IRCTC సమ్మర్ స్పెషల్.. విజయవాడ టూ తమిళనాడు టూర్ ప్యాకేజీ
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:23 PM
IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా మధురై, కొడైకెనాల్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ నుంచి తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను చూడాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ వేసవిలో ఆధ్యాత్మిక పర్యటనకు ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ప్యాకేజీ వివరాలు:
ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ ప్రకారం, 'తమిళనాడు టెంపుల్స్ అండ్ హిల్స్ EX విజయవాడ' ప్యాకేజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాకేజీ ఏప్రిల్ 25వ తేదీన విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమవుతోంది. ఆసక్తి గల ప్రయాణికులు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఈ ట్రిప్ మొత్తం 6 రోజుల పాటు ఉంటుంది. తంజావూరు, రామేశ్వరం, మదురై, కొడైకెనాల్ వంటి అద్భుతమైన ప్రాంతాలను సందర్శిస్తారు.
మొదటి రోజు విజయవాడ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం శ్రీనగరం ఆలయాన్ని దర్శించుకుంటారు.
రెండో రోజు తంజావూరుకు ప్రయాణమై బృహదీశ్వరాలయం సందర్శిస్తారు.
మూడో రోజు రామనాథస్వామి ఆలయం, స్థానిక దేవాలయాలను చూస్తారు.
నాలుగో రోజు మదురైకి వెళ్తారు. మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుని అనంతరం కొడైకెనాల్‌కు బయలుదేరుతారు.
ఐదో రోజు కొడైకెనాల్‌లోని పర్యాటక ప్రాంతాలను చూస్తారు.
చివరి రోజు మదురైకి ప్రయాణమై సాయంత్రానికి విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ. 51,050
డబుల్ ఆక్యుపెన్సీ: రూ. 37,900
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ. 36,300
టికెట్ల బుకింగ్‌తో పాటు మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారికి వెబ్‌సైట్ https://www.irctctourism.com ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
గత పాలకుల వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..
For More Latest News