వర్షాకాలంలో ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ABN , Publish Date - Jun 05 , 2026 | 07:07 PM
వర్షాకాలంలో ట్రిప్ ప్లాన్ చేసే వారు మంచి అనుభూతి పొందాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్యాకింగ్ నుంచి ప్రయాణం వరకు కొన్ని ట్రావెల్ హ్యాక్స్ ఫాలో అయితే సురక్షితంగా, సౌకర్యంగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో ట్రిప్‌కి వెళ్లాలనుకునే వారు చాలామంది ఉంటారు. వర్షంలో తడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఒక ప్రత్యేక అనుభూతి. ఈ సమయంలో లొకేషన్లు మరింత అందంగా కనిపిస్తాయి. ఫొటోలు తీసుకోవడానికి కూడా ఇది సరైన సమయం. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రిప్‌ను ఎంజాయ్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన ట్రావెల్ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.
ప్యాకింగ్ సమయంలో జాగ్రత్తలు
వర్షాకాల ట్రిప్‌కి వెళ్లేటప్పుడు వాటర్‌ప్రూఫ్ బ్యాగ్స్, కవర్స్ ఉపయోగించాలి. ఇవి మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్స్‌తో పాటు దుస్తులను కూడా కాపాడుతాయి. తేలికగా ఆరిపోయే దుస్తులు, సింథటిక్ డ్రెస్సులు తీసుకెళ్లడం మంచిది. భారీ దుస్తులు తడిస్తే ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. వాటర్‌ప్రూఫ్ షూలు, గొడుగు, రైన్‌కోట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ట్రావెల్ సమయంలో టిప్స్
ప్రయాణానికి ముందు వాతావరణ సూచనలు తప్పనిసరిగా చెక్ చేయాలి. భారీ వర్షాలు లేదా వరద హెచ్చరికలు ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. రోడ్ ట్రిప్స్ కంటే ట్రైన్ లేదా ఫ్లైట్ ప్రయాణం సురక్షితం. నెట్‌వర్క్ సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున ఆఫ్‌లైన్ మ్యాప్స్ ఉపయోగించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ముందుగానే హోటల్స్ బుక్ చేసుకోవడం మంచిది. వర్షాలతో నిండిపోయే ప్రాంతాలకు వెళ్లకూడదు. అవసరమైన మందులు, దోమల నివారణ క్రీములు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ దగ్గర ఉంచుకోవాలి. వరద ప్రమాదం ఉన్న ప్రాంతాలు, జలపాతాల దగ్గరికి వెళ్లకుండా ఉండాలి. ట్రెక్కింగ్ ప్రదేశాల్లో జాగ్రత్త అవసరం.
Also Read:
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026.. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత