Share News

డ్రై ఫ్రూట్స్‌కు పురుగులు పడుతున్నాయా? ఇవిగో సింపుల్ చిట్కాలు..

ABN , Publish Date - Jun 28 , 2026 | 07:54 AM

మనం రోజు వారీ ఆహారంలో కేవలం కూరగాయలు, పండ్లు మాత్రమే తీసుకుంటే సరిపోదు. వాటితోపాటు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

డ్రై ఫ్రూట్స్‌కు పురుగులు పడుతున్నాయా? ఇవిగో సింపుల్ చిట్కాలు..

ఇంటర్నెట్ డెస్క్: మనం రోజు వారీ ఆహారంలో కేవలం కూరగాయలు, పండ్లు మాత్రమే తీసుకుంటే సరిపోదు. వాటితోపాటు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది ఆహారంలో ఇవి భాగమయ్యాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతున్నారు.

కొన్నిసార్లు డ్రైఫ్రూట్స్‌కు బూజు, పురుగులు పడుతుంటాయి. అలా కాకుండా ఉండడానికి పలు సులభమైన చిట్కాలు ఉన్నాయి. వీటి వల్ల డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.


గాజు సీసాలో..

వీటిని నిల్వ ఉంచడానికి గాలి చొరబడని గాజు పాత్రలు అత్యంత ఉత్తమమైనవి. గాజు సీసా పాత్రలు.. గాలి నుంచి కాపాడతాయి. తేమను పీల్చుకోకుండా నివారిస్తాయి. పురుగులను పాత్రలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.


ఫ్రిజ్‌లో..

డ్రై ఫ్రూట్స్‌లో నూనె ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. వాల్‌నట్స్, బాదం పిస్తా, జీడిపప్పులను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు.


తేమకు దూరంగా..

వీటిని చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ ఉంచాలి. తేమ ఉన్న ప్రదేశంలో మాత్రం నిల్వ చేయవద్దు. అందుకోసం సీసా మూతను గట్టిగా మూసి ఉంచాలి. వీటికి తడి చేతిని, తడి స్పూన్‌ని తగల నివ్వద్దు. డబ్బా లోపలికి నీరు చేరకుండా చూడాల్సి ఉంది. అలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్‌ను పురుగుల బారి నుంచి కాపాడవచ్చు.


సూర్యరశ్మి..

డ్రై ఫ్రూట్స్‌ను ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా ఉంచాలి. అలాగే కిటికీ లేదా స్టవ్ వద్ద ఉంచవద్దు. డ్రై ఫ్రూట్స్‌ను వేర్వేరుగా గాజు పాత్రల్లో నిల్వ చేయడం వల్ల వాటికి పురుగులు, బూజు పట్టే అవకాశం చాలా చాలా తక్కువ.


వేయించి..

డ్రైఫ్రూట్స్ నిల్వ చేయడానికి ముందు.. సన్న సెగపై నూనె లేదా నెయ్యిలో వీటిని కొద్దిగా వేయించాలి. అలా చేస్తే అందులో తేమ శాతం తగ్గుతుంది. తద్వారా డ్రై ఫ్రూట్స్‌కు పురుగులు పట్టకుండా నివారించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?

వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

For More LifeStyle News And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 08:57 AM