Girls Trip Safety Tips: అమ్మాయిలూ ఈ అలెర్ట్ మీకోసమే.. ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 09:50 AM
అమ్మాయిలు స్నేహితులతో ట్రిప్‌కు వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. కానీ ఆనందంతో పాటు భద్రత కూడా ముఖ్యం. కాబట్టి ప్రయాణంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
ఇంటర్నెట్ డెస్క్: స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లడం జీవితంలో చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఈ క్షణాలు అమ్మాయిలకు మరింత స్పెషల్. ఎందుకంటే ఇలాంటి ప్రయాణాలు ప్లాన్ చేసుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. మీ గ్యాంగ్‌తో ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. సరదాతో పాటు భద్రతను కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
స్నేహితులతో కలిసి గడిపే ప్రయాణ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మిగులుతాయి. రోజువారీ జీవితంలో అందరూ తమ పనులతో బిజీగా ఉంటారు కాబట్టి.. ఈ ట్రిప్స్ మరింత విలువైనవిగా మారుతాయి. అయితే, నేటికీ చాలా కుటుంబాల్లో.. అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణించడంపై భయపడుతుంటారు. అందుకే అమ్మాయిలు ట్రిప్‌కు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
బస చేసే చోట జాగ్రత్త..
హోటల్‌లో బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. కొన్నిచోట్ల సీక్రెట్ కెమెరాలు ఉండే అవకాశముంటుంది. మీ ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో గది మొత్తం ఒకసారి చూసుకోండి. వీలైతే బట్టలు మార్చుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేయడం మంచిది.

అత్యవసర నంబర్లు దగ్గర ఉంచుకోండి..
మీరు వెళ్తున్న ప్రదేశానికి సంబంధించిన పోలీస్, అంబులెన్స్, హెల్ప్‌లైన్ నంబర్లను ముందే తెలుసుకుని మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఒక చిన్న కాగితంపై కూడా రాసుకుని పర్స్‌లో పెట్టుకోండి.
ప్రయాణంలో అప్రమత్తంగా ఉండండి
పగటిపూట ప్రయాణించడం ఉత్తమం. ఒక వేళ రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే గుంపుగా వెళ్లండి. క్యాబ్ బుక్ చేసేటప్పుడు నమ్మకమైన యాప్‌లనే ఉపయోగించండి. మీ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. హోటల్ పేరు, చిరునామా మీ దగ్గర నోట్ చేసుకుని ఉంచండి.

ఏ ప్రదేశంలో అయినా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది. పరిసరాలపై ఎప్పుడూ దృష్టి ఉంచండి. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులకు దూరంగా ఉండండి.
ఈ వస్తువులు తప్పనిసరిగా తీసుకెళ్లండి
చిన్న డైరీ, పెన్, హోటల్ కార్డ్, ఐడీ, కొంత నగదు, పవర్ బ్యాంక్ తీసుకెళ్లండి. భద్రత కోసం పెప్పర్ స్ప్రే, సేఫ్టీ పిన్స్ కూడా ఉంచుకోండి. బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు తీసుకెళ్లపోవడం ఉత్తమం.
ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, మీ ట్రిప్ సురక్షితంగా.. సరదాగ, గుర్తుండిపోయేలా ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News