Share News

విమాన ప్రయాణాల్లో ఈ వస్తువులకు నో ఎంట్రీ! ఎందుకో తెలుసా?

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:30 PM

విమాన ప్రయాణాల్లో భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని వస్తువులపై కఠినమైన నిషేధం ఉంటుంది. అసలు ఏయే వస్తువులను అనుమతించరు, వాటి వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం..

విమాన ప్రయాణాల్లో ఈ వస్తువులకు నో ఎంట్రీ! ఎందుకో తెలుసా?
Coconut Flight Ban

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా విమాన ప్రయాణంలో కొన్ని వస్తువులను అనుమతించరు. క్యారీ-ఆన్, చెక్-ఇన్ బ్యాగులను భద్రతా సిబ్బంది స్వయంగా తనిఖీ చేస్తారు. అయితే, విమానాశ్రయాలు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించినప్పటికీ, విమానం క్యాబిన్‌లోకి ఏం తీసుకెళ్లాలో.. ఏం తీసుకెళ్లకూడదో చాలా మంది ప్రయాణికులకు తెలియదు. విమానాల్లో అసలు ఏయే వస్తువులను అనుమతించరు, వాటి వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం.


  • సాధారణంగా మనం పూజా కార్యక్రమాలు, శుభకార్యక్రమాలు కోసం కొబ్బరి వాడుతుంటాం. అయితే, విమాన ప్రయాణాల్లో దీనిని హ్యాండ్ బ్యాగేజీలో కానీ, చెక్-ఇన్ బ్యాగేజీలో కానీ సిబ్బంది చూస్తే వెంటనే ఆపేస్తారు. విమానాల్లో కొబ్బరి నిషేధం.. ఎయిర్ పోర్ట్ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో జరిమానా పడే అవకాశం కూడా ఉంది.

  • విమాన ప్రయాణంలో కొబ్బరికాయను అనుమతించకపోవడం వెనుక బలమైన భద్రతా కారణాలు ఉన్నాయి. చాలా మంది కొబ్బరి కేవలం మతపరమైన లేదా ఆహారం అని అనుకుంటారు. విమానంలో దీన్ని అనుమతించకపోవడానికి సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి.

  • ఎండు కొబ్బరిలో అధిక మొత్తంలో నూనె ఉంటుంది, ఇది వేగంగా మండే స్వభావం కలిగి ఉంటుంది. విమానం ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఇది త్వరగా వేడెక్కి, ఒక్కసారి దానంతట అదే మండే ప్రమాదం ఉంది. అందుకే అంతర్జాతీయ విమానయాన సంస్థలు (IATA) కొబ్బరిని అనుమతించరు.

  • కొబ్బరికాయ గట్టిగా ఉండటం వల్ల విమానాశ్రయ భద్రతా తనిఖీల్లో అది సమస్యగా మారుతుంది. ఎక్స్-రే మెషీన్ల ద్వారా దాని లోపల ఏముందో స్పష్టంగా చూడటం సాధ్యం కాదు.

  • గతంలో కొంతమంది ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు కొబ్బరికాయల లోపల పేలుడు పదార్థాలను పెట్టుకొని స్మగ్లింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి కొబ్బరికాయను విమానంలో పూర్తిగా నిషేధించారు.

  • భారత దేశంలో హిందువలు కొబ్బరిని ఎంతో పవిత్రంగా చూస్తారు. అయితే, విమానంలో ప్రయాణించేటప్పుడు పవిత్రమైన వస్తువుగా కొబ్బరికాయను తీసుకెళ్లాలని అనుకున్నా, విమానయాన చట్టాలు మాత్రం ప్రయాణికులు భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తాయి.


బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు:

pawabank.jpgపవర్ బ్యాంకులను చెక్-ఇన్ బ్యాగేజీలో అస్సలు అనుమతించరు. కేవలం హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకంటే లిథియం-అయాన్ బ్యాటరీలకు త్వరగా నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల విమానం కార్గోలో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది.

బ్యాటరీతో నడిచే వీల్‌చైర్లు:

wee chaijr.jpgబ్యాటరీతో నడిచే వీల్ చైర్లు, మొబిలిటీ పరికరాలు వెట్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. రవాణా సమయంలో ఇవి దెబ్బతింటే, బ్యాటరీలలో ఆమ్లం తుప్పు పట్టడానికి, విమాన పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడానికి కారణం అవుతాయి.

గ్యాస్ కార్ట్రిడ్జ్‌లు, ఇ-సిగరెట్లు:

ecegarate.jpgకార్ట్రిడ్జ్‌లు, లైటర్లు, అగ్గిపెట్టెలు, ఇతర మండే స్వభావం గల వస్తువులను చెక్-ఇన్ బ్యాగేజీలో అనుమతించరు. విమాన ప్రయాణంలో ఒత్తిడి మార్పుల వల్ల లేదా ఘర్షణ వల్ల ఇవి మంటలు రేపే అవకాశం ఉంది.


స్విచ్ ఆఫ్ కాని పవర్డ్ పరికరాలు:

baje.jpgబ్యాటరీతో నడిచే, స్విచ్ ఆఫ్ చేయలేని ఎలక్ట్రానిక్ పరికరాలు అధిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. అందువల్ల వీటిని క్యాబిన్ బ్యాగేజీలో నిషేధించారు.

థర్మామీటర్, బారో మీటర్:

tharma.jpgపాదరస థర్మామీటర్ లేదా బారోమీటర్ వంటి వైద్య పరికరాలు రవాణా సమయంలో దెబ్బతింటే, వాటి నుంచి లీక్ అయిన పాదరసం విమానం, కార్గో ప్రాంతమంతా వ్యాపించి నష్టాన్ని కలిగిస్తాయి.

బొమ్మలు, ఆయుధాలు, పదునైన వస్తువులు:

gune.jpgకత్తులు, కత్తెరలు, కత్తులు, ఇతర పదునైన పరికరాలు, బొమ్మ తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్లడం నిషేధం.


ఈ వార్తలు కూడా చదవండి..

గత పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..

For More National News And Telugu News

Updated Date - Apr 06 , 2026 | 05:01 PM