Share News

యుద్ధం ఎఫెక్ట్.. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుందా?

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:08 PM

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వందలాది విమానాలు రద్దు అయ్యాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

యుద్ధం ఎఫెక్ట్.. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుందా?
Travel Insurance Flight Cancellation Coverage

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వందలాది విమానాలు రద్దు అయ్యాయి, కొన్ని రూట్లు మారాయి. భారతీయులు కూడా అక్కడ చిక్కుకుపోయారు. ఇలాంటి సందర్భాల్లో, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పని చేస్తుందా?

  • అనుకోని కారణాల వల్ల ప్రయాణం రద్దైనపుడు, టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్, టూర్ ప్యాకేజీలు రీయింబర్స్ అవుతాయి.

  • ఫ్లైట్ ఆలస్యమైతే అదనపు హోటల్, భోజనం, రీబుకింగ్ ఖర్చులు పాలసీ షరతుల ప్రకారం కవర్ అవుతాయి.

  • హాస్పిటల్, డాక్టర్ ఫీజులు, అంబులెన్స్, ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్, అవసరమైతే స్వదేశానికి రీటర్న్ ఖర్చులు రీయింబర్స్ అవుతాయి.


యుద్ధ మినహాయింపు నిబంధన

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ యుద్ధ పరిస్థితుల వల్ల కలిగే నష్టాలను చాలా సందర్భాల్లో కవర్‌ చేయదు. అంటే, ఒక దేశం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటిస్తే, ఆ యుద్ధ కారణంగా వచ్చే ఖర్చులు (ఫ్లైట్ రద్దు, హోటల్ ఖర్చులు, ఇతర ట్రావెల్ ఖర్చులు) ఇన్సూరెన్స్ తిరిగి చెల్లించకపోవచ్చు. దీనిని యుద్ధ మినహాయింపు అని అంటారు. కానీ, ఆపరేషనల్ సమస్యల కోసం (విమాన రద్దు, ఎయిర్‌పోర్ట్ మూసివేత, గగనతల రూట్ మార్పు) ఏర్పడిన ఖర్చులు, పాలసీ షరతుల ప్రకారం కవర్ కావచ్చు.


ఇవి కూడా చదవండి

మీ మెదడుకు మేత .. ఈ ఫొటోలో మచ్చలు లేని కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..

అమెరికా, ఇరాన్ యుద్ధం: బుర్జ్ ఖలీఫాకు ఇన్సురెన్స్ ఉందా? వివరాలు ఇవే...

Updated Date - Mar 02 , 2026 | 02:14 PM