Share News

Lavasa Tourist Places: లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా.. వీకెండ్ ట్రిప్‌కు బెస్ట్ ప్లేస్..

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:20 PM

వీకెండ్‌తో కలిపి సంక్రాంతి సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈసారి సాధారణ టూరిస్ట్ స్పాట్స్ కాకుండా కాస్త ప్రత్యేకమైన డెస్టినేషన్‌ని ఎంచుకోండి. పాస్‌పోర్ట్ అవసరం లేకుండానే ఇటలీ ఫీల్ ఇస్తున్న ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Lavasa Tourist Places: లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా.. వీకెండ్ ట్రిప్‌కు బెస్ట్ ప్లేస్..
Lavasa Tourist Places

ఇంటర్నెట్ డెస్క్: వీకెండ్‌తో కలిపి సంక్రాంతి సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈసారి సాధారణ టూరిస్ట్ స్పాట్స్ కాకుండా కాస్త ప్రత్యేకమైన డెస్టినేషన్‌ని ఎంచుకోండి. పాస్‌పోర్ట్ అవసరం లేకుండానే ఇటలీ ఫీల్ ఇస్తున్న లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా – లావాసా మీకు బెస్ట్ ఆప్షన్. యూరోపియన్ వైబ్స్, సరస్సు ఒడ్డున కేఫ్‌లు, రంగురంగుల భవనాలతో లావాసా మిమ్మల్ని మైమరపిస్తుంది. మరి హైదరాబాద్ నుంచి లావాసాకు ఎలా చేరుకోవాలి? అక్కడ ఏమేం చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..


లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా - లావాసా..

ఇటలీలోని అందమైన తీర పట్టణం పోర్టోఫినో నుంచి ప్రేరణ పొంది లావాసాను నిర్మించారు. రంగురంగుల పాస్టెల్ భవనాలు, సరస్సు ఒడ్డున వాకింగ్ పాత్‌లు, కేఫ్‌లతో నిండిన వీధులు, ఓపెన్ స్క్వేర్‌లు.. ఇవన్నీ చూసినప్పుడు యూరప్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది.

Lavasa 1 (2).jpg

లావాసాలో ఏమేం చేయవచ్చు?

  • సరస్సు తీరాన నడక: నెమ్మదిగా నడుస్తూ దృశ్యాలను ఆస్వాదించండి. నీటిపై పడే వెలుతురు చాలా అందంగా ఉంటుంది.

  • సాహస క్రీడలు: యాక్షన్ ఇష్టపడేవారికి లావాసా మంచి ప్లేస్. కయాకింగ్, జెట్ స్కీయింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్ లాంటి యాక్టివిటీస్ చేయవచ్చు.

  • కేఫ్‌లు & రెస్టారెంట్లు: సరస్సు దగ్గర ఉన్న కేఫ్‌లలో కాఫీ తాగుతూ, యూరోపియన్ స్టైల్ ఫుడ్ ఆస్వాదించవచ్చు. లాంగ్ మీల్స్, రిలాక్స్‌డ్ వైబ్ ఇక్కడ ప్రత్యేకం.

Lavasa 1.jpg

  • ప్రకృతి మధ్య విహారం: పట్టణం చుట్టూ పచ్చని దారులు, మబ్బులతో కప్పబడిన కొండలు, నిశ్శబ్ద మూలలు.. ఇవన్నీ మనసుకు చాలా హాయిగా ఉంటాయి. ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.

  • రాత్రి బస: లావాసాలో రిసార్ట్‌లు చాలా బాగుంటాయి. జంటలకు, కుటుంబాలకు, ఒంటరి ప్రయాణికులకు కూడా అనుకూలంగా ఉంటాయి.


హైదరాబాద్ నుండి లావాసాకు ఎలా వెళ్లాలి..

  • హైదరాబాద్ నుండి లావాసాకు కారు ద్వారా వెళ్లాలంటే, హైదరాబాద్ నుంచి సుమారు 560 కి.మీ దూరంలో ఉన్న లావాసాకు డైరెక్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. రూట్.. హైదరాబాద్ → సొలాపూర్ → పుణే → లావాసా (NH65 + NH60). పుణే నుంచి లావాసాకు సుమారు 57 కి.మీ దూరం మాత్రమే ఉంది. కొండల మధ్య అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

Lavasa 1 (1).jpg

  • రైలు ద్వారా వెళ్లాలనుకుంటే.. ముందుగా హైదరాబాద్ నుంచి పుణే చేరుకోవాలి. రైలు ప్రయాణం సుమారు 8–9 గంటలు పడుతుంది. పుణే చేరిన తర్వాత క్యాబ్, బస్సు లేదా టాక్సీ తీసుకొని లావాసాకు వెళ్లవచ్చు. MSRTC బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

  • ఫ్లైట్‌ ఆప్షన్ ఉన్నవారికి, హైదరాబాద్ నుంచి పూణే ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైట్ తీసుకోవడం ఉత్తమం. విమాన ప్రయాణం సుమారు గంటన్నర పడుతుంది. పూణే చేరిన తర్వాత క్యాబ్ లేదా బస్సులో లావాసాకు సుమారు 2–2.5 గంటల్లో చేరవచ్చు.

    Lavasa (1).jpg

  • బస్సు ద్వారా కూడా వెళ్లవచ్చు. హైదరాబాద్ నుండి పూణే వరకు వోల్వో / స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. పూణే చేరిన తర్వాత అక్కడి నుంచి లావాసాకు స్థానిక బస్సులు లేదా క్యాబ్ తీసుకోవచ్చు. ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

ప్రకృతి ప్రేమికులకు పర్ఫెక్ట్.. ఈ అద్భుతమైన ఆఫ్‌బీట్ ప్లేస్‌లకు వెళ్లాల్సిందే!

తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఆఫర్ మిస్ అవ్వొద్దు..

For More Latest News

Updated Date - Jan 10 , 2026 | 01:36 PM