Share News

భారత్ యాత్ర కార్డు గురించి తెలుసా? దీంతో ఎన్ని బెనిఫిట్స్ అంటే..

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:48 PM

వివిధ నగరాల్లోని ప్రజారవాణా సాధనాల్లో జర్నీలను సులభతరం చేసేలా పైన్ ల్యాబ్స్.. భారత్ యాత్ర కార్డు పేరిట ఓ ప్రీపెయిడ్ కార్డును తీసుకొచ్చింది. మరి ఈ కార్డు ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

భారత్ యాత్ర కార్డు గురించి తెలుసా? దీంతో ఎన్ని బెనిఫిట్స్ అంటే..
Bharat Yatra Card

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో పలు నగరాల్లో మెట్రో రైలు సర్వీసు అందుబాటులో ఉంది. అయితే, వీటిల్లో ప్రయాణాల కోసం జనాలు ఆయా మేట్రో స్టేషన్‌‌లల్లో ప్రత్యేక ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్స్, లేదా టిక్కెట్స్‌ కొనుగోలు చేసుకోవాలి. ఇది కొందరు పర్యాటకులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పైన్ ల్యాబ్స్ సంస్థ భారత్ యాత్ర కార్డును అందుబాటులోకి తెచ్చింది. మరి దీని విశేషాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Bharat Yatra Card).

రూపే చెల్లింపుల వ్యవస్థ ఆధారంగా పైన్ ల్యాబ్స్ ఈ ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఇదో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు. అంటే.. మెట్రో రైలు సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకే కార్డుతో చెల్లింపులు జరిపేలా దీన్ని డిజైన్ చేశారు. ఎన్‌సీఎమ్‌సీ వ్యవస్థ అందుబాటులో ఉన్న అన్ని మెట్రో, ఆర్‌టీసీ, రైల్వే స్టేషన్స్‌లో దీన్ని వినియోగించుకోవచ్చు. భారత్‌లో పలు నగరాలను చుట్టి రావాలనుకునే యాత్రికులకు ఇది అత్యంత అనుకూలం. బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేస్తే పది నిమిషాల్లో కార్డు ఇంటికి డెలివరీ అవుతుంది.


భారత్ యాత్ర కార్డు ఫీచర్సు ఇవీ

  • బ్లింకిట్ యాప్‌లో రూ.50లతో దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు

  • ఇది జీరో కేవైసీ కార్డు కావడంతో ఎలాంటి గుర్తింపు డాక్యుమెంట్‌ల అవసరం ఉండదు. క్యూఆర్ కోడ్, మొబైల్ నెంబర్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.

  • ఈ కార్డును యూజర్లు తమ యూపీఐ అకౌంట్స్ ద్వారా లేక భారత్ యాత్ర యాప్ ద్వారా సులువుగా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డు గరిష్ఠ బ్యాలెన్స్ రూ.2 వేలు.

  • ఇది కాంటాక్ట్ లెస్ పేమెంట్స్‌కు అనువై కార్డు. కాబట్టి యూజర్లకు ఆయా మెట్రోల్లో స్వైపింగ్ బెడద ఉండదు. కేవలం టిక్కెటింగ్ యంత్రంపై కార్డును చిన్నగా తడితే ప్రయాణ చార్జీలు కార్డులోంచి కట్ అవుతాయి.

  • ఢిల్లీ, ముంబై, చెన్నై అహ్మదాబాద్ నగరాల్లోని మెట్రో రైళ్లల్లో ఈ కార్డుతో ఈజీగా ప్రయాణించొచ్చు. భవిష్యత్తుల్లో ఈ సదుపాయాన్ని మరిన్ని నగరాలను విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.


ఆర్డర్ చేసుకోవడం ఇలా..

  • యూజర్లు తమ బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ యాప్స్‌లోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో భారత్ యాత్ర కార్డు వెతకాలి.

  • ఈ కార్డు ధర రూ.50లతో పాటు డెలివరీ చార్జీలు కూడా చెల్లించి బుక్ చేసుకోవాలి.

  • ఇలా ఆర్డర్ చేశాక పది నిమిషాల్లో కార్డు ఇంటికి డెలివరీ అవుతుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

కార్డు యాక్టివేషన్ కోసం..

  • కార్డును యాక్టివేట్ చేసుకునేందుకు ముందుగా భారత్ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  • కార్డు వెనుకున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.

  • ఆ తరువాత మొబైల్ నెంబర్‌ను కార్డుకు లింక్ చేయాలి. ఆ తరువాత మీకు అవసరమైన మేరకు డబ్బును కార్డుకు జత చేసి రిచార్జ్ చేసుకోవాలి.

  • ఎన్‌సీఎమ్‌సీ ఆధారిత కార్డు రీడర్స్ ఉన్న బస్సు, మెట్రో, రైల్వే స్టేషన్లలో ఈ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు.


ఇవీ చదవండి:

ప్రశాంతమైన హిల్ స్టేషన్.. కానీ విదేశీయులకు నో ఎంట్రీ

టేస్టీ కొత్తిమీర చట్నీ.. ఇలా తయారు చేయండి..

Updated Date - Jan 28 , 2026 | 07:45 PM