Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 27 , 2026 | 06:13 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 27, 2026 07:40 IST

    తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం

    • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పని వేళల పొడిగింపు

    • ఈ నెల 31తో ముగియనున్న 2025-26 ఆర్థిక సంవత్సరం

    • డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని పని వేళల పొడిగింపు

    • ఈ నెల 28, 30, 31 తేదీల్లో పనిచేయనున్న అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

  • Mar 27, 2026 07:37 IST

    విశాఖ పోర్టుకు చేరుకోనున్న మూడు ఎల్పీజీ నౌకలు

    • మూడు నౌకల్లో నేడు (శుక్రవారం) పోర్టుకు చేరుకోనున్న ఒక నౌక..

    • ఈనెల 30న విశాఖ పోర్టుకు రానున్న మరో 2 నౌకలు

  • Mar 27, 2026 07:30 IST

    అనంతపురం: యాడికిలో బాలుడిని హత్య చేసిన నిందితుడిపై కాల్పులు

    • సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం సర్వేష్‌ను తీసుకెళ్తుండగా తప్పించుకునే యత్నం

    • నిందితుడు సర్వేష్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు

    • కాల్పుల్లో సర్వేష్‌కు తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు

  • Mar 27, 2026 07:24 IST

    ఇరాన్‌పై దాడులకు మరో 10 రోజుల బ్రేక్‌: ట్రంప్‌

    • ఇరాన్‌ ఎనర్జీ ప్లాంట్లపై దాడులు ఆపుతున్నట్లు ట్రంప్‌ ప్రకటన

    • ఇరాన్‌ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్‌ 6 వరకు గడువు పొడిగింపు..

    • ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి..

    • యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయం

  • Mar 27, 2026 06:57 IST

    టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కొనసాగుతున్న విచారణ

    • ఏకసభ్య కమిషన్‌ విచారణకు హాజరుకానున్న అధికారులు

    • విచారణ పూర్తి చేసేందుకు కమిషన్‌కు 15 రోజుల సమయం

  • Mar 27, 2026 06:56 IST

    నేడు మహాబలిపురంలో టీవీకే పార్టీ తొలి సమావేశం

    • నేడు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్న విజయ్‌

    • పోటీ చేసే నియోజకవర్గంపై విజయ్ క్లారిటీ ఇచ్చే అవకాశం

  • Mar 27, 2026 06:44 IST

    ప్రజలకు సీఎం చంద్రబాబు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

    • ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు..

    • రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Mar 27, 2026 06:35 IST

    ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్..

    • నౌకాదళ మరమ్మత్తు కేంద్రాలు, ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా దాడులు

    • ఇరాన్ డ్రోన్ సామర్థ్యం తగ్గిందన్న అమెరికా-ఇజ్రాయెల్ వాదనలకు సమాధానమని ప్రకటన

  • Mar 27, 2026 06:29 IST

    ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం

    • సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్న ప్రధాని

    • పశ్చిమాసియా పరిస్థితులు, సమన్వయంపై చర్చ..

    • రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై చర్చించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

  • Mar 27, 2026 06:16 IST

    ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

    • కడప: నేడు ఒంటిమిట్ట ఆలయంలో ధ్వజారోహణం

    • ఏప్రిల్‌ 1న సాయంత్రం కోదండరాముడి కల్యాణోత్సవం

  • Mar 27, 2026 06:14 IST

    నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర

    • ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్‌ నుంచి యాత్ర ప్రారంభం

    • సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర

    పూర్తి కథనం..

  • Mar 27, 2026 06:13 IST

    నేడు భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణం

    • భద్రాద్రి కొత్తగూడెం: నేడు భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణం..

    • హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి