-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International Breaking Live Updates of 11th May 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 11 , 2026 | 06:32 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 11, 2026 20:51 IST
హైదరాబాద్: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై విచారణ
కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్
షేట్ బషీరాబాద్ డీసీపీ, ఇన్‌స్పెక్షర్లతో సమావేశమైన రితిరాజ్
బాధితురాలి స్టేట్‌మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు: రితిరాజ్
బాధితురాలి స్టేట్‌మెంట్ మరోసారి రికార్డు చేస్తాం: రితిరాజ్
చట్టప్రకారం ఇప్పటి వరకు డేటా సేకరించారు: రితిరాజ్
తప్పు చేసినట్లు తేలితే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేస్తాం: రితిరాజ్
నిందితుడి CDRను పరిశీలిస్తున్నాం: రితిరాజ్
-
May 11, 2026 20:04 IST
హైదరాబాద్: సనత్‌నగర్ టిమ్స్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష
టీమ్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం
ట్రయల్ రన్‌లో 22 విభాగాల్లో ఓపీ సేవలు ప్రారంభం
-
May 11, 2026 19:54 IST
హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
ఈనెల 17 వరకు తెలంగాణ వ్యాప్తంగా విద్యావారోత్సవాలు
ప్రభుత్వ స్కూళ్ల బలోపేతమే ప్రధాన లక్ష్యం
-
May 11, 2026 19:40 IST
హైదరాబాద్: మంగళవారం కేఆర్ఎంబీ కీలక సమావేశం
మ.3:30 గంటలకు జలసౌధాలో త్రిసభ్య కమిటీ భేటీ
తాగునీటి అవసరాలపై చర్చించనున్న త్రిసభ్య కమిటీ
నీటి వినియోగంపై కీలక నిర్ణయాలకు అవకాశం
-
May 11, 2026 19:36 IST
ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్‌స్పీకర్లపై డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆందోళన
డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు
శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి
ప్రార్థనా స్థలాల్లో అధిక శబ్దంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి
విద్యార్థులు, వృద్ధులు, రోగులకు తీవ్ర ఇబ్బందులు: రఘురామకృష్ణం రాజు
-
May 11, 2026 19:29 IST
పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ఫైర్
కేంద్ర అనుమతి లేకుండా పనులు చేస్తున్నారని ఆరోపణ
పోలవరం లిఫ్ట్ స్కీమ్ వెంటనే ఆపాలన్న తెలంగాణ
ఏపీ పనులను నియంత్రించాలని పీపీఏ కి విజ్ఞప్తి
-
May 11, 2026 18:47 IST
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర శ్రీలంక తీరానికి ఆనుకుని అల్పపీడనం
48 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం
మంగళవారం ఏపీలో పలుచోట్ల పిడుగులతో వర్షసూచన
-
May 11, 2026 18:46 IST
బండి భగీరథ్ ఎపిసోడ్‌పై రాజాసింగ్ స్పందన
బండి సంజయ్ కొడుకైనా.. నా కుమారుడైనా.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే: రాజాసింగ్
-
May 11, 2026 18:44 IST
తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు
కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం
చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యుల నియామకం
సభ్యుల్లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అవకాశం
చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు అవకాశం
మహిళా కమిషన్ సభ్యులుగా శశికళ, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా
-
May 11, 2026 18:01 IST
ఢిల్లీ: రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
పల్నాడు అభివృద్ధికి సంబంధించి కీలక ప్రాజెక్టులపై చర్చ
పిడుగురాళ్ల- సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని విజ్ఞప్తి
-
May 11, 2026 17:59 IST
సిద్దిపేట: చేర్యాల శివారు గట్టుతోటలోని ఇంట్లో చోరీ
