Share News

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రూల్స్ మారాయ్..

ABN , Publish Date - Mar 24 , 2026 | 06:01 PM

రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలకమైన అప్డేట్ ఇచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ విధానాల్లో కొత్త మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం.. టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తం ఆధారపడి ఉంటుంది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రూల్స్ మారాయ్..
Indian Railways New Rules

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలకమైన అప్డేట్ ఇచ్చింది. టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్ విధానాల్లో కొత్త మార్పులు చేపట్టింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకు రిఫండ్ నిబంధనలను మరింత కఠినంగా మార్చినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.


కొత్త రీఫండ్ నియమాలు ఇలా ఉన్నాయి:

  • సవరించిన నిబంధనల ప్రకారం.. టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ ఆధారపడి ఉంటుంది.

  • ట్రైన్ బయల్దేరే సమయానికి 72 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే కనీస క్యాన్సిలేషన్ ఛార్జీలు మాత్రమే కట్ చేసి మిగతా మొత్తం రీఫండ్ ఇస్తారు.

  • 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే టికెట్ ధరలో సుమారు 25% కోత విధిస్తారు.

  • 24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే సుమారు 50% వరకు క్యాన్సిలేషన్ ఛార్జీలు కట్ అవుతాయి.

  • ట్రైన్ బయల్దేరే 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు.

  • ఇంకా ప్రయాణికులకు ఒక ముఖ్యమైన సౌలభ్యం కూడా కల్పించారు. రైలు బయల్దేరే ముందు 30 నిమిషాల వరకు బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు అనుకూలమైన స్టేషన్‌లో ఎక్కే సౌకర్యం పొందగలరు.

  • అదే సమయంలో, త్వరలో కన్ఫర్మ్ టికెట్ల తేదీ మార్పు (రీస్కెడ్యూల్)ను క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా చేసే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశముంది.

  • ఈ మార్పుల ద్వారా రైల్వే సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.


Also Read:

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు

For More Latest News

Updated Date - Mar 24 , 2026 | 06:09 PM