Share News

ఇరాన్‌కు బిగ్ షాక్.. తాత్కాలిక సుప్రీం లీడర్ అరాఫీ మృతి?

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:58 PM

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ రెజా అరాఫీ మరణించినట్లు తెలుస్తోంది. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఇరాన్‌కు బిగ్ షాక్.. తాత్కాలిక సుప్రీం లీడర్ అరాఫీ మృతి?
Ayatollah Alireza Arafi news

ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్‌కు బిగ్ షాక్ తగిలింది. తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ మరణించినట్లు తెలుస్తోంది. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ మేరకు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇరాన్ స్టేట్ మీడియా మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. తాత్కాలిక సుప్రీం లీడర్ మరణించాడన్న వార్తలు సోషల్ మీడియా వైరల్‌గా మారటంతో టెహ్రాన్‌లో అలజడి మొదలైంది.


ఖమేనీ మృతితో సుప్రీం లీడర్‌గా అరాఫీ

ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా దేశాలు దాడులు చేస్తున్నాయి. శనివారం ఇజ్రాయెల్-అమెరికా దళాలు టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు. ఖమేనీ మృతిని ఆదివారం ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ నేతలు తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలీ రెజా అరాఫీని ఎన్నుకున్నారు. అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న గంటల్లోనే ఆయన మరణించాడంటూ వార్తలు రావటం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

మైనింగ్ ఈ-వేలంలో భారీగా అక్రమాలు: కేటీఆర్

చోటి హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Updated Date - Mar 02 , 2026 | 01:25 PM