6 తులాల బంగారం, రూ.48 వేలు అపహరణ
-
May 11, 2026 17:58 IST
హైదరాబాద్: గాజులరామారం కైలాస్ హిల్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
రెండవ అంతస్తులో పేలిన గీజర్, భారీగా ఎగసిపడుతోన్న మంటలు
సెకండ్ ఫ్లోర్‌లోని ప్లాట్ మొత్తం వ్యాపించిన మంటలు
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేస్తోన్న సిబ్బంది
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
-
May 11, 2026 16:44 IST
ఢిల్లీ: CII వార్షిక సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు
పరిశ్రమల ప్రోత్సాహకానికి CII సరైన వేదిక: సీఎం చంద్రబాబు
మోదీ నేతృత్వంలో పారిశ్రామిక వృద్ధి: సీఎం
వినూత్న ఆలోచనలతో లక్ష్యాలు చేరుకోవచ్చు: సీఎం
1990 నాటి ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం: సీఎం
పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్: సీఎం
-
May 11, 2026 16:42 IST
అనకాపల్లి: నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పాస్‌పుస్తుకం జారీ కోసం రూ.1.50 లక్షలు లంచం డిమాండ్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పెదతీనార్ల వీఆర్‌వో చిట్టిబాబు
-
May 11, 2026 16:41 IST
వరంగల్: బండి భగీరథ్ వ్యవహారంపై హరీశ్ రావు స్పందన
కేసును నీరుగార్చేందుకే సిట్ వేశారు: హరీశ్
కేసు పెట్టి ఇన్ని రోజులైనా అరెస్ట్ చేయకపోవడమేంటి?: హరీశ్
కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతోంది: హరీశ్
లీకుల మాస్టర్ రేవంత్ రెడ్డి: హరీశ్
-
May 11, 2026 16:39 IST
వరంగల్: గుప్త నిధుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి శివాలయం కూల్చేశారు: హరీశ్ రావు
లంకెబిందెల వేటలో భాగంగానే దేవాలయాన్ని కూల్చారు: హరీశ్
ఎక్కడో మంజూరైన స్కూలును ఇక్కడికి తీసుకొచ్చారు: హరీశ్
ధరణిలో దేవాలయం భూమి అని ఉంటే భూభారతిలో మారింది: హరీశ్
గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని పురావస్తు శాఖ అధికారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు: హరీశ్
-
May 11, 2026 16:33 IST
ICC వన్డే వార్షిక ర్యాంకింగ్స్ ప్రకటన
అగ్రస్థానం నిలబెట్టుకున్న భారత్
118 పాయింట్లతో టాప్‌లో టీమిండియా
2, 3 స్థానాల్లో న్యూజిలాండ్(113), ఆస్ట్రేలియా(109)
-
May 11, 2026 16:30 IST
పవన్‌పై ప్రేమతోనే జనసేనలో చేరా: బాలినేని శ్రీనివాసరెడ్డి
నన్ను జనసేనలో చేరనివ్వకుండా కొందరు ప్రయత్నించారు: బాలినేని
నాపై పవన్ కల్యాణ్‌కి ఫిర్యాదులు చేశారు: బాలినేని
ఆర్థికంగా దెబ్బతిన్న నన్ను పవన్ ఆదుకున్నారు: బాలినేని
ప్రకాశం జిల్లాలో జనసేన జెండా ఎగురవేస్తాం: బాలినేని
-
May 11, 2026 15:47 IST
చెన్నై: మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి సీఎం విజయ్
స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయ్
-
May 11, 2026 15:26 IST
ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు దురదృష్టకరం: సీఎం రేవంత్
ముస్లింలు, మావోయిస్టులు ఈదేశంలో భాగస్వాములు: సీఎం
ముస్లింలను వేరుచేసి చూపించడం మంచిది కాదు: సీఎం
కలిసి ఉండాలనాలి కానీ విడగొట్టాలనటం సరికాదు: సీఎం
తెలంగాణలో 818 మంది మావోయిస్టులు లొంగిపోయారు: సీఎం
దేశంలోనే ఎక్కడా ఇలా జరగలేదు: సీఎం
-
May 11, 2026 15:24 IST
అమరావతి: ఏపీని ప్రపంచస్థాయి ‘మైస్’ కేంద్రంగా మార్చడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
అంతర్జాతీయ ఈవెంట్ల అనుమతులకు ప్రత్యేక బ్యూరోల ఏర్పాటు: మంత్రి
అమరావతిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతి: మంత్రి
సింగపూర్ సన్ టెక్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేశ్
-
May 11, 2026 15:24 IST
ఏపీని కరవు రహితంగా మార్చే ప్రాజెక్టు పోలవరం: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: మంత్రి నిమ్మల
