-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 4th October 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 04 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 04, 2026 08:30 IST
విజయనగరం: సంతకవిటి మండలం తాళడలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల నేపథ్యంలో గొడవ
నిన్న రాత్రి టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడి
నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 04, 2026 08:15 IST
సింగీతం శ్రీనివాసరావు మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతాపం
చిత్ర పరిశ్రమకు విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడు సింగీతం
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Oct 04, 2026 08:00 IST
సింగీతం శ్రీనివాసరావు మృతికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు సంతాపం
సినిమా రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి పుష్పక విమానంలో నింగికేగిన దర్శక దిగ్గజం
మన దర్శక దిగ్గజం సింగీతం ఇక లేరనేది నమ్మకలేకపోతున్నా
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: కె.రాఘవేంద్రరావు
-
Oct 04, 2026 07:50 IST
తిరుపతి: హైటెక్ వ్యభిచార గుట్టురట్టు చేసిన అలిపిరి పోలీసులు
శ్రీఆదిశేషారెడ్డి నగర్‌లోని హోమ్‌పై పోలీసుల దాడులు
అసోంకు చెందిన ఇద్దరు, బెంగళూరుకు చెందిన ఒకరిని రెస్క్యూ హోమ్‌కు తరలింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Oct 04, 2026 07:45 IST
సింగీతం శ్రీనివాసరావు మృతికి మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి
విభిన్న కథాంశాలతో సినిమాలు తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన గొప్ప దర్శకుడు సింగీతం
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు: మంత్రి కందుల దుర్గేష్
-
Oct 04, 2026 07:40 IST
నేడు మెదక్ జిల్లాలో మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ పర్యటన
తూప్రాన్‌లో అమూల్ డెయిరీ నిర్మాణానికి భూమిపూజ
తర్వాత రైతులతో మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ ముఖాముఖి
-
Oct 04, 2026 07:35 IST
హైదరాబాద్: పాతబస్తీలో భద్రతా బలగాల భారీ మాక్‌డ్రిల్
చార్మినార్, మక్కా మసీదుల దగ్గర మాక్‌డ్రిల్ ట్రయల్స్
అత్యవసర పరిస్థితులు, ఉగ్రదాడులను తిప్పికొట్టేలా విన్యాసాలు
కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో భాగస్వామ్యమైన భద్రతా బృందాలు
-
Oct 04, 2026 07:30 IST
అమరావతి: సీనియర్లు, ఇన్‌చార్జ్‌లతో సీఎం చంద్రబాబు జూమ్ మీటింగ్
స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
ఎన్నికలు 2, 3 వారాలు వాయిదా వేయాలన్న నేతలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
ప్రజలకు తెలియని వ్యక్తులకు టికెట్ ఇవ్వొద్దు: సీఎం చంద్రబాబు
-
Oct 04, 2026 07:15 IST
నేడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రులు
పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి
-
Oct 04, 2026 07:00 IST
యుద్ధంపై భారత్ ప్రతిపాదనలకు ఉక్రెయిన్ స్పందన
ఇప్పటివరకూ అందిన ప్రతిపాదనల్లో భారత్ ప్రతిపాదనలు సమగ్రంగా ఉన్నాయి: ఉక్రెయిన్
రష్యా కూడా అంగీకరిస్తేనే కాల్పుల విరమణ సాధ్యం: ఉక్రెయిన్
-
Oct 04, 2026 06:50 IST
రేపు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
రేపు పీసీసీ చీఫ్‌లు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశం
సమావేశంలో పాల్గొననున్న మహేశ్ గౌడ్
SIRలో అక్రమాలు, భవిష్యత్ ఉద్యమాలపై చర్చ
-
Oct 04, 2026 06:45 IST
తెలంగాణలో పలు జిల్లాలకు మోస్తరు వర్షసూచన
పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
-
Oct 04, 2026 06:40 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
నేడు ఢిల్లీలో హైలెవెల్ మీటింగ్‌కు అమిత్ షా హాజరు
-
Oct 04, 2026 06:35 IST
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు వాహనాలు ఢీకొని 17 మంది మృతి
-
Oct 04, 2026 06:30 IST
హైదరాబాద్‌లో నేడు పింక్ విక్టరీ రన్ 2026
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం పింక్ విక్టరీ రన్
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగహన కోసం పింక్ విక్టరీ రన్
2, 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో రన్
హాజరుకానున్న చిన్నజీయర్‌స్వామి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రోటరీ, మెడికవర్ ఆధ్వర్యంలో పింక్ విక్టరీ రన్
-
Oct 04, 2026 06:15 IST
నేడు తూప్రాన్‌లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పర్యటన
అమూల్ డెయిరీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు
-
Oct 04, 2026 06:05 IST
సింగీతం శ్రీనివాసరావు మృతికి నటుడు జూ.ఎన్టీఆర్ సంతాపం
సింగీతం శ్రీనివాసరావు ఇకలేరన్న వార్త ఎంతో బాధాకరం: జూ.ఎన్టీఆర్
ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి వంటి మంచి సినిమాలు అందించిన వ్యక్తి
సింగీతం శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: జూ.ఎన్టీఆర్
-
Oct 04, 2026 06:03 IST
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(95) కన్నుమూత
వృద్ధాప్య సమస్యల కారణంగా మృతిచెందిన సింగీతం శ్రీనివాసరావు
చెన్నై కావేరి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన సింగీతం
చివరిగా నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం' అనే సినిమాకి దర్శకత్వం
95 ఏళ్ల వయసులోనూ దర్శకత్వంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సింగీతం
-
Oct 04, 2026 06:00 IST
నేడు గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం చంద్రబాబు పర్యటన
3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఉదయం 10:40 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రి చౌహాన్