మద్యం మత్తులో ఆటోపై యువకుల దాడి

    • వీధుల్లో రౌడీల్లా ప్రవర్తించిన మైనర్లు, కేసు నమోదు

  • Aug 20, 2026 06:47 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,54,960

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,42,040

    • కిలో వెండి ధర రూ.2,49,900

    పూర్తి కథనం..

  • Aug 20, 2026 06:36 IST

    నేడు రాజీవ్‌గాంధీ 82వ జయంతి

    • ఢిల్లీలోని వీర్‌భూమి దగ్గర నివాళులు అర్పించనున్న ప్రముఖులు

    • నివాళులు అర్పించనున్న సోనియా, రాహుల్‌, ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గే

  • Aug 20, 2026 06:35 IST

    క్యూర్‌లో ఈ నెల 27 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు లాటరీ

    • లాటరీలో పేర్లు వచ్చిన వారికి ఎల్‌ఐజీ ఫ్లాట్లు

    • నేడు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా విడుదల

    • అర్హుల జాబితాపై 23 వరకూ అభ్యంతరాలు

    • 25న అర్హుల తుదిజాబితా ప్రకటన

    • హౌసింగ్‌ బోర్డు, మీ సేవ వెబ్‌సైట్లలో జాబితా

  • Aug 20, 2026 06:35 IST

    హైదరాబాద్‌: సనత్‌నగర్‌ టిమ్స్‌లో నేటితో స్టెరిలైజేషన్‌ పూర్తి

    • రేపటి నుంచి టిమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు

    • టిమ్స్‌లో ఆపరేషన్లకు ఏర్పాట్లు పూర్తి

  • Aug 20, 2026 06:33 IST

    నేడు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌పై హైకోర్టు విచారణ

    • ఇవాళ మధ్యాహ్నం మరోసారి విచారించనున్న కోర్టు

    • పథకాలపై స్టే ఎత్తి వేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం

    • స్టే ఎత్తివేయడానికి నిరాకరించిన హైకోర్టు

  • Aug 20, 2026 06:33 IST

    నేడు మక్తల్‌లో మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు

  • Aug 20, 2026 06:32 IST

    నేడు సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పర్యటన

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి

  • Aug 20, 2026 06:32 IST

    నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

    • సత్తుపల్లి మండలంలో భూ రీసర్వే సదస్సులో పాల్గొననున్న మంత్రి

    • అనంతరం రైతులతో మంత్రి పొంగులేటి ముఖాముఖి

  • Aug 20, 2026 06:31 IST

    నేడు తెలంగాణలోని అఖిలపక్ష ఎంపీలతో రైల్వే అధికారుల సమావేశం

    • ఎంపీలతో భేటీకానున్న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు

    • తెలంగాణలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చ

  • Aug 20, 2026 06:29 IST

    నేటి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన

    • ఈ నెల 30 వరకు బ్రిటన్‌, అమెరికాలో పర్యటన

    • రేపు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సందర్శించనున్న సీఎం

    • 22న కేంబ్రిడ్జ్‌ టీమ్‌తో రేవంత్‌ రెడ్డి సమావేశం

    • 24న హార్వర్డ్‌, MIT క్యాంపస్‌ల సందర్శన

    • 25న వర్జీనియా యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం

    • 26న ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ USA మీట్‌ అండ్‌ గ్రీట్‌

    • 30న తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Aug 20, 2026 06:25 IST

    ఏపీలో కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె

    • జూడాల ఉపకార వేతనం 5% పెంచిన ప్రభుత్వం

    • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు జూడాల అసంతృప్తి

    • కొత్త ప్రకటనేమీ చేయలేదని జూడాల ఆగ్రహం

    • స్టైఫండ్‌ 15 శాతం పెంచాలని జూడాల డిమాండ్‌

  • Aug 20, 2026 06:15 IST

    కెన్యాలో సఫారీ హెలికాప్టర్‌ క్రాష్‌, ఏడుగురి మృతి

    • నంబూరు కౌంటీలోని ఓ వైల్డ్‌లైఫ్‌ సాంక్చురీలో ఏరియల్‌ వ్యూ సమయంలో కుప్పకూలిన హెలికాప్టర్‌

    • మృతుల్లో ఈక్వెడార్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మిచెల్‌ సెన్సీ, అతని భార్య స్టెఫానీ, ఐదుగురు అమెరికన్లు

    • వీరంతా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులుగా గుర్తింపు

    పూర్తి కథనం..

  • Aug 20, 2026 06:10 IST

    తిరుపతి: 22 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు

    • వాసు యాదవ్‌పై అక్రమ కేసు బనాయించారని తల్లి రేణుక ధర్నా

    • రేణుకకు మద్దతుగా వైసీపీ కార్యకర్తల నిరసన

    • అనుమతి లేదు, 30 యాక్ట్ ఉందంటూ అరెస్ట్‌ చేసిన పోలీసులు

    • కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు

  • Aug 20, 2026 06:08 IST

    సిద్దిపేట: దుబ్బాక మండలం అప్పనపల్లిలో కారు ప్రమాదం

    • రోడ్డు పక్కన బావిలోకి దూసుకెళ్లిన కారు, నలుగురి మృతి

    • కారులో ప్రయాణిస్తున్న దంపతులు సహా ఇద్దరు పిల్లల మృతి

    • దంపతులు రాజు, భాగ్య, కొడుకు నియాన్ష్‌, కూతురు శాన్విక మృతి

    • మృతులు బలవంతపూర్‌ వాసులుగా గుర్తింపు

  • Aug 20, 2026 06:05 IST

    నేడు చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

    • కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరగనున్న సీఎంల సమావేశం

  • Aug 20, 2026 06:04 IST

    నంద్యాల: ఎగువ అహోబిలంలో ఏడుగురి మిస్సింగ్

    • నరసింహస్వామి దర్శనానికి వచ్చిన ప్రొద్దుటూరు భక్తులు

    • చీకట్లో భారీ వర్షానికి దారితప్పిన భక్తులు

    • ఆందోళనలో కుటుంబ సభ్యులు, గాలిస్తున్న అటవీ అధికారులు

  • Aug 20, 2026 06:00 IST

    నేడు తమిళనాడులో అమిత్‌ షా పర్యటన

    • మహాబలిపురంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి భేటీ

    • శుక్ర, శనివారాల్లో బెంగాల్‌లో అమిత్‌ షా పర్యటన

    • సిలిగురిలో సరిహద్దు భద్రత ప్రాజెక్టుల ప్రారంభోత్సవం