వైసీపీ పాలనలో పోలవరం ప్రశ్నార్థకం చేశారు: మంత్రి నిమ్మల
-
May 11, 2026 15:01 IST
గత వైసీపీ హయాంలో పోలీసులను నడిరోడ్డుపై నిలబెట్టారు: హోంమంత్రి అనిత
శాంతిభద్రతలపైనే సీఎం చంద్రబాబు ఫోకస్: అనిత
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 పోలీస్ ఉద్యోగాల భర్తీ: అనిత
-
May 11, 2026 14:45 IST
బండి భగీరథ ఎపిసోడ్‌పై స్పందించిన టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
ఈ అంశం బండి సంజయ్ కుటుంబంలో జరిగింది: రాంచందర్‌రావు
ఈ వ్యవహారంలో పార్టీకి గానీ, బండి సంజయ్‌కి గానీ సంబంధం లేదు: రాంచందర్‌రావు
ఒకవేళ బండి సంజయ్‌కి సంబంధం ఉంటే చట్టపరమైన చర్యలుంటాయి: రాంచందర్‌రావు
-
May 11, 2026 13:47 IST
నిజామాబాద్: ఆర్మూర్ PACS ఎదుట రైతులు ఆందోళన
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో పాటూ తరుగు తీస్తున్నారంటూ ఆందోళన
సొసైటీ గదికి తాళం వేసి రైతుల నిరసన
-
May 11, 2026 13:42 IST
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ
గంటకు పైగా కొనసాగిన సమావేశం
పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించిన నేతలు
పాల్గొన్న ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల
-
May 11, 2026 13:05 IST
బండి భగీరథ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
తక్షణమే విచారణ చేపట్టాలని డీజీపీకి ఆదేశాలు
ఈనెల 8న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించిన సీఎం
కేసు వివరాలను సీఎంకు తెలిపిన డీజీపీ సీవీ ఆనంద్
-
May 11, 2026 12:28 IST
బెయిల్ పిటిషన్లు వేగంగా పరిష్కరించేందుకు సుప్రీం మార్గదర్శకాలు
వారం లేదా 15 రోజుల్లో బెయిల్ కేసులు విచారించాలి: సుప్రీంకోర్టు
విచారణకు ముందే స్టేటస్ రిపోర్టులు తప్పనిసరి..
బెయిల్ దరఖాస్తు కాపీని ఏజీకి తప్పక అందజేయాలి..
కొత్త బెయిల్ పిటిషన్లను వారంలోగా విచారణకు తీసుకోవాలి: సుప్రీంకోర్టు
-
May 11, 2026 12:28 IST
కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ
పాల్గొన్న ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి
ఇప్పటికే అమిత్‌షాను కలిసిన సీఎం చంద్రబాబు
-
May 11, 2026 12:13 IST
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ
సుమారు అరగంటకు పైగా కొనసాగిన సమావేశం
-
May 11, 2026 12:06 IST
క్రూడాయిల్ ధరల పెరుగుదలతో మార్కెట్ల పతనం
నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
250 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
-
May 11, 2026 12:03 IST
13 నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు
13 నుంచి ఈనెల 21 వరకు థియరీ పరీక్షలు
ఈనెల 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు
-
May 11, 2026 12:02 IST
నెల్లూరు: పొదలకూరు పీఎస్‌లో వైసీపీ నేత కాకాణిపై కేసు నమోదు
అనుచరులతో రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని కానిస్టేబుల్ ఫిర్యాదు
కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై 341, 343 సెక్షన్ల కింద కేసు నమోదు
-
May 11, 2026 11:53 IST
కడప: పోలీసుల ఎదుట లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి
పెద్ద దస్తగరి హత్య కేసులో ప్రధాన సూత్రధారి నిత్యానందరెడ్డి
నిత్యానందరెడ్డి కోసం 20 రోజులుగా గాలిస్తున్న పోలీసులు
-
May 11, 2026 11:25 IST
బెంగాల్ సీఎం సువేందు అధికారి PA హత్య కేసు
యూపీ, బిహార్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్
-
May 11, 2026 11:19 IST
ఢిల్లీ: బెంగాల్‌లో బీజేపీ అనైతిక విధానంతో గెలిచింది: CPI నారాయణ
వామపక్షాల వల్లే TVK ప్రభుత్వం ఏర్పడింది: CPI నారాయణ
మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం..
