Lavasa: ఇటలీకి వెళ్లివచ్చిన ఫీలింగ్ కావాలా.. అయితే ఈ సిటీని చూడాల్సిందే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:05 PM
ప్రకృతి అందానికి పరవశించని మనసు ఉంటుందా.. ప్రకృతిని ఆస్వాదించడానికి సంకోచించే వ్యక్తి ఉంటాడా.. బాధగా అనిపించినా.. ఒత్తిడిగా అనిపించినా.. మన మనసులో ముందుగా అనుకునేది ఎటైనా ఒంటరిగా వెళ్లిరావాలని.
ముంబై, జనవరి 10: ప్రకృతి అందానికి పరవశించని మనసు ఉంటుందా.. ప్రకృతిని ఆస్వాదించడానికి సంకోచించే వ్యక్తి ఉంటాడా.. బాధగా అనిపించినా.. ఒత్తిడిగా అనిపించినా.. మన మనసులో ముందుగా అనుకునేది ఎటైనా ఒంటరిగా వెళ్లిరావాలని. ఇక ఫ్యామిలీస్, కపుల్స్ అయితే.. తమ సంతోషం కోసం, మంచి జ్ఞాపకం కోసం పర్యాటక ప్రాంతానికి వెళ్లి రావాలని భావిస్తుంటారు. అలాంటి డెస్టినేషన్ ప్లాన్స్‌లలో ముందుండేది.. హిల్ స్టేషన్సే. ఆహ్లాదకరమై వాతావరణం, ఘాట్ రోడ్లు, పచ్చని చెట్లు.. తెల్లటి మేఘాలు, మంచు దుప్పటి కప్పేసిన కొండ గుట్టలు.. మనసును తేలికపరుస్తాయి. గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. మీరు కూడా ఇలాంటి ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే.. మీ కోసం ఓ అద్భుతమైన ప్రదేశం గురించిన వివరాలను తీసుకువచ్చాం. విదేశాలకు వెళ్లకుండానే.. విదేశాల్లో ఉన్నామా! అని అనిపించేలా ఆ లొకేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదుగానీ.. ఇటలీని మించిన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించొచ్చు. అదీ మనదేశంలోనే.. మన పొరుగు రాష్ట్రంలోనే.. అవును.. మహారాష్ట్రలో ఉన్న ‘లవాసా’కు వెళితే.. మళ్లీ తిరిగి రావాలని అనిపించదంటే అతిశయోక్తి కాదు. అందుకే.. దీనిని ‘లిటిల్ ఇటలీ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తారు. మరి ఆ లవాసా ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
లిటిల్ ఇటలీగా లవాసా గుర్తింపు..
ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పోర్టోఫినో. ఇక్కడి పాస్టెల్ రంగుల భవనాలు, సరస్సు ఒడ్డున వాక్ వే, కేఫ్‌లతో సందడిగా ఉండే వీధులు.. ఒకటేంటి.. చెప్పుకుంటూ పోతే చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ పోర్టోఫినో మాదిరిగానే.. లవాసా కూడా అద్భుతంగా ఉంటుంది. వరస్గావ్ సరస్సు ఒడ్డున, సహ్యాద్రి కొండల మధ్య లవాసా ఉంటుంది. ఇక్కడ కొండల మధ్యన ఆకర్షణీయమైన రంగులతో కూడిన భవనాలు.. వీధులు, సరస్సు, ప్రకృతి అందాలు, ఆధునికతను సంతరించుకున్న ఈ నగరం.. ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి. లవాసా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.. కానీ, మాంచి త్రిల్‌ని ఇస్తుంది.
లవాసా ప్రత్యేకతలేంటి..?
1. సరస్సు ఒడ్డున నడక: వరస్గావ్ సరస్సు ఒడ్డున లవాసా ఉంది. ఇక్కడి వీధుల వెంట నడుచుకుంటూ వెళ్తుంటే సరస్సు అందాలను ఆస్వాదించవచ్చు. నీటిపై పడే సూర్య కిరణాల రిఫ్లెక్షన్.. చూసేందుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
2. అడ్వెంచర్ ప్రేమికులు: లవాసా అడ్వెంచర్ ప్రేమికులకు గొప్ప అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కయాకింగ్, జెట్ స్కీయింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్ లాంటి యాక్టివిటీలు ఉన్నాయి.
3. కేఫ్‌లలో కాఫీ: సరస్సు ఒడ్డున ఉన్న కేఫ్‌లలో కాఫీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అంతర్జాతీయ వంటకాలు, యూరోపియన్ వైబ్.. అబ్బో.. ఆ ఫీలింగ్‌ను అక్షరాల్లో వర్ణించలేమంతే. జస్ట్ ఆస్వాదించాల్సిందే.
4. ప్రకృతి ప్రేమికులకు కూడా లవాసా స్వర్గధామం అనే చెప్పాలి. ఎటు చూసినా పచ్చని చెట్లతో వాతావరణం మనోహరంగా ఉంటుంది. కొండంచులను తాకుతున్నట్లుగా ఉండే మేఘాలు.. ఘాట్‌లు.. మెస్మరైజ్ చేసేస్తాయంతే.
5. వసతి సదుపాయం: లవాసాలో వసతి సదుపాయం కూడా ఉంటుంది. అక్కడ నైట్ స్టే చేయడం బెటర్. లవాసాలో చాలా రిసార్టులు ఉన్నాయి. ఆ రిసార్ట్‌లలో వ్యూపాయింట్స్, వారు అందించే ఆతిథ్యం.. వాహ్ అనాల్సిందే. కపుల్స్, ఫ్యామిలీస్, సోలోగా వెళ్లేవారికి లవాసా మంచి టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు.
లవాసాకు ఎప్పుడు వెళ్తే బాగుంటుంది..?
లవాసాను విజిట్ చేయడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు పర్‌ఫెక్ట్ టైమ్ అని చెప్పొచ్చు. చల్లని వాతావరణం, స్వచ్ఛమైన ఆకాశం, నడకకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వర్షాకాలంలో పచ్చని చెట్లు, జలపాతాలు కనులవిందుగా ఉంటాయి.
ఎలా వెళ్లాలి?
లవాసా మహారాష్ట్రలోని పుణే నుంచి సుమారు 57 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముంబై నుంచి అయితే 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారులో వెళ్తే బెటర్ అని చెప్పొచ్చు. కొండల మధ్య వెళ్లే రోడ్డు ప్రయాణం మోస్ట్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. లేదంటే.. రైలు, విమానంలో పుణే చేరుకుని, అక్కడి నుంచి క్యాబ్‌లో గానీ, బస్సులో గానీ లవాసాకు చేరుకోవచ్చు.
చివరగా చెప్పాలంటే.. పాస్‌పోర్ట్ లేకుండా ఇటలీకి వెళ్లొచ్చిన ఫీలింగ్ కావాలంటే.. ప్రశాంతంగా కొన్ని రోజులు గడపాలంటే.. లవాసా ఫర్‌ఫెక్ట్ టూరిస్ట్ స్పాట్. కొండలు, ఘాట్‌లు, సరస్సు, వ్యూపాయింట్, అక్కడి వాతావరణం, హిల్ సిటీ, ఒక్కసారి వెళ్లారంటే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేలా ఉంటుంది.
Also Read:
పుతిన్‌ను కూడా ఎత్తుకొచ్చేస్తారా.. డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఏంటంటే..
వ్యాపారంలో విభేదాలతోనే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య
అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల