Share News

మిశ్రమ ధోరణికి అవకాశం..!

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:09 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్‌ జలసంధిని తెరవడంపై అమెరికా, ఇరాన్‌ ఒక్క మాటపై...

మిశ్రమ ధోరణికి అవకాశం..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్‌ జలసంధిని తెరవడంపై అమెరికా, ఇరాన్‌ ఒక్క మాటపై నిలబడకపోవటం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఒకవేళ శాంతిపవనాలు వీస్తే సూచీలు పుంజుకోవటం ఖాయం. ప్రస్తుతం రియల్టీ, మెటల్‌, ఆటో, మీడియా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు జోరును ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

యునైటెడ్‌ స్పిరిట్స్‌: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు పతనమవుతూ వస్తోంది. జీవితకాల గరిష్ఠం నుంచి 30 శాతం మేర దిద్దుబాటుకు లోనయ్యాయి. మరోసారి రూ.1,300 మద్దతు స్థాయి వద్ద పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,302 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,280 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,420 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,250 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

జిందాల్‌ స్టీల్‌: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ కౌంటర్‌ 70 శాతం రాబడి అందించింది. పైగా గరిష్ఠ స్థాయిల్లో చక్కని బేస్‌ ఏర్పరచుకుంది. మరోసారి జీవితకాల గరిష్ఠాన్ని బేక్‌ చేసేందుకు సిద్ధంగా ఉంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ గణనీయంగా పుంజుకున్నాయి. గత శుక్రవారం రూ.1,270 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,250 శ్రేణిలో ప్రవేశించి రూ.1,390 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,225 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎన్‌ఎ్‌సడీఎల్‌: ఐపీఓ గరిష్ఠ స్థాయి రూ.14,20 నుంచి 45 శాతం పతనమైన ఈ షేరు రూ.800 వద్ద టర్న్‌ అరౌండ్‌ అయ్యాయి. చివరి రెండు వారాల్లో 20 శాతం మేర లాభపడింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.939 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మూమెంటమ్‌ ఇన్వెస్టర్లు రూ.930 శ్రేణిలో ఎంటరై రూ.1,060 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.900 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


మ్యాక్స్‌ హెల్త్‌: జీవితకాల గరిష్ఠం నుంచి 30 శాతం పతనమైన ఈ షేరు ప్రస్తుతం కీలకమైన రూ.900 మద్దతు స్థాయి నుంచి పుంజుకున్నాయి. స్వల్ప పుల్‌బ్యాక్‌ కనిపిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగవుతోంది. గత శుక్రవారం రూ,1,007 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.990 శ్రేణిలో ప్రవేశించి రూ.1,140 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.970 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

కోల్‌ ఇండియా: జీవితకాల గరిష్ఠం తర్వాత 35 శాతం మేర పతనమైన ఈ కౌంటర్‌లో ఆరోగ్యకరమైన దిద్దుబాటు నమోదైంది. ఫిబ్రవరి నుంచి 25 శాతం మేర రాబడిని అందించాయి. గత శుక్రవారం రూ.438 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.430 శ్రేణిలో ప్రవేశించి రూ.490/525 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.410 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 05:09 AM