ప్రముఖ నటుడు సలీం కుమార్‌కు సీరియస్.. వెంటిలేటర్‌పై చికిత్స
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:02 PM
ప్రముఖ సీనియర్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. శనివారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు సలీం కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు ఊహించని విధంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అత్యవసర విభాగానికి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గతంలో కూడా సలీం కుమార్ కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంట్) శస్త్రచికిత్స చేయించుకున్నారు. మిమిక్రీ, నాటక రంగాల ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. 1997లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హాస్య నటుడిగా, విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసుకున్నసలీం కుమార్.. 2010లో ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. వీటితో పాటు నాలుగు సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుతని వెంటాడిన పులి.. వీడియో వైరల్
జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్