Share News

స్థిరంగా గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవీ

ABN , Publish Date - May 11 , 2026 | 06:43 AM

ఈ వారం పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు పరిమిత స్థాయిలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవీ
Gold, Silver Rates on May 11

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గత వారం రూ.1.5 లక్షల దిగువకు పడిపోయిన పసిడి ధరలు వారాంతానికల్లా మళ్లీ ఎగబాకాయి. ఈ వారం ధరల్లో హెచ్చుతగ్గులు పరిమితస్థాయిలోనే ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటు ద్రవ్యోల్బణం వంటివి వాటి ఆధారంగా గోల్డ్, సిల్వర్ ధరలు ప్రభావితం కానున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ( మే 11) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,340గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640గా ఉంది. నగరంలో కిలో వెండి ధర రూ.2,79,900ల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.


దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,360గా ఉంది. ఢిల్లీలో రూ.1,52,490ల వద్ద, ముంబైలో రూ.1,52,340ల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,41,490గా, ఢిల్లీలో రూ.1,39,790గా, ముంబైలో రూ 1,39,640గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర గరిష్ఠంగా రూ.2,79,900 వద్ద, ముంబైలో కనిష్ఠంగా రూ.2,74,900 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,697 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

ఇంధన కంపెనీలపై యుద్ధ ప్రభావం.. రోజుకు రూ.1,600-1,700 కోట్ల నష్టం

Updated Date - May 11 , 2026 | 06:55 AM