-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 10th September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 10 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Sep 10, 2026 07:45 IST
నెల్లూరు: ఓజిలి మండలం రచపాలెం చెరువు కల్వర్టు దగ్గర ప్రమాదం
మంటలు చెలరేగి.. ట్రావెల్స్ బస్సు దగ్దం
డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం
రేపల్లె నుంచి బెంగళూరు వెళ్తున్న కామాక్షి ట్రావెల్స్ బస్సు
-
Sep 10, 2026 07:40 IST
పల్నాడు: గామాలపాడు సచివాలయంలో జగన్ చిత్రపటాలు
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా మారని ఉద్యోగుల తీరు
నేటికీ గామాలపాడు సచివాలయంలో జగన్‌రెడ్డి భారీ చిత్రపటం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కూటమి కార్యకర్తలు
-
Sep 10, 2026 07:35 IST
హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత
5 ఇరాన్ చమురు ట్యాంకర్లను అమెరికా ముంచినట్లు సమాచారం
10 నౌకలపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడి
100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్
-
Sep 10, 2026 07:30 IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
ఇరాన్ ఇక ఎక్కువ కాలం తట్టుకోలేదు: ట్రంప్
US ఎన్నికలను ఇరాన్ ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది: ట్రంప్
-
Sep 10, 2026 07:25 IST
నెల్లూరు: చేజర్ల మండలం ఆదురుపల్లిలో ఎర్రచందనం అక్రమ తరలింపు
బొలెరోలో తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగల స్వాధీనం
ముందస్తు సమాచారంతో వాహనాన్ని అడ్డుకున్న చేజర్ల పోలీసులు, అటవీశాఖ అధికారులు
పోలీసులను చూసి వాహనంలోని నలుగురి పరారీ.
కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం గాలింపు
-
Sep 10, 2026 07:15 IST
మహబూబ్ నగర్ జిల్లా: భూత్పూర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రమాదం
రోడ్డు పక్కన సూచిక బోర్డును ఢీకొట్టిన గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం
క్షణాల్లో వాహనంలో చెలరేగిన మంటలు
డ్రైవర్ రషీద్ ఖాన్‌కు తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు
ప్రమాదంలో సజీవదహనమైన గొర్రెలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 10, 2026 07:10 IST
హైదరాబాద్: BRSLP నాయకుల ముందస్తు అరెస్టులు
అసెంబ్లీ నుంచి BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో నిరసనలకు దిగుతారన్న సమాచారంతో ముందస్తు అరెస్టులు
-
Sep 10, 2026 07:05 IST
కాసేపట్లో కేటీఆర్ నివాసంలో BRS ఎమ్మెల్యేల భేటీ
తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న BRS
-
Sep 10, 2026 07:00 IST
రేపు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
-
Sep 10, 2026 06:55 IST
నేడు విజయనగరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
పాల్గొననున్న నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌లు
శ్రీను పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Sep 10, 2026 06:45 IST
అసెంబ్లీ ఘటనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
విచారణ అధికారిగా IPS విజయ్‌కుమార్ నియామకం
ప్రత్యక్షంగా పాల్గొన్నవారితో పాటు వెనుక ఉండి కుట్ర చేసినవారిపై చర్యలకు ఆదేశం
-
Sep 10, 2026 06:40 IST
హైదరాబాద్: యువతులను మోసం చేసిన కానిస్టేబుల్‌పై కేసు
పదేళ్లుగా క్లాస్‌మేట్‌తో ప్రేమాయణం నడిపిన కానిస్టేబుల్ అరుణ్
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసిన అరుణ్‌కుమార్
జులై 1న మరో యువతిని పెళ్లి చేసుకున్న అరుణ్‌కుమార్
ఉప్పల్ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు
-
Sep 10, 2026 06:37 IST
నేడు విజయనగరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
పాల్గొననున్న వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు
శ్రీను పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Sep 10, 2026 06:35 IST
కాంగ్రెస్‌లో కీలక నియామకం
ఆల్ ఇండియా ప్రొషెషనల్స్ చైర్మన్‌గా మధుయాష్కీ
ప్రవీణ్ చక్రవర్తి స్థానంలో మధుయాష్కీ నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్
-
Sep 10, 2026 06:30 IST
నేడు మహిళల ఆసియా కప్ తొలి సెమీస్
సెమీస్‌లో బంగ్లాతో తలపడనున్న భారత్ ఉమెన్స్ టీమ్
రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం
-
Sep 10, 2026 06:25 IST
గుజరాత్: గాంధీనగర్‌లో కూలిన భవనం స్లాబ్
15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
నలుగురిని రెస్క్యూ చేసిన ఫైర్ సిబ్బంది
కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Sep 10, 2026 06:20 IST
నెల్లూరు: కావలి మండలం ముసునూరులో వ్యభిచార గృహంపై పోలీసుల ఆకస్మిక దాడి
ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు విటులని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు
-
Sep 10, 2026 06:17 IST
హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన CLP భేటీ
అసెంబ్లీ ఘటనలు సహా ఇతర అంశాలపై చర్చ
-
Sep 10, 2026 06:15 IST
రేపు భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
కీలక రక్షణ ఒప్పందాలపై చర్చ, బ్రిక్స్ సదస్సుకు వస్తున్న పుతిన్
-
Sep 10, 2026 06:10 IST
విశాఖలో తొలిసారి 41వ IATO జాతీయ సదస్సు
నేటి నుంచి 3 రోజుల పాటు IATO సదస్సు
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేంద్ర మంత్రి షెకావత్
-
Sep 10, 2026 06:07 IST
నేడు కేటీఆర్ నివాసంలో BRS ఎమ్మెల్యేల భేటీ
తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న BRS
-
Sep 10, 2026 06:05 IST
4వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేడు తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టనున్న స్పీకర్
తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు-2026పై చర్చ
జనగణన-2027పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ
రెండోదశ ప్రశ్నావళిలో BC/OBCలను చేర్చాలని చర్చ
-
Sep 10, 2026 06:00 IST
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్
కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు
ఇప్పటికే పెంచిన 7 ఏళ్లకు అదనంగా మరో 3 ఏళ్లు
మొత్తం 10 ఏళ్ల వరకూ వయోపరిమితి సడలింపు
పోలీస్, ఫైర్, జైళ్లు, SPFలో కానిస్టేబుల్ పోస్టులకు వర్తింపు