-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National and International Breaking Live Updates of 20th April 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 20 , 2026 | 05:49 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 20, 2026 08:05 IST
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేటి రేట్స్
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,770
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,790
కిలో వెండి ధర రూ.2,79,900
-
Apr 20, 2026 07:58 IST
యూఎస్‌తో 2వ విడత చర్చలకు నో చెప్పిన ఇరాన్
ఇరాన్ ప్రభుత్వ మీడియాలో కథనాలు
అమెరికా తీరే ఇందుకు కారణమని ఆరోపణ
తమ నౌకను స్వాధీనం చేసుకున్నందుకు యూఎస్‌పై గుస్సా
-
Apr 20, 2026 07:10 IST
కోడిపందేలపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్
తూ.గో.: నల్లజర్లలో కోడిపందేలపై పోలీసుల దాడి
8 మంది పందెంరాయుళ్ల అరెస్ట్
రెండు కోడి పుంజులు, కత్తుల స్వాధీనం
-
Apr 20, 2026 07:09 IST
నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి
హైదరాబాద్: అత్తాపూర్ సులేమాన్‌నగర్‌లో హత్యాయత్నం
నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి
తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని.. ఆస్పత్రికి తరలింపు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Apr 20, 2026 07:07 IST
నేడు ఇస్లామాబాద్‌కు అమెరికా ప్రతినిధులు
మరోసారి ఇరాన్‌తో చర్చలు జరపనున్న అమెరికా
ఒప్పందాలకు అంగీకరించకపోతే దాడులు తప్పవన్న ట్రంప్
విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలు కూలుస్తామని హెచ్చరిక
-
Apr 20, 2026 06:52 IST
ఆదిలాబాద్: నేడు ఇంద్రవెల్లి సంస్మరణ దినోత్సవం
రెండో ఏడాది అధికారికంగా జరపనున్న ప్రభుత్వం
సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న మంత్రి జూపల్లి
-
Apr 20, 2026 06:52 IST
విజయ్, సంగీత విడాకుల కేసు.. నేడు విచారణ
TVK అధినేత విజయ్, సంగీత విడాకుల కేసు
నేడు చంగల్పట్టు కోర్టులో విచారణ
-
Apr 20, 2026 06:48 IST
ఐపీఎల్: నేడు గుజరాత్ వర్సెస్ ముంబై
అహ్మదాబాద్‌లో రాత్రి 7.30గంటలకు మ్యాచ్
-
Apr 20, 2026 06:47 IST
తెలంగాణలో సంక్షేమ వారోత్సవాలు
నేటి నుంచి హాస్టళ్లలో పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహణ
రేపు విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్
ఈ నెల 26న తెలంగాణ వ్యాప్తంగా బడిబాట
-
Apr 20, 2026 06:47 IST
అమెరికాలో కాల్పుల కలకలం
లూసియానాలో దుండగుడి కాల్పులు
10 మంది చిన్నారుల మృతి
పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
-
Apr 20, 2026 06:46 IST
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి వావిలాల నగర్‌లో వివాహిత ఆత్మహత్య
ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ గోవర్ధన(40)
స్థానిక క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తున్న గోవర్ధన
ఆర్ఎంపీ డాక్టర్ కొట్టడంతో మనస్తాపానికి గురైనట్లు ఆరోపణలు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Apr 20, 2026 05:53 IST
నేడు జగిత్యాలలో BRS ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ
హాజరుకానున్న కేటీఆర్, హరీష్‌రావు, ముఖ్యనేతలు
కేసీఆర్ సమక్షంలో BRSలో చేరనున్న టి.జీవన్‌రెడ్డి
-
Apr 20, 2026 05:53 IST
ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర
తెరుచుకున్న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు
ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం
23న ఉదయం 6:15 గంటలకు తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే అనుమతి
-
Apr 20, 2026 05:52 IST
రాజస్థాన్: అజ్మీర్ పుష్కర్‌లో ఘోర ప్రమాదం
150 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు
చిన్నారి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం
-
Apr 20, 2026 05:51 IST
నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
శ్రీకాళేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్న సీఎం
మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్న సీఎం, మంత్రులు
-
Apr 20, 2026 05:50 IST
అమరావతి: జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌కు సీఎం చంద్రబాబు
పటమట అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేయనున్న చంద్రబాబు దంపతులు
ఒకరోజు అన్న క్యాంటీన్ కోసం రూ.76 లక్షల విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి
నేడు ఏపీ వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం
-
Apr 20, 2026 05:49 IST
విశాఖ: నేడు సింహాచలం అప్పన్న చందనోత్సవం
తెల్లవారుజాము నుంచే భక్తులకు స్వామి దర్శనం
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న హోంమంత్రి అనిత