సెప్టెంబర్‌లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తాం: CPI నారాయణ
-
May 11, 2026 11:19 IST
గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన
సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ
ఆలయంలో జరిగే మహాపూజ, కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ
-
May 11, 2026 11:17 IST
తమిళనాడు సీఎం విజయ్‌పై DMK చీఫ్ స్టాలిన్ ఆగ్రహం
అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న విజయ్
అబద్ధ ప్రచారాలు ఆపాలంటూ విజయ్‌కి స్టాలిన్ చురకలు
తమిళనాడుపై అప్పుల భారం ఎంత ఉందో తెలుసుకోండి: స్టాలిన్
-
May 11, 2026 11:15 IST
హైదరాబాద్: రిటైర్డ్ IPS భార్య హత్య కేసులో పురోగతి
తనూజను హత్య చేసి, దోపిడీకి పాల్పడ్డ పనిమనిషి అరెస్ట్
పూణెలో కల్పనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం
మరో ఇద్దరి కోసం కొనసాగుతోన్న పోలీసుల గాలింపు
-
May 11, 2026 11:14 IST
ఢిల్లీ: కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
మధ్యాహ్నం 12.30గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం భేటీ
వివిధ ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్న సీఎం చంద్రబాబు
-
May 11, 2026 10:20 IST
ప్రధాని మోదీపై ఎక్స్‌లో రాహుల్‌గాంధీ విమర్శలు
మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారు: ఎక్స్‌లో రాహుల్
ప్రజలేం కొనాలో.. కొనకూడదో చెప్పే పరిస్థితికి వచ్చారు..
మోదీ చెప్పినవి ప్రబోధాలు కావు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు..
రాజీపడిన ప్రధాని మోదీ.. దేశాన్ని నడపడం కష్టం: ఎక్స్‌లో రాహుల్
-
May 11, 2026 10:11 IST
పల్నాడు జిల్లా: నరసరావుపేట మండలం కాకానిలో విషాదం
చేపల చెరువులో పడవ మునిగి ఇద్దరు కూలీల గల్లంతు
చేపలకు ఆహారం వేసేందుకు తెల్లవారుజామున పడవలో వెళ్లిన ముగ్గురు కూలీలు
పడవ బోల్తాపడడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన ఒక వ్యక్తి
మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు
-
May 11, 2026 09:54 IST
తమిళనాడు ప్రభుత్వం కీలక ఆదేశాలు
మహిళల రక్షణ కోసం సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
సీఎం పర్యవేక్షణలోనే కొత్త విభాగం పని చేస్తుందన్న ప్రభుత్వం
-
May 11, 2026 09:54 IST
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
ప్రొటెం స్పీకర్‌గా ఎమ్మెల్యే కరుప్పయ్య నియామకం
రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
-
May 11, 2026 09:53 IST
క్రూడాయిల్ ధరల పెరుగుదలతో మార్కెట్లు పతనం
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 1,010, నిఫ్టీ 290 పాయింట్లకు పైగా నష్టం
40 పైసలు పడిపోయిన రూపాయి విలువ
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.88
-
May 11, 2026 09:39 IST
హైదరాబాద్: గోషామహల్ పీఎస్ పరిధిలో భారీ చోరీ
30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5లక్షల నగదు అపహరణ
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గోషామహల్ పోలీసులు
-
May 11, 2026 09:38 IST
హైదరాబాద్: చందానగర్‌లో లిక్కర్ షాప్‌ను అటాచ్ చేసిన ఐటీ
బినామీ యాక్ట్ కింద శ్రీ భవానీ వైన్ షాపు సీజ్
హైదరాబాద్‌లో లిక్కర్ షాపు పేరుతో బినామీ బిజినెస్
ఎస్సీ రిజర్వేషన్‌లో లిక్కర్ షాప్ దక్కించుకున్న సురేష్
కేవలం పేరు మాత్రమే సురేష్‌ది ఉన్నట్టు గుర్తింపు
-
May 11, 2026 08:58 IST
మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్స్, కుటుంబసభ్యుల ధర్నా
మద్యం సేవించారని పలువురు డ్రైవర్లను విధుల్లోకి తీసుకోని అధికారులు
మద్యం తాగకున్నా బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్‌లో తాగినట్టు వస్తోందని వాపోతున్న డ్రైవర్లు
బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్లను మార్చాలని డ్రైవర్ల డిమాండ్
ధర్నాకు మద్దతు తెలిపిన ఆర్టీసీ జేఏసీ నాయకులు, నిలిచిపోయిన బస్సులు
-
May 11, 2026 08:55 IST
సంగారెడ్డి: కల్హేర్ మండలం బీబీపేట్‌లో చిరుత కలకలం
పొలం వద్ద కట్టేసిన దూడను చంపి తిన్న చిరుత
అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు
కొంతకాలంగా కల్హేర్ అటవీప్రాంతంలో సంచరిస్తున్న చిరుత
-
May 11, 2026 08:36 IST
కడప: అల్మాస్‌పేట సర్కిల్ గొడవపై కలెక్టర్, ఎస్పీ సీరియస్
డ్రగ్స్, గంజాయి తీసుకుని ఘర్షణకు పాల్పడినట్టు గుర్తింపు
మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ రాకేష్ చంద్రను బాధ్యతల నుంచి తప్పించిన కలెక్టర్ శ్రీధర్
-
May 11, 2026 08:33 IST
కాకినాడ: గాంధీనగర్‌లో కానిస్టేబుల్ దారుణహత్య
APSP కానిస్టేబుల్ నాగేశ్వరరావును హత్యచేసిన బంధువులు
అర్ధరాత్రి నాగేశ్వరరావుతో బావమరుదుల ఘర్షణ
ఇరువర్గాల దాడిలో నాగేశ్వరరావు మృతి
-
May 11, 2026 08:32 IST
సికింద్రాబాద్-భద్రాచలం రైలు 30 నిమిషాలు నిలిపివేత
వరంగల్: ఎలుగూరు-నెక్కొండ రైల్వేస్టేషన్ సమీపంలో పంట వ్యర్థాలకు నిప్పుపెట్టిన రైతులు
రైల్వేట్రాక్‌ను పొగ కమ్మేయడంతో సికింద్రాబాద్-భద్రాచలం రైలు 30 నిమిషాలు నిలిపివేత
పొలాల్లో మంటలార్పిన రైల్వే సిబ్బంది
-
May 11, 2026 08:30 IST
నేడు గవర్నర్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
ఉదయం 11గంటలకు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలవనున్న సీఎం
విద్యా వారోత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించనున్న సీఎం రేవంత్
-
May 11, 2026 07:14 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,340
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,640
కిలో వెండి ధర రూ.2,79,900
-
May 11, 2026 07:07 IST
మహబూబ్‌నగర్ పాలకొండ జంక్షన్ దగ్గర రోడ్డుప్రమాదం
బైక్-కారు ఢీకొని ఐదుగురి మృతి
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 11, 2026 06:35 IST
నేడు తెలంగాణలో వర్షాలు
శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం
ఆవర్తనంతో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం
బిహార్ నుంచి కోస్తాంధ్ర వరకూ ద్రోణి ప్రభావం
ద్రోణి ప్రభావంతో నేడు తెలంగాణలో వర్షాలు
-
May 11, 2026 06:34 IST
నేటి నుంచి తెలంగాణలో విద్యా వారోత్సవాలు
LB స్టేడియంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
May 11, 2026 06:33 IST
నేడు తమిళనాడు అసెంబ్లీలో MLAల ప్రమాణస్వీకారం
కొత్తగా ఎన్నికైన MLAలతో ప్రమాణస్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్
రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
-
May 11, 2026 06:32 IST
IPL: నేడు పంజాబ్ Vs ఢిల్లీ
ధర్మశాలలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
IPL ప్లేఆఫ్స్ పోరు నుంచి ముంబై ఎలిమినేట్
-
May 11, 2026 06:32 IST
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
పలువురు కేంద్ర మంత్రులతో భేటీకానున్న సీఎం చంద్రబాబు
CII బిజినెస్ సమ్మిట్‌కు హాజరుకానున్న సీఎం చంద్రబాబు