IRCTC Tirupati Tour Package: తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఆఫర్ మిస్ అవ్వొద్దు..
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:07 PM
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తక్కువ ఖర్చుతో తిరుపతి – శ్రీకాళహస్తి దర్శన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు సులభంగా, సౌకర్యంగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తిరుపతి బాలాజీ ఆలయానికి సరసమైన ధరలతో టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా లభిస్తుంది.
సాధారణంగా తిరుపతి ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే వేసవిలో కొంతమేర రద్దీ తక్కువగా ఉండడంతో ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అందుకే ఈ సమయంలో ట్రిప్ ప్లాన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. IRCTC తరచూ దేశీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. బడ్జెట్‌కు తగ్గట్టుగా రూపొందించిన ఈ ప్యాకేజీలు ప్రయాణికుల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ వేసవిలో పిల్లలతో కలిసి ఆలయ యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ప్యాకేజీ ముఖ్య వివరాలు:
ఈ ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.
తిరుపతి బాలాజీ దర్శనంతో పాటు శ్రీకాళహస్తి దర్శనం కూడా ఉంటుంది.
ఈ ప్యాకేజీ జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది.
ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు
ప్యాకేజీ ప్రారంభమైన తర్వాత ప్రతి గురువారం టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ప్యాకేజీ పేరు: కరీంనగర్ టు తిరుపతి.
ఈ ప్యాకేజీ 3 రాత్రులు, 4 పగళ్లు ఉంటుంది.
దర్శనానికి వెళ్లేందుకు క్యాబ్, బస్సు సౌకర్యాలు ఉంటాయి.
టిక్కెట్లు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.

ప్యాకేజీ ధరలు:
3AC కోచ్‌లో ఒక్కరు ప్రయాణించడానికి: రూ.14,030
స్లీపర్ కోచ్‌లో ఒక్కరు ప్రయాణించడానికి: రూ.12,120
3ACలో ఇద్దరు ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ.10,940
ఇద్దరు కలిసి స్లీపర్‌లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తే: ఒక్కొక్కరికి రూ.9,030
ముగ్గురు కలిసి 3ACలో ప్రయాణించడానికి ఒక్కొక్కరికి రూ.9,160
ముగ్గురు కలిసి స్లీపర్‌లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తే ఒక్కొక్కరికి రూ.7,250
పిల్లలకు : రూ.6,700.
ప్యాకేజీలో లేని అంశాలు:
రైలులో భోజనం, పానీయాలు
దర్శన స్థలాల ప్రవేశ టిక్కెట్లు
లంచ్, డిన్నర్ వంటి అదనపు భోజనాలు
టూర్ గైడ్ సేవలు
హోటళ్లలో టిప్స్, పోర్టర్ ఛార్జీలు, మినరల్ వాటర్, ఫోన్ బిల్లులు, లాండ్రీ ఖర్చులు
కెమెరా ఫీజులు, అదనపు ఎంట్రీ టిక్కెట్లు
గుండు చేయించుకోవడానికి ఏర్పాట్లు.
IRCTC ప్రారంభించిన ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ తిరుపతి బాలాజీతో పాటు శ్రీకాళహస్తి దర్శనాన్ని కల్పిస్తుంది. రైలు ప్రయాణం, హోటల్ వసతి, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు మాత్రమే ఈ ప్యాకేజీలో ఉంటాయి. 3AC, స్లీపర్ కోచ్‌లకు వేర్వేరు ధరలు నిర్ణయించగా, పిల్లలకు ప్రత్యేక రాయితీ ఉంది. తక్కువ ఖర్చుతో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ఆలయ దర్శనం చేసుకునే అవకాశం ఈ ప్యాకేజీ అందిస్తోంది.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనపై కసరత్తు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..
For More Latest News