Share News

Yami Gautam Dhar: మావారి ‘ధురంధర్‌’ విజయం.. ముందే ఊహించా...

ABN , Publish Date - Jan 18 , 2026 | 07:30 AM

నేను ఎప్పుడూ నిర్మాతలకు ఒక్కటే చెబుతా. స్క్రిప్ట్‌ చెప్తుంటే వినడం కన్నా... చదవడానికే ప్రాధాన్యం ఇస్తా.. అని అన్నారు ప్రముఖ నటి యామీ గౌతమ్‌ ధర్‌. ఒకవేళ నా పాత్ర బలంగా ఉందనిపిస్తే స్క్రిప్ట్‌ కూడా పట్టించుకోను. షూటింగ్‌ సమయంలో నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. షూటింగ్‌ సమయంలో సాధ్యమైనంత వరకు ఫోన్‌కు దూరంగా ఉంటా. అన్ని జానర్లలో నటించి, నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని చూస్తా.. అని అన్నారు.

Yami Gautam Dhar: మావారి ‘ధురంధర్‌’ విజయం.. ముందే ఊహించా...

భర్త నుంచి భరణం పొందేందుకు చాలాకాలం కోర్టులో పోరాడి గెలిచిన షాబానో బేగం అప్పట్లో ఓ సంచలనం. ఆమె పోరాటస్ఫూర్తిని ‘హక్‌’గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందులో షాబానోగా అద్భుతంగా నటించిన యామీ గౌతమ్‌ ధర్‌ ప్రస్తుతం ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’గా మారింది. పైగా ఆమె భర్త తీసిన ‘ధురంధర్‌’ సంచలన విజయంతో డబుల్‌ ధమాకాను సెలబ్రేట్‌ చేసుకుంటున్న యామీ ఏమంటోందంటే...

పాత్ర నచ్చితే... స్క్రిప్ట్‌ చూడను...

నేను ఎప్పుడూ నిర్మాతలకు ఒక్కటే చెబుతా. స్క్రిప్ట్‌ చెప్తుంటే వినడం కన్నా... చదవడానికే ప్రాధాన్యం ఇస్తా. ఒకవేళ నా పాత్ర బలంగా ఉందనిపిస్తే స్ర్కిప్ట్‌ కూడా పట్టించుకోను. షూటింగ్‌ సమయంలో నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. షూటింగ్‌ సమయంలో సాధ్యమైనంత వరకు ఫోన్‌కు దూరంగా ఉంటా. అన్ని జానర్లలో నటించి, నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని చూస్తా.


book1.2.jpg

ఆ సమస్యను జయించా...

టీనేజ్‌ నుంచే కెరటోసిస్‌ పిలారిస్‌ అనే చర్మ సమస్యతో బాధపడుతున్నా. ఇప్పటికీ అది నయం కాలేదు. మీరు బాగా పరిశీలిస్తే నా ముఖంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తుంటాయి. మొదట్లో భయం, అభద్రతా భావానికి గురయ్యేదాన్ని. తర్వాత నన్ను నేను అంగీకరించడం మొదలెట్టా. ముఖంపై మచ్చలున్నంత మాత్రాన అందంగా లేమని కాదు కదా!

వంట బాగా చేస్తారు...

మావారు వంటలు అదరగొడతారు. అన్ని వెరైటీలు అద్భుతంగా చేస్తారు. మా ఇద్దరి ఇష్టాయిష్టాలు ఒకేలా ఉంటాయి. అందుకే మేమిద్దరం కనెక్ట్‌ అయ్యాం. మాకు ఔటింగ్స్‌, పార్టీలకు వెళ్లడం నచ్చదు. సమయం దొరికితే ఇంట్లో గడపడానికే ఇష్టపడతాం. ఇల్లే మా కంఫర్ట్‌ ప్లేస్‌. నచ్చినవి వండుకుని తింటూ, టీవీలో సినిమా చూస్తూ టైంపాస్‌ చేస్తాం. మా ఇద్దరికీ సింపుల్‌గా గడపడమే ఇష్టం.


book2.jpg

అతని వ్యక్తిత్వానికి ఫిదా...

నేను, మావారు (‘ధురంధర్‌’ దర్శకుడు ఆదిత్యధర్‌) డైరెక్ట్‌ చేసిన ‘ఉరి’ సినిమాలో నటించా. షూటింగ్‌ సమయంలో మామధ్య ఏర్పడిన పరిచయం, సినిమా ప్రమోషన్‌ నాటికి ప్రేమగా మారింది. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాం. ఆదిత్య చాలా కేరింగ్‌ పర్సన్‌. మర్యాదస్తుడు. అందుకే అతడి వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయా.


సోషల్‌ మీడియాకు దూరం...

చాలామంది సెలబ్రిటీలు వారి జీవితాల్లో జరిగే ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. నాకది నచ్చదు. నా వ్యక్తిగత విషయాల్ని బయటకు చెప్పాలనుకోను. జనాలు నా గురించి మాట్లాడుకోవాలని నేను కోరుకోను. వాళ్లకు నా వ్యక్తిగత జీవితం గురించి ఎంత తక్కువ తెలిస్తే... నేను పోషించే పాత్రలకు వాళ్లు అంత ఎక్కువగా కనెక్ట్‌ అవుతారని నమ్ముతా.


book1.3.jpg

సెలబ్రిటీ కిడ్‌గా కాకుండా..

మాకు గతేడాది బాబు పుట్టాడు. తనకి ‘వేదవిద్‌’ అని పేరు పెట్టాము. మహా పండితుడు, శ్రీమహావిష్ణువు అని ఈ పేరుకు అర్థం. బాబును సెలబ్రిటీ కిడ్‌గా కాకుండా సింపుల్‌గా పెంచాలనుకుంటున్నాం. అమ్మను అయ్యాక నాలో ఓపిక, అర్థం చేసుకునే తత్వం బాగా పెరిగాయి. ఏదేమైనా మా అబ్బాయి మా ఇద్దరి జీవితాల్ని సంపూర్ణం చేశాడు.


zzz.jpg

స్క్రిప్ట్ పై చాలా వర్క్‌ చేస్తాడు

‘ధురంధర్‌’ భారీ విజయాన్ని సాధించడం ఆనందానిచ్చింది. ఆ స్క్రిప్ట్‌ చదివినప్పుడే... అందులోని ఇంటెన్స్‌ చూసి శక్తిమంతమైన కథ అని అర్థమైంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం అవుతుందని అప్పుడే ఊహించా. సినిమాలో మేల్‌ క్యారెక్టర్స్‌ అన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకే ఆ క్షణంలో ‘నేను అబ్బాయినైతే బాగుండేది’ అని ఫీలయ్యా. ఆదిత్య ఏ సినిమా తీసినా స్ర్కిప్ట్‌పై చాలా వర్క్‌ చేస్తాడు. అందుకే ఆయన కథలు చాలా లోతుగా, స్పష్టంగా ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..

శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2026 | 07:30 AM