గ్యాస్ స్టవ్ దగ్గర ఈ వస్తువులు పెడితే చాలా డేంజర్!
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:01 PM
వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. అందుకే వంటగది భద్రత కోసం ఏ వస్తువులను గ్యాస్ స్టవ్‌కు దూరంగా ఉంచాలో తెలుసుకోవడం చాలా అవసరం.
ఇంటర్నెట్ డెస్క్: వంటగదిలో భద్రత చాలా ముఖ్యం. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ చుట్టూ కొన్ని వస్తువులను ఉంచడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని వస్తువుల నాణ్యత కూడా దెబ్బతింటుంది. వంట సౌకర్యం కోసం స్టవ్ పక్కనే వస్తువులు పెట్టడం చాలామందికి అలవాటు. కానీ కొన్ని వస్తువులను మాత్రం స్టవ్‌కు దూరంగా ఉంచడం మంచిది.
అగ్గిపెట్టె, లైటర్లు
గ్యాస్ వెలిగించేందుకు ఉపయోగించే అగ్గిపెట్టె, లైటర్లను స్టవ్ పక్కనే ఉంచడం సాధారణమే. అయితే అధిక వేడి వల్ల అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది.
వంట నూనె
వంట నూనె డబ్బాను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచడం చాలా ప్రమాదకరం. వేడి కారణంగా డబ్బా ఎక్కువగా వేడెక్కే అవకాశం ఉంటుంది. అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి నూనెను ఎప్పుడూ స్టవ్‌కు దూరంగా, సురక్షిత ప్రదేశంలో నిల్వ చేయాలి.

ప్లాస్టిక్ వస్తువులు
ప్లాస్టిక్ డబ్బాలు, గిన్నెలు లేదా ఇతర ప్లాస్టిక్ వస్తువులను స్టవ్ దగ్గర ఉంచకూడదు. వేడి వల్ల అవి ఆకారం మారడం లేదా కరిగిపోవడం జరిగే అవకాశం ఉంటుంది.
కాగితాలు
కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు సులభంగా మంటలు అంటుకునే వస్తువులు. కాబట్టి వాటిని స్టవ్‌కు దూరంగా ఉంచాలి.
చెక్క చెంచాలు, కటింగ్ బోర్డులు
చెక్కతో చేసిన చెంచాలు, కూరగాయలు కోసే కటింగ్ బోర్డులను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచకూడదు. వేడి ప్రభావం వల్ల అవి నల్లబడటం, పగుళ్లు రావడం లేదా మంట అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని గ్యాస్ స్టవ్‌కు దూరంగా ఉంచడం మంచిది.

ఉప్పు, పంచదార, మసాలా జాడీలు
స్టవ్ నుంచి వచ్చే వేడి, ఆవిరి కారణంగా మసాలా దినుసులు త్వరగా పాడవుతాయి. వాటి రుచి, వాసన కూడా తగ్గిపోతాయి. అందువల్ల వీటిని స్టవ్‌కు కొంత దూరంలో నిల్వ చేయాలి.
వంటగది గుడ్డలు
చేతులు తుడుచుకోవడానికి లేదా వేడి పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే గుడ్డలను గ్యాస్ స్టవ్ పక్కన ఉంచడం మంచిది కాదు. అవి మంటకు లేదా వేడి పాత్రలకు తగిలితే గుడ్డలు కాలిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎప్పుడూ స్టవ్‌కు దూరంగా, సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం అవసరం.
గుర్తుంచుకోవాల్సిన విషయం
గ్యాస్ స్టవ్ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచాలి. కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు, నూనె డబ్బా వంటి వాటిని స్టవ్‌కు దూరంగా ఉంచడం ద్వారా వంటగదిలో ప్రమాదాలను నివారించవచ్చు.
Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మొదటి సంతానం ఆడపిల్ల అయితే తండ్రి అదృష్టం మారుతుందా?
వర్షాకాలంలో ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి