రోజుకు రూ.1,600-1,700 కోట్లు..
ABN , Publish Date - May 11 , 2026 | 02:07 AM
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ ఇంధన విక్రయ సంస్థలు విలవిల్లాడుతున్నాయి. క్రూడాయిల్, ఎల్‌పీజీ రేట్ల పెరుగుదలకు...
ఇంధన కంపెనీలపై యుద్ధ ప్రభావమిది..
10 వారాల్లో రూ.లక్ష కోట్ల నష్టం
త్వరలోనే పెట్రోల్ రేట్ల పెంపు..!?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ ఇంధన విక్రయ సంస్థలు విలవిల్లాడుతున్నాయి. క్రూడాయిల్, ఎల్‌పీజీ రేట్ల పెరుగుదలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచకపోవడం వల్ల ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలైన ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ రోజుకు రూ.1,600-1,700 కోట్లు.. గడిచిన 10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైగా నష్టాలను చవిచూశాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కంపెనీలు ఈ నష్టాలను ఇంకెంత కాలం భరించగలవన్నది ప్రశ్నార్థకంగా మారిందని, త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు తప్పకపోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు, ఎంత పెంచాలన్నది ప్రభుత్వం నిర్ణయించనుందన్నారు. పదివారాల్లో ముడిచమురు ధరలు 50 శాతం మేర పెరిగాయి.
ప్రపంచం 100 కోట్ల పీపాల చమురును కోల్పోయింది..
పశ్చిమాసియాలో యుద్ధం, హోర్ముజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోవడంతో గడిచిన 2 నెలల్లో ప్రపంచం దాదాపు 100 కోట్ల పీపాల చమురును కోల్పోయిందని సౌదీ అరా మ్కో సీఈఓ అమిన్ నాసర్ అన్నారు. హోర్ముజ్ నుంచి సరఫరా తిరిగి ప్రారంభమైనా, ఇంధన మార్కెట్‌లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా సమయం పట్టవచ్చన్నారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా నాసర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఈ వార్తలనూ చదవండి:
'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా