గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:45 AM
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేడు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. దేశంలో మేలిమి బంగారం ధర దాదాపు రూ.3 వేల మేర పెరగ్గా వెండి ధర రూ.15 వేల మేర ఎగబాకింది. గల్ఫ్‌లో ప్రస్తుతం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఈ వారం కూడా ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 20) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,770గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది.
ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర గరిష్ఠంగా రూ.1,56,650గా ఉంది. ఢిల్లీలో రూ.1,55,920ల వద్ద, ముంబైలో రూ.1,55,770ల వద్ద కొనసాగుతోంది. ఇక ఆర్నమెంటల్ బంగారం ధర చెన్నైలో రూ.1,43,590గా ఉంది. ఢిల్లీలో ధర రూ.1,42,940గా, ముంబైలో రూ.1,42,790గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర 4,782 డాలర్ల వద్ద, వెండి ధర 80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
అక్షయ తృతీయ విక్రయాలు.. రూ.20,000 కోట్ల స్థాయికి..
స్టాక్ మార్కెట్స్.. ఈ వారం మిశ్రమ ధోరణికి అవకాశం!