బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంచాలి?
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:30 PM
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వస్తువులు ఉంచే స్థలం చాలా ముఖ్యం. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎక్కడ ఉంచుతున్నామన్నది దాంపత్య జీవితంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎక్కడ ఉంచుతున్నామన్నది కేవలం ఇంటీరియర్ విషయం మాత్రమే కాదు.. అది దాంపత్య జీవితం, కుటుంబ శాంతి, మానసిక ప్రశాంతతపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. డ్రెస్సింగ్ టేబుల్‌ను సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, తప్పు దిశలో ఉంచితే అనవసర సమస్యలు తలెత్తే అవకాశముందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. మరి డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మహిళలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మేకప్ చేసుకుంటారు. వాస్తు ప్రకారం, సరైన దిశలో కూర్చొని మేకప్ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. అందుకే డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎక్కడ, ఎలా ఉంచాలో తెలుసుకోవడం చాలా అవసరం.
డ్రెస్సింగ్ టేబుల్‌కు సరైన దిశలు..
వాస్తు ప్రకారం, బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను తూర్పు, పశ్చిమ, ఉత్తరం దిశల్లో ఉంచడం మంచిదని భావిస్తారు. అలాగే ఈశాన్యం, వాయువ్య దిశల్లో కూడా ఉంచవచ్చు. ఈ దిశల్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచితే దాంపత్య జీవితంలో ప్రేమ, శాంతి, ఆనందం కొనసాగుతాయని నమ్మకం.
ఈ దిశలో ఉంచకండి..
వాస్తు ప్రకారం, డ్రెస్సింగ్ టేబుల్‌ను దక్షిణం, నైరుతి, ఆగ్నేయ దిశల్లో ఉంచకూడదు. ఈ దిశల్లో ఉంచితే ఇంట్లో కలహాలు, అసంతృప్తి, అశాంతి పెరిగే అవకాశం ఉందని చెబుతారు. ముఖ్యంగా ఆగ్నేయం అగ్ని తత్వానికి సంబంధించినది. అక్కడ అద్దం ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని వాస్తు నమ్మకం. కొన్ని వాస్తు విశ్వాసాల ప్రకారం.. దక్షిణ దిశలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని మేకప్ చేసే మహిళలకు కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి రావొచ్చని అంటారు.
ఇవి గుర్తుంచుకోండి..
డ్రెస్సింగ్ టేబుల్ చిన్న వస్తువే అయినా, దాని స్థానం దాంపత్య జీవితం, ఆరోగ్యం, మానసిక శాంతిపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టేటప్పుడు దిశ, స్థానం గురించి జాగ్రత్తగా ఆలోచించడం మంచిది.
NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
అప్పుల బారిన పడుతున్నారా? సింకింగ్ ఫండ్‌తో ఆర్థిక టెన్షన్‌కు బ్రేక్!
For More Latest News